Kakinada Constituency MLA Winner List 2024: కాకినాడ జిల్లాలో కూటమి విజయ దుందుబి మోగించింది. ఫ్యాన్ కింద ఉక్కపోతతో ఉన్న జనం సైకిల్ కూటమి ఎక్కారు.
నియోజకవర్గం | విజేత |
తుని |
యనమల దివ్య |
ప్రత్తిపాడు |
బూర్ల రామాంజినేయులు |
పిఠాపురం |
పవన్ కల్యాణ్ |
కాకినాడ సిటీ |
వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) |
కాకినాడ రూరల్ |
పంతం నానాజీ |
పెద్దాపురం |
నిమ్మకాయల చినరాజప్ప |
జగ్గంపేట |
జ్యోతుల వెంకట అప్పారావు (నెహ్రూ) |
తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఉభయగోదావరి జిల్లాలు తెలుగుదేశం పార్టీకి అండగా ఉండగా....2004 ఎన్నికలకు ముందు రాజశేఖర్‌రెడ్డి(YSR) పాదయాత్ర ప్రభావంతో కాంగ్రెస్ (Congress) పార్టీ వశమయ్యాయి. 2009 ఎన్నికలకు ముందు ప్రజారాజ్యం ఆవిర్భావంతో తెలుగుదేశం పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. కాకినాడ జిల్లాలో 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం మూడుసీట్లు గెలుచుకోగా...మరో మూడుచోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. తెలుగుదేశం కేవలం ఒకేఒకచోట మాత్రమే గెలుపొందింది.
2014 ఎన్నికల్లో నాలుగుస్థానాల్లో టీడీపీ గెలవగా...మరోమూడుచోట్ల వైసీపీ(YCP) విజయం సాధించి ఉనికి చాటుకుంది. రాష్ట్ర విభజన మంటల్లో కాంగ్రెస్ పూర్తిగా కాలిపోయింది. 2019లో జరిగిన ఎన్నికల్లో పెద్దాపురం నుంచి చినరాజప్ప మినహా...వైసీపీ అన్నిచోట్ల విజయం సాధించింది. దాడిశెట్టి రాజా, కన్నబాబు మంత్రి పదవులు సైతం చేపట్టారు. అయితే ఈసారి ఊహించని విధంగా ఈసారి ఎన్నికల్లో అనూహ్యమైన పోలింగ్ జరిగింది. దాదాపు 25శాతం కన్నా ఎక్కువ ఓటింగ్ నమోదైంది. గత ఎన్నికల్లో కాకినాడ జిల్లావ్యాప్తంగా 52.38 శాతం ఓటింగ్ జరగ్గా...ఈసారి జరిగిన ఎన్నికల్లో 80.30శాతం పోలింగ్ జరిగింది.
|
2009 |
2014 |
2019 |
తుని |
కాంగ్రెస్ |
వైసీపీ |
వైసీపీ |
ప్రత్తిపాడు |
టీడీపీ |
వైసీపీ |
వైసీపీ |
పిఠాపురం |
ప్రజారాజ్యం |
టీడీపీ |
వైసీపీ |
కాకినాడ సిటీ |
కాంగ్రెస్ |
టీడీపీ |
వైసీపీ |
కాకినాడ రూరల్ |
ప్రజారాజ్యం |
టీడీపీ |
వైసీపీ |
పెద్దాపురం |
ప్రజారాజ్యం |
టీడీపీ |
|
జగ్గంపేట |
వైసీపీ |
వైసీపీ |