Chandrababu Comments On Cm YS Jagan: 

రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఖాయమని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మండపేట పట్టణంలోని కలవపువ్వు సెంటర్ టౌన్ హాల్ వద్ద బుధవారం చంద్రబాబు నాయుడు భవిష్యత్ గ్యారెంటీ బహిరంగ సభలో  పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు విరుచుకు పడ్డారు. ఈ సైకో 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు, ఎక్కడైనా రోడ్లు వేశాడా, పరిశ్రమలు తెచ్చాడా అని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో టీడీపీ ప్రభుత్వం రాబోతుందని, కరెంట్ రేట్లు పెంచం, తగిస్తామని ప్రజలకు చంద్రబాబు హామీ ఇచ్చారు. వైస్సార్సీపీ ప్రభుత్వం 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకుంటుందన్నారు. టీడీపీ ప్రభుత్వం సంపద సృష్టించి మీకోసమే ఖర్చు చేస్తుతుందని,

అవినీతి పోవాలన్నారు. జగన్మోహన్ రెడ్డి తిన్నది మొత్తం కక్కిస్తాం. రాబోయే రోజుల్లో ఫ్రీడమ్ ఫ్రమ్ కరప్షన్ తీసుకుంటాం. గ్రీన్ టాక్స్ 5 వేలు ఉన్నదాన్ని 30 వేలు చేశాడు, అన్ని రాష్ట్రాల్లో లేనంత పెట్రోల్ రేట్లు ఇక్కడ ఉన్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. 

 

ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి నయవంచన... 

గతంలో హైదరాబాద్ ఎంత అభివృద్ధి చేసానో మీకు తెలుసు, ఏపీ విజన్ 2047 తీసికొచ్చే బాధ్యత తనదన్నారు. 2019 లో ఒక ఛాన్స్ అని తండ్రి పేరు చెప్పుకొని అధికారం లోని వచ్చాడు జగన్మోహన్ రెడ్డి, కానీ మీ జీవితాలు మారయా...  ఈ అయిదు సంవత్సరాలు ఉద్యోగాలు రాలేదు, మీ నియోజకవర్గంలో నెలకు 300 కోట్లు ఇసుక ర్యాంపు ను దోచేస్తున్నారు, విశాఖలో ఋషికొండ తవ్వేశారు, ఇక్కడ ఇసుకను తవ్వ్వెస్తున్నారు... అక్కడ కొండలను తవేస్తున్నారన్నారంటూ మండిపడ్డారు.

40 లక్షల భవననిర్మాణ కార్మికులు పొట్టకొట్టారు, మధ్యపాన నిషేధం అని చెప్పాడు. రేట్లు తగించాడా.. ఈ మద్యం ద్వారా వచ్చిన డబ్బులు తాడేపల్లి కు తరలి వెళ్లిపోతున్నాయి అన్నారు చంద్రబాబు.

 

తాపేశ్వరం కాజా లాగా మండపేట ప్రజలది తీయని మనసు... 

తాపేశ్వరం ఖాజా చాలా ఫేమస్.. అది ఎంత తియ్యగా ఉంటుందో అంత తియ్యని మనసు మండపేట ప్రజలది,  టీడీపీ కంచుకోట మండపేట. మండపేట కు వచ్చింది భవిష్యత్ గ్యారెంటి, బాబు గ్యారంటీ తెలపడానికి అన్నారు చంద్రబాబు.

 

మహిళలకు పెద్ద పీట వేస్తామని హామీ... 

మహాశక్తి పథకం లో భాగంగా ప్రతి తల్లికి ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి 15 వేలు రూపాయలు ఇస్తామని చంద్రబాబు తెలిపారు.  సంవత్సరం 3 సిలిండర్ లు ఇస్తాం, ప్రతీ మహిళలకు 1500 రూపాయలు ఇస్తామన్నారు. మండపేటలో చదువుకున్న ఆడపిల్లలు చేతిలో హారతి ఇచ్చి మీరు ముఖ్యమంత్రి గా వచ్చి భవిష్యత్ గ్యారంటీ ఇవ్వాలని అని అన్నారు. పరిశ్రమలు తీసికొని వస్తాం, వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకువస్తామన్నారు. పిల్లలూ మీ మీద నాకు నమ్మకం ఉంది., ఈ ఆరు నెలలు టీడీపీ జెండా పట్టుకొని టీడీపీ భవిష్యత్ కు గ్యారంటీ అని ఇంటి ఇంటికి తిరిగి టీడీపీ కోసం పనిచేయ్యండి అన్నారు.

 

ప్రతీ రైతును ఆదుకుంటాం...

టీడీపీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన వెంటనే ప్రతీ రైతులుకు 7000 రూపాయలు ఇస్తాం, వరి ధాన్యానికి మంచి గిట్టుబాటు ధర ఇస్తామన్నారు. చేనేత కార్మికులకు సహాయంగాని, లోన్ లు గాని టీడీపీ ప్రభుత్వం లో వచ్చేవి, టీడీపి హయాంలో 55 సంవత్సరాలు పై బడిన వారికి పెన్షన్ లు ఇచ్చామని తెలిపారు. 

15 లక్షల చేనేత కార్మికులు ఉంటే ఒక లక్ష మందికి మాత్రమే ఇచ్చారు, ఏడిద గ్రామంలో 250 మగ్గాలు ఉంటే 30 మందికి మాత్రమే ఇస్తున్నారు. ఇది దారుణం అన్నారు. 

 

టీడీపీ పాలనలో రౌడీయిజాన్ని అణచివేశాం... 

పోలీసులు మంచివారు, ఎటువంటి పరిస్థితుల్లో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తారు, టీడీపీ హయాంలో రౌడీలను అణిచివేశాం.. కానీ ఇప్పుడు కొంత మంది పోలీసులు టీడీపీ నాయకులు పై అక్రమంగా కేసులు పెడుతున్నారు. పోలీసులు కు డీఏ, టీఏ, ఎల్ ఎస్, ఎస్ఎల్ ఎస్ రావడం లేదన్నారు. మండపేట లో జోగేశ్వరరావు ఉన్నప్పుడు 1000 కోట్లు రూపాయల ఖర్చు చేశారు,  486 కోట్ల రూపాయలతో 6276 మందికి టిడ్కో ఇళ్లు ఇచ్చామని చెప్పారు. పంటకాలువ లో పూడికలు, గుర్రపు డెక్క తియ్యడం లేదు, టీడీపీ హయాంలో ఇలా లేదన్నారు. 

ప్రక్క నియోజకవర్గంలో నుంచి ఇక్కడికి వచ్చాడు ఒకడు, ఇతను కపిలేశ్వరపురం ఇసుక ర్యాంప్ నుండి నెలకు 300 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు, అక్రమంగా త్రవ్వకాలు కారణంగా 10 కోట్ల రూపాయలు ఫైన్ కూడా వేశారు,  ద్వారపూడి, కేశవరం గ్రామాల్లో అక్రమంగా మట్టిని దోచుకుంటున్నారు. ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే పెన్షన్ తీసివేస్తున్నారు. కాజులూరు మండలం, పల్లిపాలం లో 35 ఎకరాలు దోచుకొని తను కుటుంబం సబ్యుల పేరిట రిజిస్ట్రేషన్ చేశారు, దీనిపై ఆర్డిఓకు కూడా నోటీస్ చేశామని చెప్పారు.
  పిల్లలకు విదేశీ విద్య, అన్నా క్యాంటీన్ ఇచ్చే బాధ్యత నాది అన్నారు. ఇప్పుడు ఇస్తున్న దానికంటే 3 రేట్లు సంక్షేమం టీడీపీ ప్రభుత్వం ఇస్తుంది అని అన్నారు.

 

దళితుడ్ని చంపి డోర్ డెలివరీ చేశారు... 

 ఇక్కడే ఉన్న ఎమ్మెల్సీ ఒక దళిత కులానికి చెందిన డ్రైవర్ చంపి డోర్ డెలివరీ చేశారు. పుంగనూరు లో నాపై దాడి చేసి నామీద కేసు పెట్టారు, బాబాయిని గొడ్డలితో చంపేసి నారా వారి చరిత్ర అని నా పై దుష్ప్రచారం చేశారు. మండపేటలో మొదటసారిగా డిక్లరేషన్ ఇస్తున్న.. భవిష్యత్ గ్యారెంటీ అని చెబుతున్నాను.

14 సంవత్సరాలు ముఖ్యమంత్రి గా పనిచేశాను, వైస్సార్సీపీ ప్రభుత్వం 5సంవత్సరాలులో జరగరాని నష్టం జరిగిందన్నారు. నేను ఈరోజు సాగునీటి ప్రాజెక్టులు పై మాట్లాడాను దాని మీద ఎవరూ మాట్లాడరు, మతిస్థిమితం లేని వ్యక్తిని ముఖ్యమంత్రి గా చేశారు, ఈ ప్రభుత్వానికి ఎక్స్పైర్ టైం వచ్చిందన్నారు చంద్రబాబు

 

సౌత్ కొరియా, నార్త్ కొరియాలాగ ఆంధ్ర, తెలంగాణ గా మారాయి, రాబోయే రోజుల్లో టీడీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆంద్రప్రదేశ్ ను మొదటి స్థానానికి తీసుకువచ్చే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాజమండ్రి  రూరల్  ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి, అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ ఇంచార్జి హరీష్ మాధుర్, ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్, రాజోలు మాజీ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు, రామచంద్రపురం టిడిపి ఇన్చార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం, తదితరులు పాల్గొన్నారు.