Just In





CM Chandrababu: కొలికపూడి కి పెడముఖం, పిఠాపురం వర్మ కు షేక్ హ్యాండ్.. చంద్రబాబు వైఖరిపై టీడీపీలో చర్చ
Andhra Pradesh News | చంద్రబాబు వైఖరి పై టీడీపీ లో చర్చ జరుగుతోంది. ఓవైపు టీడీపీకి చెందిన కొలికపూడి కి పెడముఖం... మరోవైపు పిఠాపురం వర్మతో ఎంచక్కా మాట్లాడటం పార్టీలో హాట్ టాపిక్ అవుతోంది.

రెండు రోజుల వ్యవధి లో టీపీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతలతో ప్రవర్తించిన తీరు ఇప్పుడు తెలుగుదేశం లో చర్చ నీయాంశమైంది. వారే ఒకరు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ కాగా మరొకరు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. ఇటీవల కాలంలో టీడీపీ లో ఈ ఇద్దరు నేతల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అధిష్టానం పట్ల కొంతమేర అసహనం తోనే ఇద్దరూ ఉన్నారు. అయితే ఆ ఇద్దరి పట్ల చంద్రబాబు వైఖరి మాత్రం ఒకేలా లేదు.
కొలికపూడి శ్రీనివాస్ ను పట్టించుకోని చంద్రబాబు
ఇటీవల కాలంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నియోజకవర్గం ముప్పాళ్ళ లో పర్యటించారు. సీఎం హోదాలో వెళ్లిన ఆ పర్యటనకు మంత్రులు దగ్గర నియోజకవర్గ ఎమ్మెల్యేలు హాజరై ఆయనకు స్వాగతం పలికారు. వారిలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ కూడా ఉన్నారు. మిగిలిన నేతలు అందర్నీ ఆప్యాయంగా పలకరించిన చంద్రబాబు కొలికపూడిని మాత్రం పట్టించుకోలేదు. చంద్రబాబు దగ్గరికి వెళ్లడానికి కొలికిపూడి పదే పదే ప్రయత్నించినా అసలు అటువైపు ఆయన చూడలేదు. చివరికి ఒకానొక దశలో చంద్రబాబుకు ఎదురుగా వెళ్లే ప్రయత్నం కొలికపూడి శ్రీనివాస్ చేసిన కూడా ఆయన నుంచి స్పందన ఎదురు కాలేదు. దానితో సైలెంట్ గా వెనక్కి జరిగి పోయారు కొలికిపుడి శ్రీనివాస్. ఇదంతా ఆ వీడియోలో ప్రసారం కావడంతో కొలికపూడి శ్రీనివాస్ పై చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారు అని టిడిపిలో ప్రచారం జరిగింది.
పిఠాపురం వర్మను ఆప్యాయంగా పలకరించిన చంద్రబాబు
పిఠాపురం వర్మ గా పాపులర్ అయిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే SVSN వర్మ ఈమధ్య వార్తల్లో ప్రముఖంగా తెలుసుకొని వ్యక్తి. పవన్ కళ్యాణ్ కి సీటు కేటాయింపులో భాగంగా పిఠాపురం అసెంబ్లీ సీటుని ఆయన కోల్పోవాల్సి వచ్చింది. అయితే జనసేన అక్కడ గెలిచిన తర్వాత తనకు ప్రాధాన్యం తగ్గుతుందన్న భావనలో వర్మ ఆయన సన్నిహితులు ఉన్నారు. దానికి తోడు ఇటీవల నాగబాబు చేసిన వ్యాఖ్యలు కూడా వర్మకు సొంత పార్టీ అధిష్టానం పట్ల అసలు కలిగించాయి అన్న ప్రచారం బలంగా జరిగింది. దానితో ఆయన పార్టీ మీద కొంత కోపం తోటే ఉన్నారు. అయితే ఇటీవల విజయవాడలో జరిగిన దేవినేని ఉమామహేశ్వరరావు కుమారుడు నిశ్చితార్థ వేడుకలో కలిసిన వర్మను చంద్రబాబు ఆప్యాయంగా పలకరించారు. పైపెచ్చు షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ కుశల ప్రశ్నలు వేశారు. దీనితో వర్మ కు టిడిపి హైకమాండ్కు మధ్య గ్యాప్ ఉన్నట్టు జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది.
వర్మ చేసిన ఒప్పు ఏమిటి... కొలికపూడి చేసిన పొరబాటు ఏమిటి?
ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న ప్రధానమైన చర్చ అధిష్టానం పట్ల అసహనం తో ఉన్న ఇద్దరు నేతలతోనూ చంద్రబాబు విభిన్నంగా ప్రవర్తించడం వ్యవహరించడం ఏమిటని. అయితే దీనిపై ఒక ఆసక్తికరమైన విశ్లేషణ వినబడుతోంది. అమరావతి రైతుల ఉద్యమం తో వెలుగులోకి వచ్చిన కొలికపూడి శ్రీనివాస్ కు తిరువూరు నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు. కూటమి ఊపులో గెలిచిన ఆయన మొదటినుంచి ఎగ్రసీవ్ గానే పనిచేస్తూ వచ్చారు. నియోజకవర్గం లో తప్పు అని తెలిస్తే వెంటనే దానికి వ్యతిరేకంగా నిలబడుతున్నారాయన. అయితే ఒక్క విషయంలో మాత్రం పొరపాటు చేశారనే చెప్పుకోవాలి. అదే దూకుడు తనం. ఎమ్మెల్యే గా తననుతాను నిరూపించుకోవాలనే తాపత్రయంలో కొలికిపూడి శ్రీనివాస్ చూపించిన దూకుడుతనం కరెక్ట్ కాదని హై కమాండ్ భావిస్తోంది. కారణం ఇదే దూకుడు తనంతో వెళ్లడం వల్ల గత వైసిపి ప్రభుత్వం పూర్తిగా జనానికి దూరమైందని అందుకే 11 సీట్లకు పరిమితం అయిపోయిందని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే అధికారం లోకి వచ్చిన క్షణం నుంచి వ్యవహార శైలి లో దూకుడు తగ్గించుకోవాలంటూ పార్టీ నేతలకు పదే పదే చెబుతున్నారు. కొలికపూడి శ్రీనివాస్ ఈ విషయం లోనే పొరపాటు చేశారని పార్టీ నేతలు అందరిని కలుపుకుపోవడం లేదని చంద్రబాబుకు కంప్లైంట్ లు వెళుతున్నాయి.
మరోవైపు తాను చేస్తుంది కరెక్టే కదా.. ఎమ్మెల్యేగా మంచే చేస్తున్నాను కదా అనేది కొలుకుపూడి వాదన. దానికి తోడు ఇటీవల సమస్యలు పరిష్కరించకుంటే రాజీనామా చేస్తానంటూ డెడ్లైన్ విధించడం వంటి పనులు టీడీపీ హై కమాండ్ వద్ద ఆయన పట్ల అసహనం కలుగ జేశాయి అంటున్నాయి పార్టీ వర్గాలు." ఇంటి గొడవను రచ్చ చేసుకోవడం " వంటి పనులు ప్రజల దృష్టిలో పార్టీని పరుచున్న చేస్తాయి అనేది చంద్రబాబు ఆలోచన. ఇక్కడే చంద్రబాబుకు కొలికపూడి శ్రీనివాస్ కు మధ్య ఒక చిన్న గ్యాప్ అయితే వచ్చిందని పార్టీనుండే వినిపిస్తోంది. మరోవైపు పిఠాపురం వర్మ విషయంలో మాత్రం అధిష్టానం ఆలోచన మరోలా ఉంది.వరుస అవమానాలు ఎదుర్కొంటున్నా తనకి ఇస్తానన్న ఎమ్మెల్సీ సీట్ ఇంతవరకు ఇవ్వకపోయినా చంద్రబాబు నుండి ఎలాంటి మద్దతు లభించడం లేదన్న అభిప్రాయం వర్మ వర్గంలో ఉంది. దానితో పైకి చెప్పకపోయినా చంద్రబాబు పట్ల కొంత అసహనం అయితే పిఠాపురం వర్మ లో ఉందని ప్రచారం జరుగుతోంది. అయినప్పటికీ వర్మ ఎక్కడా తన సహనాన్ని కోల్పోలేదు. పైపెచ్చు వర్మ పట్ల స్థానికంగానే కాకుండా ఆయన సామాజిక వర్గంలోనూ ఒక సానుభూతి పెరుగుతోంది.
ఇండిపెండెంట్గా గెలిచే సత్తా ఉన్నా చంద్రబాబు మాట కోసం జనసేనకు పిఠాపురం సీటును త్యాగం చేశారనే ఇమేజ్ వర్మ కు ప్లస్ గా మారింది. ఇటీవల జనసేన వర్గం నుంచి తమకు అవమానాలు ఎదురవుతున్నాయి అంటూ వర్మ అనుచరు వర్గం ఆరోపిస్తోంది. అయినా కూడా పార్టీకి వ్యతిరేకంగా గానీ చంద్రబాబుకు వ్యతిరేకంగా గానీ ఏ మాత్రం మాట తూలకుండా వర్మ వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇవన్నీ చంద్రబాబు దృష్టిలో వర్మకు పాజిటివ్ ఇమేజ్ ని తీసుకొచ్చాయి. దానితో ఇటీవల విజయవాడలో ఓ ఫంక్షన్ లో కలిసిన వర్మను చంద్రబాబు షేక్ హ్యాండ్ ఇచ్చి మరి పలకరించారు. ఇది వర్మ అనుచర వర్గంలో ఒక పాజిటివ్ దృక్పథాన్ని పెంచింది. త్వరలోనే వర్మకు చంద్రబాబు న్యాయం చేస్తారని పిఠాపురంలో ప్రచారం మొదలైంది. సో అధిష్టానం పట్ల వేర్వేరు కారణాలతో అసహనంతో ఉన్న ఇద్దరు కీలక నేతలకు చంద్రబాబు నుండి వేరు వేరు రకాల ట్రీట్మెంట్ లభించడంలో వారి వారి ప్రవర్తనల్లోని వైరుధ్యాలే కారణమని అంటున్నారు రాజకీయ పరిణామాలు గమనిస్తున్న వారు.