Suryapet Road Accident | కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడలో విషాదం చోటుచేసుకుంది. లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు పోలీసులు మృతిచెందారు. మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదం కోదాడ మండలం దుర్గాపురం వద్ద గురువారం తెల్లవారుజామున జరిగింది.
ఆంధ్రప్రదేశ్ లోని కోనసీమ జిల్లా ఆలమూరు పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్న సబ్ ఇన్‌స్పెక్టర్ అశోక్, కానిస్టేబుల్ వీరస్వామి ఏదో పని మీద కారులో హైదరాబాద్ బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు మార్గం మధ్యలో ఓ లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఎస్సై, కానిస్టేబుల్ మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై కోదాడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది.