అమరావతి: కూటమి పాలన ఏడాదైన సందర్భంగా సూపర్ సిక్స్ లో భాగంగా తల్లికి వందనం (Talliki Vandanam) స్కీంను ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. 67 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం అమలు చేస్తున్నారు. ఈ పథకం ద్వారా విద్యార్థులను స్కూల్, ఇంటర్ కాలేజీలకు పంపుతున్న తల్లులకు ఖర్చు రూ 10,091 కోట్లు అందిస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. 

ఒక్కో విద్యార్థికి రూ.15 వేలు చొప్పున కేటాయించారు. అయితే ఇందులో రూ.2 వేలను స్కూల్ మెయింటనెన్స్, పచ్చదనం పరిశుభ్రత, డెవలప్ గ్రాంట్ కింద స్కూల్ ఖాతాలకు చేరుతుందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇదివరకే తెలిపారు. గతంలో ఇంట్లో ఎంత మంది పిల్లలున్నా ఒక్కరకే అమ్మ ఒడి నగదు ఇచ్చేవారని.. ఇప్పుడు ఇంట్లో ఉన్న అందరు పిల్లలకు తల్లికి వందనం ఇస్తున్నారని తల్లులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలను స్కూల్, ఇంటర్ కాలేజీలకు పంపిస్తున్న తల్లుల ఖాతాల్లో నగదు అవుతోంది.

ఇద్దరు పిల్లలు ఉంటే రూ.26 వేలు తల్లుల ఖాతాల్లో జమ చేస్తోంది ఏపీ ప్రభుత్వం. నలుగురు పిల్లలు ఉన్న తల్లికి, "తల్లికి వందనం" కింద చంద్రబాబు ప్రభుత్వం రూ.60 వేలు మంజూరు చేసింది. స్కూల్ డెవలప్ గ్రాంట్ కింద 8 వేలు పోనూ మిగతా రూ.52 వేలు తల్లి ఖాతాలో కావడంపై హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్ లకు ఆ కుటుంబం ధన్యవాదాలు తెలిపిందని టీడీపీ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. 

జగన్ మోహన్ రెడ్డి రెడ్డి 5 ఏళ్ళలో ఖాతాలో జమ చేసిన డబ్బు, చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఒక్క ఏడాదిలో ఇవ్వడంతో ఆ కుటుంబం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా, మహిళల ఖాతాల్లో ఒకే రోజు వేల కోట్లు వేసి జమ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.  సంక్షేమం, అభివృద్ధి జోడెడ్ల బండి పై కూటమి ప్రభుత్వ ప్రయాణం ఏడాది పూర్తయిందని.. ఇకనుంచి పరుగులు పెట్టిస్తామని నారా లోకేష్ ఇదివరకే స్పష్టం చేశారు. 

కూటమి ప్రభుత్వంలో మహిళలే మహారాణులు అని కూటమ నేతలు చెబుతున్నారు. రాష్ట్రంలో ఉన్న తల్లుల ఖాతాల్లో, "తల్లికి వందనం" కింద ఒకే రోజు రూ.10 వేల కోట్లు జమ చేశామంటున్నారు.  ముగ్గురు పిల్లలు ఉన్న తల్లి ఖాతాలో, రూ.39 వేలు జమ చేశారు. స్కూల్ ఖాతాలో మరో రూ.6 వేలు క్రికెట్ అయ్యాయని తెలిపారు.

 మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో పాఠశాలలు తెరిచిన రోజే, పిల్లలకు కొత్త పుస్తకాలు, యూనిఫారం, బెల్ట్, బూట్లు, సాక్సులు పిల్లలకు అందజేశారు. స్కూల్స్ తెరిచిన మొదటి రోజే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకంలో నాణ్యమైన కిట్లు ఇచ్చిన నారా లోకేష్‌కి పిల్లలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ధన్యవాదాలు తెలిపారు.