Nagababu: ఎలక్షన్ ఇంకా పూర్తి కాలేదు, అరాచకాలకు ఛాన్స్! స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పహారా ఉండాలి: నాగబాబు

Shankar Dukanam Updated at: 18 May 2024 11:04 PM (IST)

Andhra Election Results 2024: ఏపీలో కేవలం ఓటింగ్ పూర్తయిందని, కౌంటింగ్ ముగియలేదని, అప్పటిమరకూ స్ట్రాంగ్ రూమ్స్ వద్ద కాపాలా ఉండాలని కూటమి శ్రేణులకు నాగబాబు పిలుపునిచ్చారు.

జనసేన నేత నాగబాబు

NEXT PREV

Janasena Leader Naga Babu: అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిశాయి అనుకోవద్దని, ఓట్ల లెక్కింపు ఇంకా పూర్తికాలేదని.. కౌంటింగ్ ముగిసే వరకూ అప్రమత్తంగా ఉండాలని కూటమి పార్టీల శ్రేణులకు నాగబాబు పిలుపునిచ్చారు. ఓటమి కళ్ల ముందు కనిపించడంతో వైసీపీ శ్రేణులు ఎలాంటి అరాచకానికి పాల్పడుతారో పల్నాడు, తాడిపత్రి, తిరుపతిల్లో చూశామన్నారు. ఏపీ ఎన్నికల్లో దాదాపు 82 శాతం ఓట్లు పోలవడం ప్రజాస్వామ్య విజయం అని, కానీ కౌంటింగ్ పూర్తయ్యే వరకు ఎలక్షనీరింగ్ పూర్తి కాలేదన్నారు. 


జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు మాట్లాడుతూ.. మనం సైకోపాత్ అనే మాట వింటుంటాం. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆ కోవలోకి వస్తాడో లేదో గానీ కచ్చితంగా అతనో సోషియోపాత్. ప్రజలను కులాలు, వర్గాలు, పార్టీలవారీగా విడదీసి ఆనందించే రకం. ఆ మానసిక స్థితిని మొదట్లో ఎవరూ గుర్తించలేదు. ఆ సోషియోపాత్ మానసిక స్థితి రోజురోజుకీ ముదిరింది. ఓటమి కనిపిస్తుండటంతో వైసీపీ శ్రేణులు ఉన్మాదంతో ప్రజల ఇళ్లపైపడి అరాచకం సృష్టిస్తున్నాయని’ అన్నారు. 


ఎస్.జె.సూర్య గుర్తుకొస్తున్నాడు


మాచర్ల వైసీపీ ఎమ్మెల్యేకు సంబంధించిన వారి ఇళ్ళలో పెట్రోలు బాంబులు దొరికాయంటే ఫలితాలు వచ్చాక వీళ్ళు ఏం చేయనున్నారో ప్రజలు గ్రహించాలి. తమను తాము రక్షించుకొనేందుకు తాడిపత్రిలో పోలీసులు అగచాట్లు పడ్డారు అంటే వైసీపీ ఎంతగా రెచ్చిపోతుందో చూడండి. వైసీపీకి ఓటు వేయలేదని తెలిస్తే ఇళ్లలోకి చొరబడి చావగొట్టే పైశాచికత్వాన్ని పెంచింది జగన్. విశాఖపట్నంలోని కందరపాలెంలో ఓ కుటుంబం కూటమి అభ్యర్ధులకు ఓటు వేసిందని తెలిసి వైసీపీ గూండాలు ఆ ఇంట్లోని మహిళలపై దుర్మార్గంగా దాడి చేసింది. గర్భవతిపైనా దాడి చేశారంటే అంటే వైసీపీ రాక్షసత్వం ఏ స్థాయిలో ఉందో తెలుసుకోండి. ఇవన్నీ చేపించి చక్కటి చిరునవ్వులు చిందిస్తున్న జగన్‌ను చూస్తే మహేశ్ బాబు స్పైడర్ సినిమాలో ఎస్.జె.సూర్య గుర్తుకొస్తున్నాడు-
నాగబాబు


స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర ఇప్పటికే ఈసీ నాలుగంచెల భద్రత ఏర్పాటు చేసింది. వైసీపీ శ్రేణులను ఏ దశలోనూ తెలికగా తీసుకోవద్దు. వాళ్ళు ఏ అరాచకానికైనా తెగబడతారని నాగబాబు అన్నారు. స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర కాపలాగా ఉండేందుకు పార్టీల ప్రతినిధులకు ఎన్నికల కమిషన్ ఇచ్చిన అవకాశాన్ని వాడుకుందాం, కూటమి పార్టీల ప్రతినిధులు నిరంతరంగా పహారా ఉండాలన్నారు. జనసేన పోటీ చేసిన స్థానాల్లో స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర స్వచ్ఛందంగా పహారా చేయాలని జనసైనికులకు పిలుపునిచ్చారు. 


జగన్‌లో డొనాల్డ్ ట్రంప్ లక్షణాలు
ఏపీ సీఎం జగన్‌లో డొనాల్డ్ ట్రంప్ మానసిక లక్షణాలు కూడా వచ్చాయన్నారు. కొన్నేళ్ల కిందట జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోతాడని తెలిసి నేనే గెలుస్తున్నాను... గతం కంటే ఎక్కువ ఓట్లు అని ప్రచారం మొదలుపెట్టినా ఓడిపోయాడని నాగబాబు గుర్తుచేశారు. ఎన్నికల్లో ఓడాక కుర్చీ దిగనని నానా యాగీ చేస్తే.. బలవంతంగా వైట్ హౌస్ నుంచి పంపేశారని చెప్పారు. మొన్న ఐప్యాక్ మీటింగులో వైసీపీ గెలుస్తుందని జగన్ గొప్పలు చెప్పాడని.. ఆయన కింద నేతలు సైతం విశాఖలో ప్రమాణస్వీకార ముహూర్తం అని ప్రకటించడంపై సెటైర్లు వేశారు. జూన్ 4 తరవాత వీళ్ళందరినీ విశాఖలో ఉన్న 'ఆ' ఆసుపత్రిలో చేర్చాల్సిందే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.






ఎన్నికల ఫలితాలు వచ్చాక జగన్ తన బృందంతో రాష్ట్ర వ్యాప్తంగా దాడులు, హింసకు తెగబడే ప్రమాదం ఉందన్నారు. అందుకే జూన్ 15 వరకూ కేంద్ర బలగాలను మోహరించాలని కేంద్రం చెప్పినట్లు గుర్తుచేశారు. అరాచక శక్తుల నుంచి అధికారం చేతులు మారే శుభ గడియ కోసం వేచి చూద్దామన్నారు.

Published at: 18 May 2024 10:55 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.