Bharat Gaurav Tourist Train Timings : రామజన్మభూమి ఆయోధ్యను చూడాలని అనుకుంటున్నారా? పనిలో పనిగా కాశీ పుణ్యక్షేత్రాన్ని సందర్శించే ఆలోచన ఉందా? ఈ రెండింటినీ కవర్ చేసేలా ఐఆర్‌సీటీసీ సరికొత్త ఆఫర్ ప్రకటించింది. దక్షిణ మధ్య రైల్వే చేపట్టే భారత్ గౌరవ్ ప్రత్యేక పర్యాటక రైలు ఇప్పుడు అయోధ్య- కాశీ పుణ్యక్షేత్రాలకి కూడా ట్రైన్స్ వేసింది. సికింద్రాబాద్ నుంచి బయల్దేరే ఈ ట్రైన్ రాజమండ్రి ఎప్పుడు వస్తుంది. అక్కడ టికెట్ బుక్ చేసుకున్న వాళ్లు ఎన్ని గంటలకు ఎక్కాల్సి ఉంటుంది... ఏ రోజు తిరిగి వస్తారో ఇక్కడ చూద్దాం.
సికింద్రాబాద్‌లో ప్రారంభమయ్యే యాత్ర సాగేదిలా..
సెప్టెంబర్ 9న ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది.. నిడదవోలు, రాజమహేంద్ర వరం, సామర్లకోట, తుని రైల్వేస్టేషన్లలో ఆగుతుందని అధికారులు తెలిపారు. పది రోజుల పాటు సాగే ఈ యాత్ర తొమ్మిది రాత్రుళ్లు, పది రోజులు సాగే ఈ యాత్రలో పూరిలోని జగన్నాథ ఆలయం, కోణార్క్ సూర్య దేవాలయం, దేవ్‌గఢ్‌లోని బాబా బైద్యనాథ్ ఆలయం, వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఆలయం, పరిసర పుణ్యక్షేత్రాలు, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణ దేవి ఆలయం, గంగా హారతి, అయోధ్యలోని రామ జన్మభూమి, హనుమాన్ గర్హి, ప్రయోగ్రాజ్‌లోని త్రివేణి సంగమ సందర్శించి రావచ్చు.
తెలంగాణలోని కాజీపేట జంక్షన్, వరంగల్లు, ఖమ్మం, ఆంధ్రలోని విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం స్టేషన్లలో బోర్డింగ్/డీబోర్డింగ్ సదు పాయం కల్పించారు. ఈ యాత్రలో ఆన్ బోర్డు/ఆఫ్ బోర్డులో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి అల్పాహారం, భోజనం సౌకర్యం కల్పిస్తారు. పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు రోడ్డు మార్గంలో రవాణా సదుపాయం ఉంటుంది. రాత్రుళ్లు హోటళ్లలో బస చేయవచ్చు. కోచ్లలో సీసీ కెమెరాలతో నిరంతరం భద్రత ఏర్పాట్లు, టూర్ ఎస్కార్టులు అందుబాటులో ఉంటాయని ఐఆర్సీటీసీ తెలిపింది.
భారత్ గౌరవ్ ట్రైన్ ప్యాకేజీ ధరలు ఇవే,
ఈ యాత్రలో ఎకానమి (స్లీపర్ క్లాస్)పెద్దలకు ఒక్కొక్కరికి రూ.17,000, పిల్లలకు రూ.15,800, స్టాండర్డ్ (3 ఏసీ)లో పెద్దలకు రూ.26,700, పిల్లలకు రూ.25,400, కంఫర్ట్ (2 ఏసీ) పెద్దలకు రూ 35,000లుగా నిర్ణయించారు. ఆసక్తి కలిగిన వారు ఆర్ఆర్సీటీసీ 9701360701, 9281030712, 9701360701, 92810 30714 నంబర్లకు ఫోన్ చేసి టికెట్ బుక్ చేసుకోవచ్చు.
భారత్ గౌరవ్ ట్రైన్ ఆగే స్టేషన్‌ల టైమింగ్స్
| తేదీ | స్టేషన్ పేరు | స్టేషన్‌కు వచ్చే టైం | బయల్దేరే టైం | |
| 1 | 09-09-2025 మంగళవారం | సికింద్రాబాద్ | - | 11 గంటలకు |
| 2 | 09-09-2025 మంగళవారం | ఖాజీపేట | మధ్యాహ్నం 2 గంటలు | మధ్యాహ్నం రెండు గంటల ఐదు నిమిషాలు |
| 3 | 09-09-2025 మంగళవారం | వరంగల్ | మధ్యాహ్నం రెండున్నర | మధ్యాహ్నం 2.35 గంటలు |
| 4 | 09-09-2025 మంగళవారం | ఖమ్మం | సాయంత్రం 4.55 | సాయంత్రం ఐదు గంటలు |
| 5 | 09-09-2025 మంగళవారం | విజయవాడ | రాత్రి 7 గంటలు | రాత్రి 7.10 గంటలు |
| 6 | 09-09-2025 మంగళవారం | గుడివాడ | రాత్రి 8 గంటలు | రాత్రి 8.05 |
| 7 | 09-09-2025 మంగళవారం | భీమవరం | రాత్రి 9.25 | రాత్రి 9.30 |
| 8 | 09-09-2025 మంగళవారం | తణుకు | రాత్రి 10.10 | రాత్రి 1.15 |
| 9 | 09-09-2025 మంగళవారం | నిడదవోలు | రాత్రి 10.50 | రాత్రి 10.55 |
| 10 | 09-09-2025 మంగళవారం | రాజమండ్రి | రాత్రి 23.25 | రాత్రి 23.30 |
| 11 | 10-09-2025 బుధవారం | సామర్లకోట | అర్థరాత్రి 12.30 | అర్థరాత్రి 12.35 |
| 12 | 10-09-2025 బుధవారం | తుని | అర్థరాత్రి 1.45 | అర్థరాత్రి 1.50 |
| 13 | 10-09-2025 బుధవారం | దువ్వాడ | వేకువజాము 3.15 | వేకువజాము 3.20 |
| 14 | 10-09-2025 బుధవారం | పెందుర్తి | వేకువజాము 3.55 | వేకువజాము 4.00 |
| 15 | 10-09-2025 బుధవారం | విజయనగరం | ఉదయం 4.55 | ఉదయం 5.00 |
భారత్ గౌరవ్ ట్రైన్ ప్రత్యేకతలు ఇవే..
భారతీయ రైల్వే ప్రవేశపెట్టిన ఒక ప్రత్యేక పర్యాటక రైలు పథకమే భారత్ గౌరవ్ ట్రైన్. ఇది భారతదేశం సంస్కృతి, చారిత్రక స్థలాలు, ఆధ్యాత్మిక వారసత్వాన్ని సందర్శించేందుకు ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఈ రైళ్లు థీమ్ ఆధారిత పర్యాటక సర్క్యూట్‌లకు అనుగుణంగా నడుస్తాయి. భారతదేశం గొప్ప సాంస్కృతిక వారసత్వం, చారిత్రక స్థలాలను ప్రపంచ పర్యాటకులకు పరిచయం చేయడం దీని ముఖ్య ఉద్దేశం. ఇది పర్యాటకాన్ని ప్రోత్సహించడం, స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం,
రైలు ప్రయాణాన్ని ఆకర్షణీయంగా మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది ర్వైల్వే శాఖ. థీమ్ ఆధారితంగా ఈ రైళ్లు రూపకల్పన ఉంటుంది.. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా, మన సంస్కృతి, సంప్రదాయాలతో ట్రైన్ బయట ఆకర్షణీయంగా డిజైన్ ఉంటుంది. వినైల్ ర్యాపింగ్, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్స్, CCTV, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ వంటి సౌకర్యాలు ఉంటాయి. సాధారణంగా AC III టైర్, AC II టైర్ లేదా డీలక్స్ AC కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. కొన్ని రైళ్లలో ప్రీమియం సౌకర్యాలు కల్పిస్తున్నారు. షవర్ క్యూబికల్స్, ఫుట్ మసాజర్లు, ఆన్‌బోర్డ్ క్యాటరింగ్, హౌస్‌కీపింగ్, సెక్యూరిటీ, టూర్ గైడ్స్ ,ప్యాకేజీలు హోటల్ వసతి, భోజనాలు, సైట్‌సీయింగ్, ట్రాన్స్‌ఫర్లు కలిగి ఉంటాయి.