Rajahmundry Havelock Bridge will be converted into a tourist center :  రాజమండ్రిలో వందేళ్లకుపైగా సేవలు అందించిన హేవలాక్ రైల్వే వంతెనను టూరిజం స్పాట్ గా మార్చే ప్రయత్నాలు మళ్లీ పట్టాలెక్కాయి. కొత్త బ్రిడ్జిల నిర్మాణం అనంతరం హేవలాక్ వంతెనను ఉపయోగించడం రైల్వే శాఖ ఆపేసింది. దీంతో ఈ వంతెనను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తే టూరిజం స్పాట్ గా మారుస్తామని ఫుడ్ కోర్టులతో పాటు ఇతర  వినోద కేంద్రాలు ఏర్పాటు చేసి గోదావరిని ఆస్వాదించాలనుకునేవారి కోసం కొత్త ఏర్పాట్లు చేయాలని అనుకున్నారు.  2014-19 మధ్య ఇందు కోసం ప్లాన్ రెడీ అయింది. అయితే తర్వాత వైసీపీ ప్రభుత్వం రావడంతో ఆ ప్రణాళికలన్నీ పక్కకు పోయాయి. 


2018లోనే హేవలాక్ వంతెన టూరిజం ప్రతిపాదనలు                               


ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వం రావడంతో  మరోసారి హేవలాక్ వంతెనను టూరిజం స్పాట్ గా మార్చే ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. టూరిజం మంత్రిగా నిడదవోలు నుంచి గెలిచిన కందుల దుర్గేష్ వ్యవహరిస్తూండటంతో మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాు. ఈ వంతెనను టూరిజం కేంద్రంగా మార్చడానికి రూ. 120 కోట్లతో అంచనాలను సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. నడకు అనుకూలంగా మార్చి. వరదలు లేనప్పుడు గోదావరి తిన్నెలకు చేరుకునేలా ఏర్పాట్లతో పాటు మరికొన్ని అదనపు హంగులు కల్పించే అవకాశం ఉంది. వచ్చే రెండు, మూడేళ్లలో పర్యాటకులకు అందుబాటులోకి తెచ్చే ఆలోచనలో ఉన్నారు. 


120 ఏళ్ల చరిత్ర - వందేళ్లకుపైగా సేవలు                                   


హావలాక్ వంతెన. నిర్మించి ఇప్పటికి 120 సంవత్సరాలు  అయింది. 1900వ సంత్సరంలో దీనిని అప్పటి మద్రాసు గవర్నర్ అర్ధర్ ఎలిబంక్ హేవలాక్ పేరుమీద దీని నిర్మించారు. చరిత్ర ప్రవాహంలో శతాబ్ధపు సేవలకు జ్ఞాపకంగా నిలిచింది..  దేశంలో దక్షిణాది ప్రాంతాన్ని తూర్పుతో అనుసంధానం చేస్తూ..అనుబంధాన్ని కలిపిన బంధం. శతాబ్ద కాల అనుబంధం ఉన్న ఈ వారధి కేవలం ఇటుక, కాంక్రీటు కలబోత గా నిర్మించారు.  ఇంజనీరింగ్ అద్భుతాలకు నిదర్శనంగా ఈ వంతెన నిలిచింది. ప్పటి మద్రాస్ గవర్నర్ అయిన సర్ అర్ధర్ ఎలిబoక్ హేవలాక్ పేరు మీద ఈ వంతెన హవేలాక్ వంతెన గా పిలుస్తున్నారు. 


రెండేళ్లలో టూరిజం స్పాట్ గా మార్చే అవకాశం                             


56 స్తంభాలతో 2.95 కిలోమీటర్ల పొడవున్న ఈ వంతెన వందేళ్లు పూర్తిచేసుకోవడంతో 1997లో ఈ వంతెనపై రాకపోకలను నిలిపివేశారు.  1997లో ఈ బ్రిడ్జిని మూసేసిన తర్వాత రైల్వే శాఖ మొత్తం ఊడపీక్కునిపోవడానికి ప్రయత్నించింది. స్థానిక ప్రజలు ఈ బ్రిడ్జిని కాపాడుకోవడానికి ఉద్యమించారు. చారిత్రాత్మక హేవలాక్‌ బ్రిడ్జిని స్మారక కట్టడంగా మార్చాలని ప్రతిపాదించారు. ఇప్పుడు టూరిజం కేంద్రంగా మార్చనున్నారు.