ABP  WhatsApp

Nara Lokesh: ప్యాలెస్‌లు ఉన్న జగన్ పేదోడా? వైసీపీ గలీజ్ పార్టీ - మహానాడులో నారా లోకేశ్

ABP Desam Updated at: 28 May 2023 07:21 PM (IST)

రాజమండ్రి వేమగిరి వద్ద జరుగుతున్న టీడీపీ మహానాడులో నారా లోకేశ్ మాట్లాడారు.

మహానాడులో మాట్లాడుతున్న నారా లోకేశ్

NEXT PREV

హైదరాబాద్ కు అభివృద్ధి అంటే ఏంటో చూపించింది చంద్రన్నే అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఘన చరిత్ర ఉన్న పార్టీ టీడీపీ అని, గలీజ్ పార్టీ వైసీపీ అని అన్నారు. అలాగే అభివృద్ధిలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని వెళ్లింది చంద్రన్న అయితే, వెనక్కి తీసుకుని వెళ్లింది జగన్ అని విమర్శించారు. జగన్ పాలనలో ఎమ్మెల్యేలకు నాలుగేళ్ల తరువాత అపాయింట్మెంట్ దొరికిందని అన్నారు. లక్ష రూపాయిల చెప్పులు వేసుకున్న జగన్ పేదవాడా? అని ప్రశ్నించారు. రాజమండ్రి వేమగిరి వద్ద జరుగుతున్న టీడీపీ మహానాడులో నారా లోకేశ్ మాట్లాడారు.


‘‘ఐదు ప్యాలెస్ లు ఉన్న జగన్ పేదవాడ. మనది సైకిల్ పాలన, వైసీపీది సైకో పాలన. కరెంట్ చార్జీలు ఏడు సార్లు పెంచింది ఈ జగన్ ప్రభుత్వం. చెత్తపై పన్ను వేసిన చెత్త సీఎం జగన్ పెట్రోల్, డీజీల్ ధరలు వంద దాటింది. పండుగ కానుకలు కట్, పెళ్లి కానుకలు కట్ చేశారు. సెంట్ స్థలం వెనక పెద్ద కుట్రే ఉంది. ఇళ్లు కట్టకపోతే స్థలాలు వెనక్కి ఇవ్వాలని వైసీపీ నేతలు అంటున్నారు. లబ్ధిదారులు ఇళ్లు కట్టకపోతే వైసీపీ నేతలు వాటిని కొట్టేస్తున్నారు. ఉద్యోగాలు లేక యువత ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నారు. పాపాల పెద్దిరెడ్డి రూ.10 వేల కోట్ల అవినీతి చిత్తూరు జిల్లాలో చూశాను.’’ అని లోకేశ్ అన్నారు.


పన్నులు, చార్జీలతో పేదవాళ్లను జగన్ బాదుడేబాదుడు అని లోకేశ్ మండిపడ్డారు. టిడ్కో ఇళ్లు కట్టింది చంద్రబాబు ప్రభుత్వమని అన్నారు. వైఎస్ఆర్ సీపీ రంగులు వేసి జగన్ తానే కట్టినట్లు చంకలు గుద్దుకుంటున్నారని మండిపడ్డారు. ‘‘పాదయాత్రలో ప్రజల మనిషిగా ఎలా ఉండాలో తెలుసుకున్నా. నా పాదయాత్రను అడ్డుకునేందుకు చాలా ప్రయత్నించారు వైఎస్ఆర్ సీపీ నేతలు. అంబేద్కర్ రాజ్యాంగం ముందు రాజా రెడ్డి రాజ్యాంగం చిన్న బోయింది. 


విద్యా, వైద్యం, ఇన్సూరెన్సు లాంటి వాటిని కార్యకర్తలను తీసుకొచ్చింది తెలుగుదేశం. పోరాటం పసుపు సైన్యం రక్తంలో ఉంది. కార్యకర్తలను కంటి రెప్పలా కాపాడుకుంటున్నాను. సైకో పోవాలి సైకిల్ రావాలి. చరిత్ర రాయాలన్నా, చరిత్ర  తిరిగి రాయాలన్నా ఎన్టీఆర్ వల్లే అవుతుంది. 70 లక్షల తెలుగు దేశం పార్టీ కార్యకర్తలకు నా వందనం. టీడీపీ కుటుంబ పండగకు వచ్చిన అందరికీ స్వాగతం. గోదావరి వాళ్ల ఎటకారం, మమకారం రెండు  సూపర్. 


ప్రపంచానికి తెలుగువారిని పరిచయం చేసింది ఎన్టీఆర్. రాముడు అయినా భీముడు అయినా ఎన్టీఆరే. దిల్లీకి తెలుగోడి పవర్ చూపించింది ఎన్టీఆర్. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాజకీయ ప్రాధాన్యం కల్పించింది ఎన్టీఆర్. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించింది ఎన్టీఆర్’’ అని నారా లోకేశ్ అన్నారు.


కార్యకర్తకు కష్టం వస్తే మీ లోకేశ్‌ ఆగడు.. కార్యకర్త ఇబ్బందుల్లో ఉంటే సైకో జగన్‌ స్పందించడు. టీడీపీ కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కడిని వదిలి పెట్టను. అమలాపురంలో ఉన్నా, అమెరికాలో ఉన్నా పట్టుకొచ్చి లోపలేస్తాం. పోరాటం పసుపు సైన్యం బ్లడ్‌లో ఉంది. ప్రతిపక్షంలో పోరాడిన ప్రతి కార్యకర్త బాధ్యత నాది. పేదలు ఎప్పటికీ పేదరికంలో ఉండాలనేది సైకో జగన్‌ కోరిక. పేదరికం లేని రాష్ట్రం చూడాలన్నది మీ లోకేశ్‌ సింగిల్‌ పాయింట్‌ ఎజెండా- నారా లోకేశ్

Published at: 28 May 2023 07:15 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.