Bhimavaram Viral News: ఓ యువతి మద్యం మత్తులో నడిరోడ్డుపైనే దర్జాగా పడుకుంది.. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం పాలకొల్లు హైవేపై బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. నెట్టింట ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.
భీమవరానికి చెందిన ఓ యువతి అకస్మాత్తుగా తూలుతూ జోగుతూ నడుస్తూ ఇక నడవలేని స్థితిలో నడిరోడ్డుపైనే పడుకుంది. ఆ రోడ్డు భీమవరం పాలకొలు రోడ్డు కావడంతో పూర్తి రద్దీగా ఉంటుంది. దీంతో అటువైపుగా వస్తున్న బొలేరా ట్రక్కు డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేసి బండిని ఆపివేశాడు. ఆ తరువాత ఆ వాహనం వెనుక అనేక వాహనాలు నిలిచిపోయాయి. వెనుక ఉన్నవారికి అసలు ఏం జరిగిందో తెలియక చాలా సేపు తికమకపడ్డారు. అయితే ద్విచక్రవాహనదారులు మాత్రం రోడ్డుమీదే దర్జాగా పడుకుని ఉన్న యువతిని చూస్తూ తప్పించుకుని వెళ్లిపోయారు. కానీ ట్రక్కులు, వాహనాలు యువతిని తప్పించుకుని వెళ్లే మార్గం లేకపోవడంతో అలానే ఉండిపోవాల్సి వచ్చింది. ఇలా సుమారు 20 నిమిషాలుపాటు నడిరోడ్డుపై పడుకుని ఉన్న యువతిని కదిపే సాహసం చేయలేక వాహనాలు నిలిచిపోయాయి..
మహిళా కానిస్టేబుళ్లు వచ్చి పక్కకు చేర్చి..
నడిరోడ్డుపై పడి ఉన్న మహిళను తొలుత చూసిన వారంతా కళ్లు తిరిగి కానీ పడిపోయిందేమో అనుకుని కంగారు పడ్డారు. అయితే ఆమె పరిస్థితి చూసినవారు ఆమె పూర్తిగా మద్యం మత్తులో ఉన్నట్లు గమనించి ఎవ్వరూ ఆమె వద్దకు వెళ్లే సాహసం చేయలేదు. చివరకు ట్రాఫిక్ కానిస్టేబుల్ ఒకరు వచ్చినా ఆమెను కదపలేని పరిస్థితి కనిపించింది. దీంతో ట్రాఫిక్‌ను ఆమె పక్కనుంచి క్లియర్ చేయాల్సి వచ్చింది కానీ అలానే ఉండిపోవాల్సిన పరిస్థితి తలెత్తింది.. దీంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో మహిళా కానిస్టేబుళ్లు వచ్చి ఆమెను రోడ్డుపక్కకు చేర్చారు. అయితే ఆమె పక్కనే పర్సు, సెల్‌ఫోన్ కూడా పడిఉండడం గమనార్హం.
వైరల్ అయిన వీడియో...
భీమవరం టౌన్‌లో నడిరోడ్డుపై మద్యం మత్తులో ఓ యువతి పడుకోవడం కొందరు ఆ సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో వైరల్ అయ్యింది.. అయితే మద్యం సేవించి వీరంగం సృష్టించిన యువతి భీమవరం లోనే ఉంటుందా లేక సమీపంలోని మరేదైనా గ్రామమా అని చర్చింకుంటున్నారు. నడిరోడ్డుపై వీరంగం సృష్టించి మద్యం మత్తులో రోడ్డుపై పడుకుని ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగించిన యువతిపై పోలీసులు కేసు పెట్టారా లేక పోనీలే అని వదిలేశారా అన్నది తెలియాల్సి ఉంది.