కాకినాడ: అరబిందో ఫార్మా దాతృత్వ విభాగమైన అరబిందో ఫార్మా ఫౌండేషన్ తన హైటెక్ సెంట్రలైజ్డ్ కిచెన్ ను ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ సెజ్ లోని పెరుమాళ్లపురంలో ప్రారంభించింది. అరబిందో ఫార్మా ఫౌండేషన్ హరే కృష్ణ మూమెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్ (హెచ్ కెఎంసిఎఫ్) తో కలసి నిర్మించిన వాటిలో నాలుగవది ఈ సెంట్రలైజ్డ్ కిచెన్. ప్రస్తుతం ఈ కిచెన్ రోజుకు 5000 బ్రేక్ ఫాస్ట్ మీల్స్ ను తయారు చేసే సామర్థ్యాన్ని కలిగిఉంది. ఈ కిచెన్ కాకినాడ సెజ్ లిమిటెడ్ విరాళంగా అందించిన 2 ఎకరాల స్థలంలోని 5,500 చదరపు అడుగుల స్థలంలోదాదాపు రూ.12 కోట్ల ఖర్చుతో  నిర్మించారు.


కిచెన్‌ను ప్రారంభించిన మంత్రి దాడిశెట్టి రాజా 
హరే కృష్ణ మూమెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ సత్య గౌరచంద్ర దాస స్వామీజీ, అరబిందో ఫార్మా ఫౌండేషన్ ప్రతినిధుల సమక్షంలో ఆర్ అండ్ బి మంత్రి ఎం. దాడిశెట్టి రాజా గురువారం నాడు ఈ హైటెక్ సెంట్రలైజ్డ్ కిచెన్‌ను ప్రారంభించారు. ఈ సెంట్రలైజ్డ్ కిచెన్ పూర్తిగా సౌర ఉపకరణాలతో శక్తిని పొందుతుంది. రోజుకు 5000 బ్రేక్ ఫాస్ట్ మీల్స్ ను తయారు చేసే సామర్థ్యాన్ని కలిగిఉంది. ఇది ఈ ప్రాంతంలోని 41 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల అవసరాలను తీర్చుతుంది. ఇడ్లీ బ్యాటర్ డిస్పెన్సర్, డౌ నీడర్, సాంబార్ కుల్డ్రాన్ – ఆటో డిస్పెన్సింగ్ సె టప్ తో కూడిన డబుల్ జాకెటెడ్ (1200 లీ.), వెసెల్స్ స్టెరిలైజేషన్ స్టాండ్స్ వంటి అత్యాధునిక ఉప కరణాలు ఈ కిచెన్ లో ఉన్నాయి. పరిశుభ్ర వాతావరణంలో అత్యంత నాణ్యమైన ఆహార పదార్థాలను అవి పోషక విలువలను కోల్పోకుండానే  వేగంగా తయారు చేసేందుకు ఇవి తోడ్పడుతాయి. 


కిచెన్ తో పాటుగా ‘స్వాస్థ్య ఆహార’ – అనే ఉచిత ఉపాహార కార్యక్రమం కూడా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభించారు. ‘స్వాస్థ్య ఆహార’ – అనేది ఉచిత ఉపాహార కార్యక్రమం. ఇది ప్రధానంగా ప్రభుత్వ పాఠశాల ల్లోని అణగారిన వర్గాలకు చెందిన పిల్లలను దృష్టిలో ఉంచుకొని రూపొందించబడింది. పోషకాలతో కూడిన ఈ ఆహారం ఆయా చిన్నారుల్లో కావాల్సినంత ఎదుగుదల సాధించేందుకు తోడ్పడుతుంది. ప్రస్తుతం ఇది ఈ ప్రాంతంలోని యు.కొత్తపల్లి, తొడంగి మండలాల్లోని 36 గ్రామాల్లోని 41 ప్రభుత్వ పాఠశాలల్లో అమలు కానుంది.


ఈ సందర్భంగా హరే కృష్ణ మూమెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ సత్య గౌరచంద్ర దాస స్వామీజీ మాట్లాడుతూ.. ‘‘మా కేంద్రాలకు 10 మైళ్ల పరిధిలో ఉండే వారు ఎవరూ ఆకలితో బాధపడకూడదనేది మా ఆధ్యాత్మిక గురువు శ్రీల ప్రభుపాద ఆకాంక్ష. ఈ ఆశయంతోనే హరే కృష్ణ మూమెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్ భోజన-అమృతం, స్వాస్థ్య ఆహార వంటి అన్నదాన కార్యక్రమాలను చేపట్టింది. వీటి నిర్వహణకు  అందిస్తు న్న మద్దతుకు, ప్రోత్సాహానికిగాను ఏపీ మంత్రి దాడిశెట్టి రాజాకి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఎంతో ఉదారంగా మద్దతు అందిస్తున్న అరబిందో ఫార్మా ఫౌండేషన్, దాని డైరెక్టర్లు కె.నిత్యానంద రెడ్డి, పి.శరత్ చంద్ర రెడ్డికి కూడా మా ధన్యవాదాలు. ఈ హై-టెక్ కిచెన్ కాకినాడ జిల్లాలో ని ఎంతోమంది అన్నార్తులకు అండగా ఉంటుంది తద్వారా ఆంధ్రప్రదేశ్ అభ్యున్నతికి తన వంతు తోడ్పాటు ను అందిస్తుంది’’ అని అన్నారు.


అరబిందో ఫార్మా ఫౌండేషన్ డైరెక్టర్, అరబిందో ఫార్మా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, వైస్ ఛైర్మన్ కె. నిత్యా నంద రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘అల్పాహారం  అనేది చిన్నారులకు పాఠశాలకు వచ్చేందు కు ఒక ఉద్దీపనగా పని చేస్తుంది మరియు వారు చదువు కొనసాగించేలా చేస్తుంది. మరింత మంది పిల్ల లను చేరుకొని వారికి సేవలందించేందుకే ఎల్లవేళలా మా ప్రయాణం. ఈ నూతన కిచెన్ మేం ఈ ప్రాంతంలో 5,000 మంది పిల్లలను చేరుకునేందుకు, వారికి చక్కటి ఆహారం అందించడం ద్వారా వారి జీవితాల్లో సానుకూల మార్పు తీసుకువచ్చేందుకు తోడ్పడుతుంది. పోషకాలు, పరిశుభ్రతల అత్యున్నత ప్రమాణాలు పాటించడం అనేది విద్యార్థులు ఆరోగ్యంగా ఉండేలా చూస్తూ, పాఠశాలల నుంచి వారు మధ్యలోనే మానేయకుండా చూసేందుకు తోడ్పడుతుంది. ఈ గ్రామీణ పాఠశాలల పిల్లలు పోషకయుక్త, ఆరోగ్యదాయక బ్రేక్ ఫాస్ట్ మీల్స్ పొందుతారు. అది వారిని ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో తోడ్పడుతుంది’’ అని అన్నా రు.


‘‘ఈ కేంద్రం అత్యాధునిక మౌలికవసతులతో, స్థానిక పిల్లల పోషకయుక్త ఆహార అవసరాలను దృష్టిలో ఉంచుకొని 4 నెలల రికార్డు సమయంలోనే నిర్మించబడింది. వేడిగా, శుచిగా, పోషకయుక్తంగా ఉండే పదా ర్థాలతో వారి అవసరాలు తీరుతాయి. ఐక్యరాజ్యసమితి ప్రకటించిన, భారత ప్రభుత్వంచే అనుసరించ బడుతున్న సుస్థిరదాయక అభివృద్ధి లక్ష్యాల (ఎస్డీజీ)లో 2 మరియు 4 లక్ష్యాలను సాధించేందుకు మాకున్న కట్టుబాటును ఇది ప్రతిబింబిస్తుంది. ఆకలితో ఎవరూ ఉండకుండా చేయడంలో, నాణ్యమైన విద్యను అందరికీ అందేలా చేయడంలో ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఇది అండగా ఉంటుంది’’ అని అన్నారు.


అరబిందో ఫార్మా ఫౌండేషన్ గతంలో హెచ్ కెఎంసిఎఫ్ తో కలసి 3 సెంట్రలైజ్డ్ కిచెన్ లను తెలంగాణలోని హైదరాబాద్ వద్ద నార్సింగి, మహబూబ్ నగర్‌లలో, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళంలో నిర్మించింది. అవి విజ యవంతంగా నడుస్తున్నాయి. ఇప్పటివరకూ తాము 9.50 కోట్ల మీల్స్ ను అందించామని, ఈ కాకినాడ ప్రాజె క్ట్ వ్యయం కిచెన్ నిర్మాణం, అవసరమైన మౌలిక వసతులతో పాటుగా 4 ఏళ్ల నిర్వహణకు కలిపి రూ.12 కోట్లు ఉంటుందన్నారు.