Andhra News :     జమిందారులు పాలించిన పిఠాపురం సంస్థానంకు ఎంతో చారిత్ర ఉంది.  కాకినాడకు   26 కిలోమీటర్లు దూరంలో ఉండే పిఠాపురం నియోజకవర్గం కాకినాడ జిల్లాలోనే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రతీ ఎన్నికల్లోనూ విభిన్న తీర్పునిచ్చే ఇక్కడి ఓటర్లు ఈ సారి ఏపార్టీకు జై కొడతారో అని ఆసక్తి నెలకొంది.  పిఠాపురం మున్సిపాలిటీ, గొల్లప్రోలు, కొత్తపల్లి మండలాలు కలబోసిన ఈ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గ ఓట్లు అత్యధికం.  పిఠాపురం నియోజకవర్గంపై జనసేన అధినేత దృష్టి కూడా సారించడంతో ఒక్కసారిగా ఈ నియోజకవర్గంపై అన్ని పార్టీలు చూపు పడింది.. ఈ నియోజకవర్గ సీటు ప్రతిష్టాత్మకంగా మారింది.. ఒక వేళ జనసేనాని గనుక ఇక్కడి నుంచి పోటీకు దిగితే వైసీపీ, టీడీపీ కూడా బలమైన అభ్యర్థినే బరిలోకి దింపే అవకాశాలు లేకపోలేదు.. 
 
పిఠాపురం నుంచి పవన్ పోటీ చేస్తారని ఊహాగానాలు


ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కాపులు అత్యధికంగా ఉన్న నియోPawan Kalyan is likely to contest from Pithapuram.జకవర్గాల్లో పిఠాపురం, రాజోలు, అమలాపురం, కొత్తపేట నియోజకవర్గాలున్నాయి. అయితే ఇందులో జనసేనకు పట్టున్న నియోజకవర్గాలుగా పిఠాపురం, అమలాపురం, రాజోలు కనిపిస్తున్నాయి. ఇందులో పిఠాపురం మినహా అమలాపురం, రాజోలు రెండూ ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాలే. 2019 ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పోటీచేసిన రెండు నియోజకవర్గాలు అంత అనుకూలం కాకపోవడంతో ప్రతికూల ఫలితాన్ని చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సారి ఆ తప్పు జరక్కుండా ఉండేందుకు  పిఠాపురంలో  పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు.  


విభిన్న తీర్పులిచ్చిన నియోజకవర్గం..!


పిఠాపురం నియోజకవర్గంలో ప్రతీ ఎన్నికల్లోనూ ఇక్కడి ఓటర్లు విభిన్నమైన తీర్పు నే ఇచ్చారు. 2004లో రాష్ట్ర మంతా   కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మ్రోగిస్తే ఇక్కడ బీజేపీ తరపున పోటీచేసిన ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఎన్నికయ్యారు. ఆ తరువాత 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసి ప్రస్తుత కాకినాడ ఎంపీ వంగా గీత గెలుపొందారు. రాష్ట్ర విభజన తరువాత 2014 సార్వత్రిక ఎన్నికల్లో 2009లో టీడీపీ తర పున పోటీ చేసి ఓడిపోయిన ఎస్వీఎస్ఎన్ వర్మను కాదని పోతుల విశ్వం కు టీడీపీ టిక్కెట్టు ఇచ్చింది.. వైసీపీ తరపున ప్రస్తుత ఎమ్మెల్యే పెండెం దొరబబాబు పోటీచేశారు. టీడీపీ రెబల్ అభ్యర్థిగా పోటీలో దిగిన ఎస్వీఎస్ఎన్ వర్మ 47,080 ఓట్లు మెజార్టీతో గెలుపొందారు. టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. 2019లో ఒకప్పుడు బీజేపీ తరపున పోటీచేసి ఎమ్మెల్యే అయిన పెండెం దొరబాబు వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు.


అందరూ బలమైన అభ్యర్థులే..!


టీడీపీ, జనసేన పొత్తులు పెట్టుకోకుంటే ఇక్కడ 2009 సీన్ రిపీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్వతంత్ర్య అభ్యర్థిగా గెలుపొందిన ప్రస్తుత టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ వర్మ మంచి పట్టున్న నాయకునిగా గుర్తింపు ఉంది. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబు కూడా ప్రజల్లో ఉంటూ పట్టునిలుపుకుంటున్నారు. ప్రస్తుత జనసేన ఇంఛార్జ్ మాకినీడి శేషుకుమారి కూడా నిత్యం ప్రజల్లో ఉంటున్నారు.  పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాన్ గనుక పోటీచేస్తే వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు బాగానే పట్టు ఉన్నప్పటికీ ఆయన్ను వేరే నియో రాజకవర్గం పంపించి ఇక్కడ ఇదివరకు ప్రజారాజ్యం తరపున పోటీచేసి గెలుపొందిన కాకినాడ ఎంపీ వంగా గీతను రంగంలోకి దింపే అవకాశాలున్నాయని చర్చ జరుగుతోంది. గతంలో ఓసారి గెలుపును అందిపుచ్చుకున్న బీజేపీ కూడా అభ్యర్ధిని నిలిపే అవకాశాలు లేకపోలేందంటున్నారు. ఆధ్యాత్మిక క్షేత్రాలు ఎక్కువగా ఉన్న పిఠాపురంలో బీజేపీకు కూడా మంచి ఓటు బ్యాంకు ఉండడమే దీనికి కారణమని అంటున్నారు. ఒక వేళ టీడీపీ, జనసేన పొత్తులతో ఎన్నికలకు వస్తే ఈ సీటు జనసేన కే కేటాయించే అవకాశాలున్నాయని, టీడీపీ ఇంఛార్జి వర్మను మరో నియోజకవర్గానికి పంపే పరిస్థితులుంటాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.