Konaseema News | అభం శుభం తెలియన ఇద్దరు చిన్నారులను చంపి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడో తండ్రి.. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోనని ఆలమూరు మండలం మడికి చిలకలపాడులో చోటుచేసుకున్న ఈ సంఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.
పేగు బంధాన్ని చంపేస్తున్నారు..
ఇటీవల కాలంలో తల్లితండ్రుల మానసిక స్థితిని చూస్తుంటే చాలా ఆందోళన కరంగా మారినపరిస్థితి కనిపిస్తోంది.. కుటుంబ కలహాలున్నా,, ఆర్దీక సమస్యలున్నా.. మరే ఇతర కారణాలేవైనా పసిప్రాయంపై కన్నవారు అమానుష దుర్చర్యలను చూస్తుంటే సమాజం ఎటుపోతుందా.. అన్న సందేహాలు కనిపిస్తున్నాయి... భార్య మాట వినడం లేదని ఓ భర్త కన్న పేగులను తుంచేస్తున్నాడు.. భర్తతో సరిపడక నవమాసాలు మోసి కన్న బిడ్డలను కసాయిగా మారి కడతేరుస్తోందో తల్లి... తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి సంఘటనలు సమాజంపై దారుణమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయడంలో ఎటువంటి సందేహం కనిపించడంలేదు.. హైదరాబాద్ బాలానగర్‌లో ఓ తల్లి చేసిన దుర్మార్గపు చర్యను మరువక ముందే అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఓ తండ్రి తన రక్తం పంచుకు పుట్టిన కన్నబిడ్డలు ఇద్దరిని చంపి ఆపై తాను ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సంచలనం రేపింది.
ఇద్దరు చిన్నారులను చంపిన తండ్రి.. ఆపై తాను...
అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మడికి మడికి(చిలకలపాడు)కు చెందిన పావులూరి కామరాజు అలియాస్ చంటి (36) స్థానికంగా సెలూన్ షాపు నిర్వహిస్తున్నాడు. అయిదేళ్ల క్రింతం ఇతని భార్య నాగదేవి ఆత్మహత్య చేసుకుంది. ఈక్రమంలోనే అప్పట్లో నమోదైన కేసు సంబందించి ఇంకా కోర్టులో నడుస్తోంది.. అయితే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకోవడానికి భర్త కామరాజే కారణమంటూ ఆమె కుటుంబికులు పోలీసు కేసు పెట్టడంతో అప్పట్లో ఇతనిపై కేసు నమోదయ్యింది.. ఆ కేసు ప్రస్తుతం కోర్టులో ఉండగా ఇటీవలే భార్య కుటుంబికులతో రాజీ కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది.. భార్య మరణాంతరం తల్లి లేని ఇద్దరు కుమారులతో కామరాజు గ్రామంలోనే ఉంటున్నాడు. ఏమయ్యిందో ఏంటో తెలియదు కానీ ఉదయం అయినా బయటకు రాకపోవడంతో తలుపు తీసి చూసిన కామరాజు కుటుంబికులు షాక్ అయ్యే సీన్ కనిపించింది.. ఇంట్లో మంచంపై ఇద్దరు కుమారులు మృతిచెంది కనిపించగా కామరాజు ఫ్యాన్‌కు ఉరివేసుకుని వేళాడుతూ విగత జీవిగా కనిపించాడు..
పిల్లలకు పురుగుల మందు పట్టించి చంపిన తండ్రి..
ఓ వైపు కోర్టులో కేసు నడుస్తోండగా రాజీ చేసుకున్నప్పటికీ ఆర్దీకంగా భార్య కుటుంబికులకు ముట్టచెప్పాలని పెద్దలు సూచించడం ఓ వైపు, ఒంటరిగా జీవిస్తున్న కామరాజు మానసికంగా కూడా కొన్ని రోజులుగా ముభావంగా కనిపిస్తున్నాడని స్థానికులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా మంగళవారం రాత్రి పెద్దకుమారుడు అభిరామ్(11) చిన్నకుమారుడు త్రినాథ్ గౌతమ్( 8 )లకు పురుగులు మందు పట్టించి అనంతరం ఇంట్లోనే ఫ్యాన్ కు ఉరివేసుకుని చంటి ఆత్మ చేసుకున్నాడు. అయితే ఆత్మహత్య కారణాలు కూడా వీడియో చేసినట్లు తెలుస్తుంది. దీనిపై రావులపాలెం రూరల్ సిఏ సిహెచ్ విద్యాసాగర్, ఆలమూరు ఎస్సై జి నరేష్ లు విచారణ చేయి పెడుతున్నారు.