Pawan Kalyan Varahi Yatra Schedule: కాకినాడ: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కొనసాగుతోంది. ఇదివరకే మూడు బహిరంగ సభలలో పాల్గొని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. అయితే వారాహి యాత్రపై వచ్చింది. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర షెడ్యూల్ మార్పు చేసినట్లు జనసేన నేతలు తెలిపారు. గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ "వారాహి" యాత్ర పర్యటన తేదీల మార్పు చేశారు. రేపు కూడా (20వ తేదీ) కాకినాడ లోనే పర్యటించనున్నారు పవన్ కళ్యాణ్.
పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర షెడ్యూల్ మార్పులు ఇలా..- జూన్ 20వ తేదీన సాయంత్రం కాకినాడ నుంచి ముమ్మిడివరం- జూన్ 21వ తేదీన ముమ్మిడివరంలో ఉదయం జనవాణి, సాయంత్రం భారీ బహిరంగ సభ- జూన్ 22వ తేదీన అమలాపురంలో జనవాణి- జూన్ 23వ తేదీన సాయంత్రం అమలాపురంలో భారీ బహిరంగ సభ- జూన్ 24న పి. గన్నవరం, రాజోలులో పర్యటన- జూన్ 25న రాజోలు మలికిపురంలో భారీ బహిరంగ సభ...
అమిత్ షా వ్యాఖ్యలను ప్రస్తావించిన పవన్ కళ్యాణ్ అమిత్ షా ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించి చేసిన కామెంట్స్‌పై భారతీయ జనతా పార్టీ నేతలు కూడా పట్టించుకోకపోయినా... ఇప్పుడు పవన్ అందిపుచ్చుకున్నారు. ఆ విమర్శలకు ఆధారాలు ఇస్తున్నా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. అధికార పార్టీ నేతలపై కాకినాడ వేదికగా పవన్ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. వాటికి ఉదాహరణలతో వివరిస్తూ జనాలను ఆకట్టుకుంటున్నారు. సర్పవరం జంక్షన్ వద్ద జరిగిన సభలో చాలా విషయాలు ప్రస్తావించారు పవన్. ముఖ్యమంత్రి జగన్‌కు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బినామిగా ఉన్నారని ఆరోపించారు. ఇష్టానుసారంగా దందాలు, గంజాయి, మట్కా, అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి బినామిగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై ప్రత్యేక ఫైల్ కేంద్రం వద్ద ఉందని అన్నారు. మరోవైపున క్రైం రికార్డ్స్ బ్యూరో లెక్కలను కూడ పవన్ వివరించారు. అమ్మాయిల మిస్సింగ్ కేసులకు సంబంధించిన అంశాలు, ట్రైబల్ ఏరియాల్లో అమ్మాయిల ట్రాఫికింగ్ వంటి అంశాలు పవన్ ప్రస్తావించారు. Also Read: 15వేల కోట్లు ఉంటే పవన్‌ను కొనేసేవాడిని, దమ్ముంటే కాకినాడ నుంచి పోటీ చెయ్: ద్వారంపూడి
డీజీపికి కూడా పవన్ కౌంటర్....రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌కి కూడా పవన్ ఇచ్చారు. అమిత్ షా కామెంట్స్ తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడు కుటుంబం కిడ్నాప్‌కు సంబంధించిన కేసు వ్యవహరంలో డీజీపీ రాజేంద్ర నాధ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగున్నాయని వ్యాఖ్యానించారు. కేంద్ర హోం మంత్రి చేసిన కామెంట్స్‌కు డీజీపీ కౌంటర్ ఇచ్చారనే అభిప్రాయం కలిగింది. అయితే ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ నేతలు స్పందించక ముందే పవన్ డీజీ కామెంట్స్‌ను ప్రస్తావిస్తూ విమర్సలు చేశారు. అమ్మాయిల మిస్సింగ్‌కు సంబంధించి నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో రికార్డులను పవన్ చదివి వినిపించారు. కేంద్రం వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన సమాచారంపై బీజేపీ నేతలు స్పందించకపోయినా పవన్ స్పందిస్తుండటం చర్చనీయాంశమైంది.