Svamitva E Survey Scheme: శ్రీకాకుళం జల్లాలోని ఆమదాలవలసలో ఓ కుటుంబం గత 40 ఏళ్లుగా గ్రామకంఠంలో తమ పూర్వికుల నుంచి వారసత్వంగా వచ్చిన భూమిలో నివాసం ఉంటున్నారు. ఇల్లు కట్టుకోవాలని ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇచ్చిన గృహ రుణం పొందేందుకు వాళ్లకు అర్హత లేదు. ఎందుకంటే వారి స్థలం యాజమాన్య హక్కుకు సంబంధించి వివాదం ఉంది. భూమి వారిదే అయినా దాన్ని ధ్రువీకరించే ప్రతాలు లేని పరిస్థితి. ఇలాంటి సమస్యలకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న స్వమిత్ర ఈ సర్వేతో చెక్ పెట్టొచ్చు.
భూమిని ఈసర్వే కోసం దరఖాస్తు చేసుకున్నారు.. స్వమిత్ర సర్వే బృందం సర్వే చేపట్టి వారి భూమికి సంబందించి సరిహద్దులు, విస్తీర్ణం నిర్ధారించి వారికి యాజమాన్య పత్రం అందించి వారికి యాజమాన్య హక్కలు కల్పించారు.. దీంతో లోన్ పెట్టకునేందుకు మార్గం సుగమం అయ్యింది... ఇటువంటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నవారికి ఇప్పడు స్వమిత్ర ఈ సర్వే బాసటగా నిలుస్తోంది.. దీనికి కూటమి ప్రభుత్వం కూడా తోడ్పాటు నందిస్తుండడంతో ఈ సర్వే ప్రాధాన్యత గుర్తించిన చాలామంది ఈదిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.. గ్రామీణ అభివృద్ధి కోసం డిజిటల్ విప్లవం, భూమి, ఇళ్లపై న్యాయపరమైన హక్కులు కల్పించడమే స్వమిత్ర Svamitva E Survey Scheme లక్ష్యంగా అధికారులు చెబుతున్నారు..
అసలు ఈ స్వమిత్ర పథకం SVAMITVA (e-Survey) పథకం ఏమిటి?
స్వమిత్ర ఈసర్వే SVAMITVA (Survey of Villages and Mapping with Improvised Technology in Village Areas) పథకాన్ని భారత ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2020లో ప్రారంభించింది. ఈ పథకం ద్వారా గ్రామాల్లో భూములు, ఇళ్లపై స్పష్టమైన యాజమాన్య హక్కులు కల్పించడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం (డ్రోన్ సర్వే, GIS మ్యాపింగ్) వాడుతున్నారు. భూమి, ఇళ్లకు యాజమాన్య హక్కులు స్పష్టంగా నమోదు అవ్వకపోవడం వల్ల అనేక గ్రామాల్లో తరచుగా వివాదాలు వస్తున్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి స్వమిత్వ SVAMITVA పథకం ఎంతో ఉపయోగకరంగా మారుతోంది.
స్వమిత్ర సర్వేకు ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
- 1. ముందుగా పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్ (panchayat.gov.in)కి వెళ్ళాలి.
- 2. అక్కడ హోమ్‌పేజీలో "న్యూ యూజర్ రిజిస్ట్రేషన్" ఆప్షన్ పై క్లిక్ చేసి, దరఖాస్తు ఫారం ఓపెన్ చేసుకోవాలి.
- 3. పేరు, చిరునామా, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడి, భూమి వివరాలు వంటి ప్రాథమిక సమాచారాన్ని నమోదు చేసి అప్లికేషన్ ఫారమ్ దాఖలుచేయాలి.
- 4. అప్లికేషన్ దాఖలైన తర్వాత దానికి సంబంధించిన రసీదు మరియు అప్లికేషన్ ID వస్తుంది, దాన్ని భద్రంగా ఉంచుకోవాలి.
- 5. తర్వాత సమాచారాన్ని ఆధారంగా డ్రోన్ల సాయంతో మీ భూమిని కొలుస్తారు, సర్వే చేసి ప్రాపర్టీ కార్డులు జారీ చేస్తారు.
- 6. సర్వే కోసం సంబంధిత జిల్లా లేదా మండల పంచాయతీ కార్యాలయం, రెవెన్యూ శాఖ అధికారులను సంప్రదించవచ్చు.
ఇది స్వామిత్రా పథకం కింద గ్రామాల్లో భూమి హక్కుల సర్వేకు దరఖాస్తు చేసే నిర్వహణాత్మక, అధికారిక విధానం.
భూమి సర్వే పూర్తైన తర్వాత, మీరు మీకు చెందిన ఆస్తిపై అధికారిక హక్కు పత్రాలు (ప్రాపర్టీ కార్డులు) పొందవచ్చు, వాటితో మీరు రుణాలు పొందడం వంటి ఆర్థిక ప్రయోజనలు పొందవచ్చు..
గ్రామ సచివాలయానికి వెళ్లి ఇలా కూడా చేసుకోవచ్చు..
ఆధార్ కార్డు, భూ వివరాలుతో గ్రామ సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంటు వద్దకు వెళితే మీ వివరాలుతో స్విమిత్ర ఈ సర్వే కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తారు.. ఆ తరువాత గ్రామ పంచాయతీ ద్వారా మీకు షెడ్యూల్ తెలియజేస్తారు. రెవెన్యూ, సర్వే, డ్రోన్ బృందం మీ వద్దకు వచ్చి సర్వే చేసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తారు.. ఆ తరువాత మీకు యాజమాన్య హక్కు పత్రాలు జారీ అవుతాయి..
పథకం ప్రధాన లక్ష్యాలు ఇవే..
గ్రామ ప్రజలకు యాజమాన్య హక్కులపై న్యాయపరమైన ధృవీకరణ ఇవ్వడం, భూములు, ఇళ్ల సంబంధిత వివాదాలను తగ్గించడం తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వివాద రహితంగా చేసి శాంతిభద్రతలను నెలకొల్పడం
డిజిటల్ ప్రాపర్టీ కార్డులు జారీ చేయడం ద్వారా ఆధునిక పద్ధతిలో రికార్డులు సృష్టించడం,
గ్రామాల్లోని ఆస్తులను బ్యాంకు రుణాల కోసం పూచీకత్తుగా వాడుకునే అవకాశం కల్పించడం ఉదాహరణకు బ్యాంకు రుణాలు, వ్యక్తిగత, వ్యాపార రుణాలు, గృహ నిర్మాణ రుణాలు తీసుకునేందుకు హక్కుల పత్రాలు ఇవ్వడం,
భవిష్యత్‌లో గ్రామీణ ప్రణాళికలు రూపొందించడానికి స్పష్టమైన డేటా సిద్ధం చేయడం వంటివి ప్రధాన లక్ష్యాలుగా అధికారులు చెబుతున్నారు.
పథకం అమలు విధానం ఇలా ఉంటుంది..
- మొదట గ్రామంపై డ్రోన్ సర్వే నిర్వహించి, కచ్చితమైన మ్యాప్ రూపొందిస్తారు.
- జీఐఎస్ (GIS) టెక్నాలజీ సహాయంతో ప్రతి ఇల్లు, భూమి సరిహద్దులు గుర్తిస్తారు.
- అధికారుల పర్యవేక్షణలో వివరాలను ధృవీకరించాక, యాజమాన్యాన్ని ఖరారు చేస్తారు.
- గ్రామ ప్రజలకు ప్రాపర్టీ కార్డు Property Card అందజేస్తారు.
- ఈ ప్రాపర్టీ కార్డు ద్వారా వారు రుణాలు పొందడమే కాకుండా, ఆస్తిపై సంపూర్ణ హక్కు కూడా పొందుతారు.
ప్రయోజనాలే ఎక్కువ..
- అనుభవిస్తున్న ఆస్తి లేదా భూమిపై న్యాయపరమైన హక్కులు పొందడంతో ప్రభుత్వ పథకాలు, బ్యాంకు రుణాలు సులభంగా పొందే అవకాశం కలుగుతుంది
- . భూమి, ఇళ్లపై స్పష్టమైన డిజిటల్ రికార్డులు జారీ చేయడం వల్లన
- కోర్టు కేసులు, గ్రామస్థాయి వివాదాలు తగ్గడం ద్వారా గ్రామాభివృద్ధి కోసం సరైన ప్రణాళికలు రూపొందించగలగడం జరుగుతుందంటున్నారు..