Eluru Constituency MLA Winner List 2024:  పశ్చిమగోదావరిని కూటమి క్లీన్‌ స్వీప్ చేసింది. ఈ ఉదయం కౌంటింగ్‌ మొదలైన తర్వాత వైసీపీ అభ్యర్థులు ఎక్కడా ప్రభావం చూపలేకపోయారు.  ఏడు నియోజకవర్గాల్లో కూడా కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. ఇందులో జనసేన  అభ్యర్థులు  పోలవరం, ఉంగుటూరు నుంచి విజయం సాధించారు. కైకలూరులో బీజేపీ అభ్యర్థి పోటీ చేసి విజయం సాధించారు. మిగతా నాలుగు చోట్ల టీడీపీ అభ్యర్థులు విజయకేతనం ఎగరేశారు. 

 

 

నియోజకవర్గం 

విజేతలు

1

ఉంగుటూరు

పత్సమట్ల ధర్మరాజు

2

దెందులూరు

చింతమనేని ప్రభాకర్‌

3

ఏలూరు

బడేటి రాధాకృష్

4

పోలవరం

తెల్లం రాజ్యలక్ష్మి

5

చింతలపూడి

సోంగ రోషన్‌

6

నూజివీడు

కొలుసు పార్థసారథి

7

కైకలూరు

కామినేని శ్రీనివాసరావు

ఈ నియోజకవర్గం హిస్టరీ చూసుకుంటే...

ఏలూరుజిల్లా ప్రజలు ఒకరిని నమ్మారంటే పూర్తిగా వారికే అంకితమవుతారు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఆ పార్టీ వెంటే నడిచిన ఓటర్లు....రాజశేఖర్‌రెడ్డి పాదయాత్రతో ఆయన్ను ఆదరించారు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పట్టం గట్టారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ నాలుగుచోట్ల విజయం సాధించగా....మూడుచోట్ల తెలుగుదేశం అభ్యర్థులు గెలుపొందారు. దాదాపు చెరిసమానంగా ఇరుపార్టీలను ఆదరించారు.

రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్‌పై ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఏలూరు జిల్లా ఓటర్లు విరుచుకుపడ్డారు. ఆ పార్టీని భూస్థాపితం చేయడమేగాక అనుభవజ్ఞుడైన చంద్రబాబు వెంట నడిచారు. గంపగుత్తగా ఓట్లన్నీ తెలుగుదేశం పార్టీకి పడటడంతో నూజివీడు మినహా జిల్లాలో ఆరుసీట్లు టీడీపీ కూటమి ఖాతాలోపడ్డాయి. ఒకచోట బీజేపీ విజయం సాధించింది.

ఒక్కఛాన్స్‌ అంటూ జగన్ చేసిన పాదయాత్ర ప్రభావం ఈ జిల్లాపైనా పడింది. వైసీపీ ఇచ్చిన ఉచిత హామీలకు ఆకర్షితులైన ఏలూరు జిల్లా ప్రజలు  2019 ఎన్నికల్లో వైసీపీకి పట్టం గట్టారు. మొత్తం సీట్లన్నీ జగన్ గెలుచుకున్నారు. తెలుగుదేశంపార్టీని కోలుకోని దెబ్బతీశారు. అయితే ఏలూరు జిల్లాలో ఈసారి ఓటింగ్‌శాతం స్వల్పంగా పెరిగింది. గత ఎన్నికల్లో 83.36శాతం ఓటింగ్‌ నమోదు కాగా...ఈసారి 83.68శాతానికి పోలింగ్ పెరిగింది.

                                                 ఏలూరు జిల్లా

 

2009

2014

2019

ఉంగుటూరు

కాంగ్రెస్

టీడీపీ

వైసీపీ

దెందులూరు

టీడీపీ

టీడీపీ

వైసీపీ

ఏలూరు

కాంగ్రెస్

టీడీపీ

వైసీపీ

పోలవరం

కాంగ్రెస్

టీడీపీ

వైసీపీ

చింతలపూడి

టీడీపీ

టీడీపీ

వైసీపీ

నూజివీడు

టీడీపీ

వైసీపీ

వైసీపీ

కైకలూరు

టీడీపీ

బీజేపీ

వైసీపీ