Annavaram Temple: ప్రముఖ పుణ్య క్షేత్రం అయిన అన్నవరం శ్రీ వీర వెంకట సత్య నారాయణ స్వామి వారి మూల విరాట్టు కోసం వజ్ర కిరీటం సిద్ధం అయింది.  కాకినాడ జిల్లా పెద్దాపురంకు చెందిన శ్రీ లలిత ఎంటర్ ప్రైజెస్ ఇండస్ట్రీల్ ఎండీ సత్య ప్రసాద్.. సత్య దేవుడి కోసం ఈ వజ్ర కరీటాన్ని తయారు చేయించారు. మొత్తం 682 గ్రాముల బంగాలం 3, 764 వజ్రాలు, కెంపు పచ్చలతో కిరీటాన్ని తయారు చేశారు. దాత మట్టే సత్య  ప్రసాద్ స్వామి వారి కోసం అందించిన కరీటాన్ని స్వామి వారి 132వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అలంకరించనున్నట్లు ఆలయ అర్చకులు చెబుతున్నారు. అయితే శుక్రవారం భక్తుడు ఈ వజ్రపు కిరీటాన్ని తీసుకొని ఆలయానికి వచ్చాడు. ఛైర్మన్ రోహిత్, ఈవో ఎస్.వి సత్య నారాయణ మూర్తి, అధికారులు, బంగారు తనిఖఈ విభాగ అధికారులు, వైదిక బృందం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కరిటీం తయారీ వివరాలను ఛైర్మన్, ఈఓలకు దాత అందజేశారు. 


శనివారం వేకువ జామునే అలంకరణ..


దాత కుటుంబ సభ్యుల, అధికారుల సమక్షంలో వైదిక బృందం ప్రత్యేక పూజల అనంతరం స్వామి వారికి శనివారం రోజు ఈ కిరీటాన్ని తెల్లవారు జామునే అలంకరించనున్నారు. పర్వ దినాల్లో స్వామి వారికి వైరి ముడి బంగారు కిరీటాన్ని అలంకరిస్తారు. ఇకపై కూడా పర్వ దినాల్లో వైరి ముడతో, మిగిలిన అన్ని రోజుల్లో వజ్ర కిరీటంతో భక్తులకు స్వామి వారు దర్శనం ఇచ్చారు. 


ఏడాదిలోగా అమ్మ వారికీ చేయిస్తానని హామీ..!


అన్నవరం సత్య దేవుడికి వజ్ర కిరీటం చేయించిన దాత సత్య ప్రసాద్ అనంత లక్ష్మి అమ్మవారికి చేయించడానికి అంగీకరించారు. వజ్ర కరిటీంపై ఛైర్మన్, ఈవోలు చర్చిస్తూ.. అమ్మవారికి కూడా ఈ కిరీటం తయారు చేయించే విషయమై ప్రస్తావించారు. దీంతో దాత అమ్మవారికి కూడా తానే కిరీటం చేయిస్తామని వెల్లడించారు. ఏడాదిలోగా తయారు చేయించి అందిస్తానని దాత చెప్పడంతో స్వామి వారికి ఆయన చేస్తున్న సేవలను అంతా కొనియాడారు. స్వామి వారి శేష వస్త్రం, పూజ మాలతో దాతను సత్కరించారు. పురోహితులు ఆశీస్సులు అందించారు. స్వామి వారికి సేవ చేసుకునే అవకాశం తన పూర్వ జన్మ సుకృతంగా భావిస్తానని ఈ సందర్భంగా దాత అన్నారు. 


కోరుకున్న వారి కొంగు బంగారంగా నిలిచే..


పిలిస్తే పలికే దైవంగా పేరు పొందిన అన్నవరం స్రీ సత్య నారాయణ స్వామి ఆలయాన్ని రత్నగిరి అనే కొండపై అన్నవరంలో నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణం జరిగి శతాబ్దానికి పైనే అవుతోంది. అయినప్పటికీ ఈ దేవుడికి చాలా మహిమలు ఉన్నాయని భక్తుల నమ్మకం. అందుకే కోరుకున్న వారి కొంగ బంగారంగా నిలిచే ఈ స్వామి వారికి తమ మొక్కులు చెల్లించుకుంటారు. కొత్తగా పెళ్లయిన ఎన్నో జంటలకు అక్కడ వ్రతం చేయించడం ఆనవాయితీగా వస్తోంది. అలాగే ఎక్కువ శాతం మంది సత్య దేవుడి సన్నధిలో పెళ్లిళ్లు కూడా చేస్కుంటారు. 


అయితే సత్నాన్నే పలుకు, ప్రియంగా మాట్లాడు, నిజమైనా అప్రియమైన మాటలు వద్దు. ఇదే సనాతన ధర్మం అనేదే సత్య దేవుడి భావన అని మన పురాణాలు చెబుతున్నాయి. ఇది ఎలా మాట్లాడలో మాత్రమే కాదు, ఏది అడగాలో, ఏం వినాలో కూడా చెబుతుంది. నిజం అనుకున్నప్పుడే వినాలి. మంచి మాటలే వినాలి అలాంటి సత్యమైన దేవుడే అన్నవరం సత్య నారాయణ స్వామి. సత్యాన్ని ఆశ్రయించిన వారికి బాధలు ఉండవని కూడా ఈ స్వామి కథలు వివరిస్తాయి.