Betting over AP Election Results 2024: సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి.. మరో 24 గంటట్లో ఎన్నికల ఫలితాలు తేలనున్నాయి.. ఈలోపు బెట్టింగ్‌ల జోరు మరింత తీవ్రం అయ్యింది.. ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడ్డాక బెట్టింగ్‌లు మరింత బాగా పెరిగాయన్నది విశ్లేషకుల అంచనా.. ఇంతవరకు బాగానే ఉన్నా ఉభయగోదావరి జిల్లాల్లో పందెం రాయుళ్లు జోరు చాలా ఎక్కువ అనే అంటుంటారు.. అయితే ఇప్పుడు ఇదే గోదావరి జిల్లాల కేంద్రంగా గెలుపు గుర్రాలపై పదిరెట్లు ఎక్కువ బెట్టింగ్‌లు వేయడం, గెలుపు కంటేకూడా మెజార్టీలపై పందేలు కాయడం మరింత ఎక్కువైంది.. గెలుపుపై ధీమాతో తమ స్థాయికి మించి బెట్టింగ్‌ల్లో పాల్గనడం మరింత చర్చకు దారితీస్తోంది..
అన్నింటా బెట్టింగ్‌లు జోరు..
రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది.. వస్తే ఎన్నిసీట్లుతో అధికారం చేజిక్కించుకుంటుంది.. ప్రతిపక్షంగా మిగలనున్న పార్టీకు ఎన్ని సీట్లు వచ్చే అవకాశంఉంది.. ఇలా రాష్ట్ర స్థాయి నుంచి చివరకు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముఖ్యనేతల గెలుపు టార్గెట్‌గా పందేలు జోరు సాగుతోంది. ముఖ్యంగా పిఠాపురంలో పవన్ కల్యాణ్ ఎన్నిఓట్లు మెజార్టీతో గెలువబోతున్నారు.. ఉండి నియోజకవర్గంలో రఘురామకృష్ణంరాజు ఎన్ని ఓట్లు మెజార్టీతో గెలువబోతున్నారు. ఉమ్మడి తూర్పుగోదారి జిల్లాలో టీడీపీ ఎన్నిసీట్లు సాధిస్తుంది.. వైసీపీ గెలవబోయే సీట్లు ఎన్ని ఇలా అందు ఇందు అని కాదు అన్నింటా బెట్టింగ్‌లు వేసేలా బెట్టింగ్ బుకిలు ఆఫర్లుమీద ఆఫర్లు బెట్టింగ్ రాయుళ్లు ముందు ఉంచుతున్నారు.
పదిరెట్లు హెచ్చుతో కూడా పందేలా..
రూపాయికి పది రూపాయలు... వందకు వెయ్యి.. వెయ్యకు పదివేలు... ఇలా చాలా ప్రాంతాల్లో బెట్టింగ్‌లు జోరు కొనసాగుతోంది.. పవన్ కల్యాణ్‌కు ఓడిపోతే పదిరెట్లు హెచ్చు ఇస్తాం.. ఎవరైనా రెడీనా... అంటూ చాలా మంది బెట్టింగ్ రాయుళ్లు ముందుకు వస్తున్నారు. అయితే ఇందులో చాలా మంది వారి తాహతుకు మించి బెట్టింగ్‌లు వేయడం కనిపిస్తోంది. వీరి అదృష్టం బాగుండి వీరు అనుకున్న అభ్యర్ధి గెలిస్తే పరవాలేదు కానీ ఏమైనా తేడా కొడితే ఇక అంతే సంగతులని పలువురు అంటున్నారు. ఎందుకుంటే ఫ్రెస్టేజ్‌కు కొందరు అప్పుచేసి మరీ బెట్టింగ్‌లలో పాల్గంటున్నారని చెబుతున్నారు. ఏది ఏమైనా తేడా కొడితే పరిస్థితి మరింత అప్పులు ఊబిలోకి కూరుకుపోవడం ఖాయమని బెట్టింగ్ రాయుళ్ల కుంటింబీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోందట..
బెట్టింగ్ మోజులో జీవితాలు నాశనం..
బెట్టింగ్‌ల్లో పాల్గంటున్నవారు చాలా మంది యువకులే కావడం విశేషం.. ఇంట్లో తెలియకుండా డబ్బు తెచ్చి మరీ బెట్టింగ్ నిర్వాహకుల దోసెళ్లలో పోస్తున్నారని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట.. గత ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాలో టీడీపీ తరపున బెట్టింగ్‌లు కాసిన చాలా మంది తీవ్రంగా నష్టపోయి చివరకు ఆత్మహత్యాయత్నాలు కూడా పాల్పడ్డారని వార్తలు వచ్చాయి.. ఇప్పుడు అంతకు మించి బెట్టింగ్‌లు జరుగుతున్నాయి.. ప్రతీ అంశాన్ని బెట్టింగ్ ప్రాతిపదికగా తీసుకుని బెట్టింగ్‌లకు పురికొల్పుతున్నారు బెట్టింగ్ నిర్వాహకులు.. పోలీసులు కూడా ఈ వ్యవహారంపై పెద్దగా పట్టించుకోకపోవడంతో బెట్టింగ్‌ల జోరు మరీ తీవ్ర రూపం దాల్చింది..
రేపు తేలనున్న భవితవ్యం..
ఎన్నికల్లో పోటీచేసి ఫలితాలకోసం ఉత్కంఠతో ఎదురు చూస్తున్న అభ్యర్ధులు ఓ పక్క అయితే బెట్టింగుల్లో లక్షలాది రూపాయాలు కాసి ఫలితాలు కోసం అంతకంటే ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు బెట్టింగ్ రాయుళ్లు.. జూన్ నాలుగున ఎన్నికల ఫలితాలు తేలనున్న నేపథ్యంలో ఆతృతగా ఎగ్జిట్ పోల్ ఫలితాలను చూసి కొంత ఉపశమనం పొందుతున్నారట.. అయితే అన్ని సర్వేలు ఒకేలా రాకపోగా కొన్ని సంస్థలు కూటమి వస్తుందని, మరికొన్ని సర్వే సంస్థలు వైసీపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని చెప్పడంతో అసలు ఫలితం ఏమవుతుందో తెలియక ఉత్కంఠతో ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది..