Nara Lokesh Yuva Galam Padayatra: ఓ విద్యార్థి ఆవేదనను విన్న టీడీపీ యువనేత నారా లోకేష్.. ఆ తమ్ముడ్ని చదివించే బాధ్యత నేను తీసుకుంటానని భరోసా ఇచ్చారు. అమలాపురం నియోజకవర్గం భట్నవిల్లిలో యువతతో ముఖాముఖి నిర్వహించిన నారా లోకేష్ వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అమలాపురం నియోజకవర్గం కోడుపాడుకు చెందిన కె.దుర్గారెడ్డి తమ కష్టాలను తెలియజేస్తూ.. “నేను అమలాపురంలోని ఎస్కేబీఆర్ కళాశాలలో గత ఏడాది ఇంటర్ హెచ్ఈసీ గ్రూప్ లో జాయిన్ అయ్యాను. అక్కడ సరైన సదుపాయాలు లేక చదువు మానేశాను. తర్వాత ఐటీఐ చదువుతానని నాన్నతో చెబితే.. మనకు అంత స్థోమత లేదు వద్దన్నారు. దాంతో టీసీ తీసుకొని ఇంటివద్దే ఉంటూ చిన్నచిన్న పనులు చేసుకుంటున్నాను” అని చెప్పాడు. దీంతో యువనేత లోకేష్ స్పందిస్తూ ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువు ఆపేసిన దుర్గారెడ్డిని తాను చదివిస్తానని చెప్పారు. సంబంధిత విద్యార్థి వివరాలు తీసుకోవాల్సిందిగా వ్యక్తిగత సిబ్బందిని ఆదేశించారు.


రేపు యువగళం పాదయాత్ర వివరాలివీ..
నారా లోకేష్ యువగళం పాదయాత్ర 211వ రోజు పూర్తయింది. ఇప్పటివరకు లోకేశ్ 2886.3 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేశారు. మంగళవారం (నవంబర్ 28) నాడు 18.5 కిలో మీటర్లు లోకేశ్ నడిచారు. ముమ్మిడివరం విడిది కేంద్రంలో లోకేశ్ నేడు రాత్రి బస చేయనున్నారు. రేపు 212వ రోజు ముమ్మడివరం నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర చేయనున్నారు. లోకేష్ పాదయాత్రకు టీడీపీ నేతలు ఏర్పాట్లు చేశారు.


212వరోజు (29-11-2023) యువగళం వివరాలు
అమలాపురం/ముమ్మడివరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్ర
ఉదయం
10.00 – ముమ్మడివరం ఉమెన్స్ డిగ్రీ కాలేజి వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభం.
10.15 – ముమ్మడివరం కొండమ్మ చింత సెంటర్ లో డ్వాక్రామహిళలతో భేటీ.
10.30 – ముమ్మడివరం ఎన్టీఆర్, బాలయోగి విగ్రహాల వద్ద గౌడలతో సమావేశం.
11.00 – ముమ్మడివరం సెంటర్ లో బహిరంగసభ, యువనేత లోకేష్ ప్రసంగం.
12.45 – ముమ్ముడివరం పల్లెపాలెం సెంటర్ లో దళితులతో సమావేశం.
1.30 – కొమనాపల్లి సెంటర్ లో స్థానికులతో సమావేశం.
2.30 – అన్నంపల్లి సెంటర్ లో మాదిగ సామాజికవర్గీయులతో భేటీ.
3.30 – మురమళ్ల సెంటర్ లో బుడగ జంగాలతో సమావేశం.
3.45 – మురమళ్లలో భోజన విరామం.
సాయంత్రం
5.00 – మురమళ్ల నుంచి పాదయాత్ర కొనసాగింపు.
6.00 – కొమరగిరిలో స్థానికులతో సమావేశం.
7.15 – ఎదుర్లంక సెంటర్ లో స్థానికులతో సమావేశం.
7.30 – పాత ఇంజరం వద్ద పాదయాత్ర 2900 కి.మీ.లకు చేరిక, శిలాఫలకం ఆవిష్కరణ.
9.00 – సుంకరపాలెం విడిది కేంద్రంలో బస.