కాకినాడ: కాకినాడ నగరంలోని గాంధీనగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఏపీఎస్పీ (APSP) కానిస్టేబుల్ నాగేశ్వరరావును గుర్తుతెలియని వ్యక్తులు అత్యంత క్రూరంగా హత్య చేశారు. ఒక్కసారిగా దాడి చేసిన నిందితులు, కత్తితో గొంతు కోయడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. జనసంచారం ఉండే ప్రాంతంలోనే ఈ హత్య జరగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Continues below advertisement

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, క్లూస్ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. ప్రాథమిక విచారణలో భాగంగా పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పాత కక్షల కారణంగానే ఈ హత్య జరిగిందా లేక వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

సొంత బామ్మర్దులే హత్య చేశారా..!

Continues below advertisement

నాగేశ్వరరావు ఏపీఎస్పీ విభాగంలో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. ఆదివారం రాత్రి ఆయన గాంధీ నగర్ నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా, గుర్తు తెలియని వ్యక్తులు ఒక్కసారిగా ఆయనపై దాడి చేశారు. కత్తితో గొంతు కోయడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతిచెందారు. కుటుంబ గొడవల కారణంగా సొంత బావమర్ధులే ఈ హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. 

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో మరో ఇద్దరి అరెస్ట్ దళిత యువకుడు, ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించిన వ్యవహారంలో పోలీసులు మరో ఇద్దరు నిందితులు కడియాల చిన్నబాబు(A2), కడియాల సతీశ్‌(A3)లను అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో తలదాచుకున్న వీరిని పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు అనంతబాబు ఆదేశాలతో చిన్నబాబే సాక్షులను బంధించి, ప్రలోభాలకు గురిచేసి బెదిరించినట్లు పోలీసులు గుర్తించారు.

ఎమ్మెల్సీ అనంతబాబు జైలు నుంచే చిన్నబాబు ఫోన్‌కు వీడియో కాల్ చేసి సాక్షులను బెదిరించినట్లు సమాచారం. మాజీ మంత్రి కన్నబాబుకు సన్నిహితుడైన చిన్నబాబును విచారిస్తే, సాక్షుల కొనుగోలుకు ఉపయోగించిన నిధుల మూలాలు, ఆర్థిక లావాదేవీల వివరాలు బయటపడతాయని పోలీసులు భావిస్తున్నారు. ఈ అరెస్టుతో కేసు దర్యాప్తులో కీలక పురోగతి లభించింది.

చేపల చెరువులో పడి ఇద్దరు మృతి..పల్నాడు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నరసరావుపేట మండలం కాకాని చేపల చెరువులో మేతకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు పడవ బోల్తా పడటంతో మృతి చెందారు. కొమ్మాలపాడు వాసులు చెరువును లీజుకు తీసుకొని చేపల పెంపకం చేపట్టారు. ఆదివారం చేపల మేతకు చెరువులోకి వెళ్లగా పడవ బోల్తాపడటంతో ఇద్దరు మృతి చెందినట్లు తెలిపారు. మృతులు అగ్రహారానికి చెందిన హుస్సేన్, పిట్టంబండ్ల హుస్సేన్ బుడేగా పోలీసులు గుర్తించారు.