Chandrababu East Godavari Tour: టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కాకినాడ జిల్లా, తూర్పు గోదావరి జిల్లాల పర్యటన షెడ్యూల్ ఖరారైంది. రేపటి (బుధవారం) నుంచి మూడు రోజుల పాటు కాకినాడ జిల్లా, తూర్పు గోదావరి జిల్లా లలో చంద్రబాబు పర్యటించనుండగా.. పార్టీ నేతలు ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పార్టీ నేతలు, కార్యకర్తలను కోరారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పార్టీ అధినేత పర్యటనను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లి సత్తిబాబు పార్టీ శ్రేణులను కోరారు. ఫిబ్రవరి 15, 16, 17న చంద్రబాబు ఈ రెండు జిల్లాల్లో పర్యటన వివరాలిలా ఉన్నాయి.
ఫిబ్రవరి 15, బుధవారం షెడ్యూల్
మధ్యాహ్నం 01.00 గంటలకు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని. నివాసం నుంచి బయలుదేరనున్న చంద్రబాబు
01.20 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు
01.30 గంటలకు విమానం బేగంపేట విమానాశ్రయం నుంచి పయనం
02.30 గంటలకు రాజమండ్రి విమానాశ్రయానికి చేరిక
02.40 గంటలకు రాజమండ్రి విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో ప్రయాణం
03.30 గంటలకు కాకినాడ జిల్లా (వయా : గుమ్మలదొడ్డి) మీదుగా గోకవరం గ్రామం & మండల కేంద్రంలో శ్రీనివాస థియేటర్ కు చేరుకుంటారు
03.30 నుండి 04.15 గంటలకు రోడ్ షో (దేవి చౌక్, LIC ఆఫీస్). దేవి చౌక్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు
04.15 గంటలకు LIC ఆఫీసు, గోకవరం గ్రామం & మండలం (రోడ్డు మార్గం)
05.15 గంటలకు కొత్తపల్లి బస్టాండ్ సెంటర్, మల్లిసాల మీదుగా జగ్గంపేట మండలం రాజపూడి గ్రామంలో
సాయంత్రం 05.15 నుండి 05.30 వరకు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు
05.30 గంటలకు జగ్గంపేట మండలం రాజపూడి గ్రామానికి చంద్రబాబు
06.00 గంటలకు గోలి శ్రీరాములు లేఅవుట్, జగ్గంపేట గ్రామం & మండలం
06.00 నుండి 06.15 గంటల వరకు రిజర్వ్ టైమ్
06.15 నుండి 06.45 గంటల వరకు గోలి శ్రీరాములు లేఅవుట్ నుండి బస్టాండ్ వరకు రోడ్ షో
సాయంత్రం 06.45 నుండి 07.00 వరకు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు
07.00 నుండి 08.00 వరకు పబ్లిక్ మీటింగ్
08.00 PM గంటలకు రోడ్డు మార్గంలో జగ్గంపేట బస్టాండ్ వైపు నుంచి పయనం
08.15 గంటలకు జగ్గంపేటలోని జ్యోతుల నెహ్రూ క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. చంద్రబాబు రాత్రి అక్కడే బస చేస్తారు
ఫిబ్రవరి 16, గురువారం షెడ్యూల్
10.45 గంటలకు జ్యోతుల నెహ్రూ క్యాంపు కార్యాలయం, జగ్గంపేట (రోడ్డు మార్గం)
11.00 గంటలకు జగ్గంపేట HP పెట్రోల్ పంప్ పక్కన ఉన్న ఓపెన్ గ్రౌండ్
11.00 నుంచి 01.00 గంటల వరకు పార్టీ నేతలతో చంద్రబాబు సమావేశం
01.00 నుండి 02.00 గంటల వరకు విశ్రాంతి
02.00 గంటలకు జగ్గంపేట నుంచి ప్రయాణం
సాయంత్రం 04.30 గంటలకుజె. తిమ్మాపురం, కట్టమూరు క్రాస్ మీదుగా ప్రయాణించి పెద్దాపురం టౌన్ దర్గా సెంటర్ వద్దకు
04.30 నుండి 05.15 గంటల సమయంలో దర్గా సెంటర్ నుండి వెంకటేశ్వర స్వామి టెంపుల్ వరకు రోడ్ షో
05.30 గంటలకు పెద్దాపురంలోని ఆంజనేయ స్వామి దేవాలయం
05.30 నుండి 06.30 గంటల వరకు టీడీపీ బహిరంగ సభ
సాయంత్రం 06.30 నుండి రాత్రి 07.30 వరకు రోడ్ షో
0.7.45 గంటలకు సామల్ కోటలో షుగర్ ఫ్యాక్టరీ గెస్ట్ హౌస్ కు చేరుకోనున్న చంద్రబాబు. రాత్రి అక్కడే బస చేస్తారు
ఫిబ్రవరి 17, శుక్రవారం షెడ్యూల్
ఉదయం 11.00 నుంచి 01.30 వరకు పార్టీ నేతలతో చంద్రబాబు సమావేశం
02.00 గంటలకు షుగర్ ఫ్యాక్టరీ గెస్ట్ హౌస్, సామల్కోట నుంచి బయలుదేరి వెట్లపాలెం గ్రామం చేరుకుంటారు
మధ్యాహ్నం 02.30 నుండి 03.00 వరకు బొడ్డు భాస్కర రామారావు విగ్రహానికి పూలమాలలు
03.00 గంటలకు సామలకోట మండలం వెట్లపాలెం గ్రామం నుంచి పయనం
05.30 గంటలకు తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి గ్రామం & మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి దేవాలయం చేరుకుంటారు
05.30 నుండి 06.30 గంటలకు అయ్యప్ప స్వామి ఆలయం నుండి దేవి చౌక్ వరకు చంద్రబాబు రోడ్ షో
07.00 గంటలకు అనపర్తి మండలంలోని రామవరం గ్రామం వెళ్తారు
07.30 నుండి 07.45 గంటలకు ఎన్. రామకృష్ణారెడ్డి నివాసానికి చంద్రబాబు
08.45 గంటలకు రాజమండ్రి విమానాశ్రయం చేరుకుంటారు
రాత్రి 09.45 గంటలకు రాజమండ్రి విమానాశ్రయం (6E 7126 ద్వారా హైదరాబాద్ కు పయనం)
రాత్రి 11.05 గంటలకు శంషాబాద్ RGI విమానాశ్రయానికి చంద్రబాబు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ప్రయాణం
రాత్రి 11.50 గంటలకు పర్యటన ముగించుకుని హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ నివాసానికి చేరుకుంటారు