APDPHARMACY-2023 Admissions: పాలిటెక్నిక్ కళాశాలల్లో డి-ఫార్మసీ కోర్సు ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను సాంకేతిక విద్యాశాఖ విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఇంటర్ అర్హతతో రెండు సంవత్సరాల డి-ఫార్మసీ(D-Pharmacy) ప్రవేశాల కోసం నవంబరు 29, 30 తేదీల్లో ఆన్‌లైన్‌లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, ధ్రువపత్రాల పరిశీలనకు నిర్వహించనున్నారు. రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తిచేసుకున్నవారు నవంబరు 30 నుంచి డిసెంబరు 2 వరకు వెబ్ఆప్షన్లు నమోదుచేసుకోవాల్సి ఉంటుంది. సీట్ల కేటాయింపు వివరాలను డిసెంబరు 4న ప్రకటించనున్నారు.


ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు రిజిస్ట్రేషన్ ఫీజుగా ఓసీ, బీసీ అభ్యర్థులైతే రూ.1200; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే రూ.600 చెల్లించాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డు/డెబిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా నిర్ణీత ఫీజు చెల్లించవచ్చు. ఒక్కసారి ఫీజు చెల్లించిన తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ తిరిగి చెల్లించబడదు. మొదటి ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులందరూ కౌన్సెలింగ్‌లో భాగంగా నిర్వహించే సర్టిఫికేట్ వెరిఫికేషన్‌లో పాల్గొనవచ్చు. ఆయాతేదీల్లో ఎంపీసీ స్ట్రీమ్ విద్యార్థులకు ఉదయం 9 గంటలకు, బైపీసీ స్ట్రీమ్ విద్యార్థులకు ఉదయం 10 గంటలకు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.


సర్టిఫికేట్ వెరిఫికేషన్‌‌కు హాజరయ్యేవారు రెండు సెట్ల అవసరమైన అన్ని డాక్యుమెంట్లు తీసుకురావాల్సి ఉంటుంది. సీట్లు పొందినవారు ప్రభుత్వ పాలిటెక్నిక్ అయితే రూ.4,700; ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీ అయితే రూ.25000 ట్యూషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. అర్హులైనవారికి ఫీజు రీయింబెర్స్‌మెంట్ వర్తిస్తుంది. రిజిస్ట్రేషన్ సమయంలో అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే ఈమెయిల్: Convenorappolycet2023@gmail.com లేదా హెల్ప్ డెస్క్ నెంబరు: 7995681678, 7995865456, 9177927677 ద్వారా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య సంప్రదించవచ్చు. 


Counselling Notification


Counselling Website


సర్టిఫికేట్ వెరిఫికేషన్‌ కోసం అవసరమయ్యే డాక్యుమెంట్లు..


1. SBTET జారీచేసిన డి-ఫార్మసీ-2023 ర్యాంకు కార్డు.


2. ఇంటర్ మార్కుల మెమో కమ్ పాస్ సర్టిఫికేట్. 


3. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత మార్కుల మెమో. 


4. 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికేట్లు, లేదా రెసిడెన్స్ సర్టిఫికేట్ 


5. నాన్-లోకల్ అభ్యర్థులైతే 10 సంవత్సరాలకు సంబంధించి రెసిడెన్స్ సర్టిఫికేట్ లేదా పేరెంట్స్ ఎంప్లాయర్ సర్టిఫికేట్.


6. ఇన్‌కమ్ సర్టిఫికేట్ (01.01.2020 తర్వాత జారీచేసింది) లేదా రేషన్ కార్డు. 


7. క్యాస్ట్ సర్టిఫిట్ (బీసీ, ఎస్సీ, ఎస్టీలకు) 


8. ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (TC).


9. PH/CAP/NCC/స్పోర్ట్స్/మైనారిటీ సర్టిఫికేట్.


10. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్(2023-24) 


11. లోకల్ స్టేటస్ సర్టిఫికేట్.


సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం హెల్ప్‌లైన్ కేంద్రాలు..


➥ గవర్నమెంట్ పాలిటెక్నిక్, విజయవాడ- ఎంపీసీ, బైపీసీ విభాగాలకు చెందిన విద్యార్థులతోపాటు, స్పెషల్ కేటగిరీ(PH/NCC/CAP/స్కౌట్స్ & గైడ్స్/స్పోర్ట్స్& గేమ్స్) విద్యార్థులకు.


➥ గవర్నమెంట్ పాలిటెక్నిక్, విశాఖపట్నం (ఎంపీసీ, బైపీసీ విభాగాలకు).


➥గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్, కడప (ఎంపీసీ, బైపీసీ విభాగాలకు).


ఫార్మా కోర్సులకు బైపీసీ విభాగం నుంచి తుది దశ సీట్ల కేటాయింపు...
ఫార్మసీ కోర్సుల కోసం ఇంటర్ బైపీసీ విభాగం నుంచి నిర్దేశించిన తుది దశ సీట్ల కేటాయింపు ప్రక్రియ నవంబరు 27తో పూర్తయింది. డి-ఫార్మసీ, ఫార్మస్యూటికల్ ఇంజినీరింగ్ కోర్సులకు సంబంధించి 9951 మంది తమ ఐచ్ఛికాలు నమోదు చేసుకోగా, 3345 మందికి నూతనంగా సీట్లు కేటాయించామన్నారు.


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply