Andhra Pradesh News | స‌ముద్ర‌పు నాచులో ఎన్నో పోష‌క విలువ‌లు, ఔష‌ద గుణాలు ఉన్నాయ‌ని ఇప్ప‌టికే ప‌లు ప‌రిశోధ‌న‌ల్లో తేలింది.. దీంతో స‌ముద్ర‌పు నాచుతో త‌యారైన వంట‌కాలు, కుకీస్‌, మెడిస‌న్స్, కాస్మొటిక్స్ ఇలా అనేక ర‌కాల ఉత్ప‌త్తులు త‌యారీ బాగా పెరిగాయి.. దీంతో స‌ముద్ర నాచు ఉత్ప‌త్తుల‌పై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించడంతోపాటు వాటి ఉత్ప‌త్తి యూనిట్లు కూడా ఏర్పాటు చేసుకునేందుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌ట్టింది.. దీంట్లో భాగంగా  పైల‌ట్ ప్రాజెక్ట్‌గా అంబేడ్క‌ర్ కోన‌సీమ జిల్లా క‌లెక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్‌కుమార్ చొర‌వ‌తో కోన‌సీమ తీర‌ప్రాంతాల్లో ఈ యూనిట్లు ఏర్పాటుకు ప్రోత్స‌హ‌మందిస్తోంది.. పైల‌ట్ ప్రాజెక్ట్‌గా అంబేడ్క‌ర్ కోన‌సీమ జిల్లా... సముద్ర తీరపు నీటి అడుగు భాగాన సముద్రపు నాచు పెంచేయూనిట్ల ఏర్పాటుకు అంబేడ్కర్ కోన‌సీమ జిల్లా ఎంపిక కాగా దీంట్లో భాగంగా జిల్లా క‌లెక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్‌కుమార్‌,  కేంద్ర మంత్రిత్వ శాఖ పర్యావరణ మరియు అటవీ క్లైమేట్ చేంజెస్ శాస్త్రవేత్తలు డాక్టర్ మహమ్మద్ రఫీక్ డాక్టర్ జయంతి సుతార్ మత్స్య శాఖ అటవీ శాఖ, జిల్లా కోఆర్డినేషన్ అసోసియేట్ సభ్యులు డిఆర్డిఏ అధికా రుల తో ఇటీవల సమావేశం నిర్వహించి సముద్రపు నాచు యూనిట్లు స్థాపన పై సమీ క్షించారు. కోనసీమ తీర ప్రాంతం కూడా సముద్రపు నాచు తయారీకి అనువైన ప్రాంతమని గుర్తించి యూనిట్ల స్థాపనలో 50% ఆర్థిక సహాయం అందిం చేందుకు ముందుకు రావడం జరిగిందని క‌లెక్ట‌ర్ తెలిపారు. ఆ ప్రకారం జిల్లాలో తొలి దశలో సము ద్రతీర ప్రాంతంలో నాచు తయారీకి 20 యూనిట్ల ఏర్పాటుకు సమగ్ర ప్రతిపా దనలు రూపొందించా లని ఆదేశించారు.
 
తొలుతగా ఎక్స్పోజర్ విజిట్ కు ఒరిస్సాకు కమ్యూనిటీ మొబలైజేషన్ మహిళలను వారి భర్తలతో మత్స్యశాఖ ఎఫ్డిఓ లతో పంపేందుకు సిద్ధం చేయాలని ఆదేశించారు. వీరు సముద్రపు నాచు తయారీ ప్రాసెసింగ్ విధానాలు ప్యాకింగ్ అంశాలపై పూర్తిగా తర్ఫీదును పొం దేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.  యూనిట్ల ఏర్పా టుకు అవసరమైన పరి కరాలను సీడును రవాణా తో సహా ఆన్లైన్ పేమెంట్లు నిర్వహిస్తూ యూనిట్ల స్థాపనకు చర్యలు తీసుకోవా లన్నారు. అక్టోబర్ 15 నాటికి పూర్తిస్థాయి ప్రతి పాదనలను క్రోడీకరించి యూనిట్ల స్థాపనకు చర్యలు వేగవంతం చేయాలన్నారు.
ఆస‌క్తి ఉంటే యూనిట్ల ఏర్పాటుకు తోడ్పాటు..స‌ముద్ర‌నాచు అనేది ఇప్ప‌డు అత్యంత డిమాండ్ ఉన్న ఉత్ప‌త్తుల్లో ఒక‌టిగా గుర్తించిన అధ్య‌య‌న బృందం ఈ యూనిట్ల ఏర్పాటు ద్వారా స‌ముద్ర‌నాచు ఉత్ప‌త్తుల్లో కోన‌సీమ జిల్లాను అగ్ర‌గామిగా ఉంచాల‌న్న ల‌క్ష్యంతో చూస్తోంది.. యూనిట్ల స్థాప‌న‌కు 50 శాతం ఆర్దీక సాయం అందించేందుకు ప్ర‌భుత్వం ముందుకు రాగా ఈ యూనిట్ల ఏర్పాటుకు ఇంట్రెస్ట్ ఉంటే జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యాన్ని కానీ, మ‌త్స్య‌శాఖ జాయింట్ డైరెక్ట‌ర్‌ను కానీ సంప్ర‌దించ‌వ‌చ్చు అని అధికారులు చెబుతున్నారు.