పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు వెళ్తున్న టీడీపీ లీడర్లను పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రాజెక్టు పరిశీలనకు వెళ్తుంటే అడ్డుకోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. పనులు ఎలా జరుగుతున్నాయి. ఎంతవరకు జరుగుతన్నాయో పరిశీలించి వస్తామని చెబుతున్నా ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని నిలదీస్తున్నారు. 


పోలవరం ప్రాజెక్టుపై అనేక ఆరోపణలు వస్తున్న వేళ అక్కడ జరిగే పనులు పరిశీలిస్తామని టీడీపీ టీం ఈ ఉదయం బయల్దేరి వెళ్లింది.  గన్ని వీరాంజనేయులు, బడేటి బుజ్జి, నిమ్మల రామానాయుడు, మాజీ మంత్రి దేవినేను ఉమామహేశ్వరరావు టీంగా ఏర్పడి పోలవరం పరిశీలనకు బయల్దేరి వెళ్లారు. అయితే తూర్పుగోదావరి జిల్లా ఉయ్యూరుపాడు వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలవరం ప్రాజెక్టు వద్దకు వెళ్లేందుకు ఎవరికీ పర్మిషన లేదని చెప్పి ఆపే ప్రయత్నం చేశారు. 






తాము వెళ్లాల్సిందేనంటూ టీడీపీ నేతలు తేల్చి చెప్పారు. అయినా పోలీసులు వారిని అనుమతి ఇవ్వలేదు. దీంతో పోలీసులకు, టీడీపీ లీడర్లకు కాసేపు వాగ్వాదం జరిగింది. చివరకు గన్ని వీరాంజనేయులను, నిమ్మల రామానాయుడిని, బడేటి బుజ్జిని అరెస్టు చేశారు. దేవినేని ఉమ మాత్రం పోలీసుల కళ్లు గప్పి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారు. 


పోలీసులకు, టీడీపీ లీడర్లకు వాగ్వాదం జరుగుతున్న టైంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారు. పోలీసుల కళ్లు గప్పి టీడీపీ లీడర్ బైక్‌లో పోలవరం వైపు వెళ్లారు. ఆయన్ని వెంబడిస్తూ పోలీసులు కూడా వెళ్లారు. ఆయన కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.