చంద్రబాబు ఉన్న రాజమండ్రి జైలులో సూపరింటెండెంట్ రాహుల్ సెలవుపై వెళ్లారు. ఆయన రేపటి నుంచి (సెప్టెంబర్ 15) రెండు రోజుల పాటు సెలవులో ఉండనున్నారు. తన భార్య అనారోగ్యం పాలు కావడం వల్ల సెలవు పెట్టినట్లుగా తెలుస్తోంది. సెంట్రల్ జైలు క్వార్టర్స్ నుంచి రాహుల్‌ భార్యను అంబులెన్స్‌లో రాజమండ్రిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆయన సెలవు నేపథ్యంలో కోస్తాంధ్ర జైళ్ల శాఖ డీఐజీ రవి కిరణ్‌కు రాజమండ్రి సెంట్రల్ జైలు ఇన్‌ఛార్జి బాధ్యతలను అప్పగించారు.


టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు అదే రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. దీంతో ఆయన భద్రతపై కుటుంబ సభ్యులతో పాటు టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు జైలులో ఉండగానే సూపరింటెండెంట్ రాహుల్ సెలవుపై వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.