Vande Bharat Train News: : విశాఖ- సికింద్రాబాద్ మార్గంలో అత్యంత ఆదరణ పొందిన వందేభారత్‌(Vande Bharath) రైలుకు ఏలూరు రైల్వేస్టేషన్‌లో హాల్ట్‌ ఇచ్చారు. ప్రయాణికుల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 25 నుంచి ఏలూరు రైల్వేస్టేషన్‌లో  వందేభారత్‌ రైలు ఒక నిమిషం పాటు ఆగనుంది.  సికింద్రాబాద్ (Secunderabad)నుంచి బయలురేనున్న వందేభారత్ రైలు ఉదయం 9.49 నిమిషాలకు  ఏలూరు(Eluru) రైల్వేస్టేషన్ చేరకోనుంది. అనంతరం ఒక నిమిషం పాటే  స్టేషన్‌లో ఆగి వెంటనే 9.50కి తిరిగి బయలుదేరి వెళ్లనుంది. అలాగే విశాఖ నుంచి సికింద్రాబాద్ వెళ్లే మార్గంలో సాయంత్రం 5.54 గంటలకు ఏలూరు రైల్వేస్టేషన్‌కు రానున్న వందేభారత్‌ రైలుు...ఒక నిమిషం పాటు ఆగి మళ్లీ 5.55 గంటలకు బయలుదేరి వెళ్లనుంది. రైల్వేశాఖ నిర్ణయంపై  ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రజలు కృతజ్ఞతలు చెబుతున్నారు.


ఈ స్టేషన్‌లో ఒ నిమిషం పాటు రైలు ఆగడం వల్ల ఏలూరుతోపాటు చుట్టుపక్కల ఉన్న భీమవరం, నర్సాపురం, పాలకొల్లు తదితర ప్రాంతాల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. అటు విశాఖ వెళ్లే వాళ్లతోపాటు...హైదరాబాద్‌ వెళ్లే వాళ్లకు ఎంతో సౌకర్యంగా ఉండనుంది. దేశంలోనే అత్యంత ఆదరణ పొందిన వందే భారత్‌ రైళ్లను అత్యంత రద్దీ మార్గాల్లో ప్రవేశపెట్టారు. ప్రధాని నరేంద్రమోదీ  చేతుల మీదుగా ఈ రైలు ప్రారంభించారు. సికింద్రాబాద్‌ -విశాఖతోపాటు , సికింద్రాబాద్‌- తిరుపతి, సికింద్రాబాద్‌- బెంగళూరు మార్గాల్లో వందేభారత్ రైళ్లు తిరుగుతున్నాయి. విమానం స్థాయి సౌకర్యాలతో  పూర్తి ఏసీ కంపార్ట్‌మెంట్ తో కూడిన ఈ వందేభారత్‌ రైలులో మొత్తం సిట్టింగ్‌కే అవకాశం ఉంది. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే ఈ రైళ్లు పరిమిత స్టేషన్లలో మాత్రమే ఆగుతాయి. శుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు  అధిక వేగంతో దూసుుపోవడంతో  అతి తక్కువ సమయంలోనే  ఈ రైళ్లు  ఎంతో ఆదరణ లభించాయి. దాదాపు అన్ని సీట్లు నిండిపోతున్నాయి. త్వరలోనే స్లీపర్‌ క్లాస్‌ ప్రవేశపెట్టపోతున్నట్లు  రైల్వేశాఖ తెలిపింది.


పలు రైళ్లు పాక్షికంగా రద్దు

రైల్వే ఆధునీకీకరణ పనుల్లో భాగంగా  దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని విజయవాడ(Vijayawada) డివిజన్‌లో ట్రాఫిక్ నిర్వహణ పనులు చేస్తున్నారు. దీని కారణంగా కొన్ని రైళ్లను దారిమళ్లించగా...మరి కొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. మచిలీపట్నం- విజయవాడ- మచిలీపట్నం(07896/07769) రైలును పాక్షికంగా రద్దు చేశారు. నర్సాపూర్- విజయవాడ(07863), విజయవాడ- మచిలీపట్నం(07866), మచిలీపట్నం- విజయవాడ(07870), విజయవాడ – నర్సాపూర్( 07861) రైళ్లను సెప్టెంబర్ 2 నుంచి 29 వరకు రామవరప్పాడు , విజయవాడ మధ్య పాక్షికంగా రద్దు చేశారు.



రైళ్ల దారిమళ్లింపు
సెప్టెంబర్‌ 2,9,16,23 తేదీల్లో  యర్నాకులం-పాట్నా (12756),  సెప్టెంబర్ 7,14,21,28 తేదీల్లో భావ్‌నగర్‌- కాకినాడ పోర్ట్‌(12756), సెప్టెంబర్‌ 4,6,11,13, 18, 20, 25, 27 తేదీల్లో బెంగళూరు- గౌహతి(12509) రైళ్లతోపాటు మరికొన్ని రైళ్లను దారి మళ్లించనున్నారు. ఇవన్నీ విజయవాడ- గుడివాడ, భీమవరం, నిడదవోలు మీదుగా దారి మళ్లించనున్నారు. ప్రయాణికుల మరింత మెరుగైన సేవలు అందించేందుకు అత్యాధునిక సిగ్నిలింగ్ వ్యవస్థ పనులను కొన్నిరోజులు నిర్వహిస్తున్నారు. ఇవన్నీ చివరి దశకు చేరుకున్నాయి. ఈ పనులు పూర్తి చేయాలంటే ఆయా మార్గాల్లో పూర్తిస్థాయిలో రైళ్లను నిలుపుదల చేయాల్సి ఉంటుంది. అందుకే కొన్నింటిని పాక్షికంగా రద్దు చేయగా...మరికొన్నింటిని దారిమళ్లించారు.