AP Cm Chandra Babu: ప్రభుత్వ వ్యవహారాల్లోనే కాదు, పార్టీ వ్యవహారాల్లోనూ నిర్లక్ష్యాన్ని ఉపేక్షించబోనని తరచూ చెప్పే ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఇన్‌ఛార్జ్‌ నుంచి మంత్రి వరకు ఎవర్నీ వదలడం లేదు. చెప్పిన పని చెప్పినట్టుగా చేయాల్సిందేనంటూ క్లాస్ తీసుకుంటున్నారు. ఇలాంటి ఓ ఆడియో ఇప్పుడు వైరల్‌గా మారుతోంది. 


ఈ మధ్య తెలుగు దేశం సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టింది. దీంతోపాటు పట్టభద్రుల ఓట్ల నమోదు జరుగుతోంది. ఈ రెండింటిపై టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్‌లతో ఇటీవల చంద్రబాబు టెలీకాన్ఫిరెన్స్‌ నిర్వహించారు. అయితే ఈ కాన్ఫిరెన్స్‌లో కొందరి పని తీరుపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గౌరవించి పదవులు ఇస్తే పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు పని చేస్తున్నారని మండిపడ్డారు 


అలానే కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌కు క్లాస్‌ తీసుకున్న ఓ ఆడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. ఈ ఆడియో ఎవరు రికార్డు చేశారు. ఎవరు లీక్ చేశారనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు. 


ఇంతకీ ఆ ఆడియోలో ఏముంది..?


సుభాష్‌ గారు చెప్పండని ముఖ్యమంత్రి చంద్రబాబు అని అడగ్గానే సార్‌.. అవన్నీ నమోదవుతున్నాయి అన్నారు. ఈరోజు వీఆర్వోతోపాటు కార్యకర్తలందరూ వెళ్లారు సార్‌ అని సుభాష్‌ చెప్పారు. వెంటనే సీఎం చంద్రబాబు చూడయ్యా నువ్వు అవన్నీ మాట్లాడొద్దు అన్నారు. 


నువ్వు యంగ్‌స్టర్‌వి.. రాజకీయాలపై నీకింకా సీరియస్‌నెన్‌ రాలేదు.. ఫస్ట్‌ టైం ఎమ్మెల్యేవి, ఫస్ట్‌ టైం మంత్రివి.. నీ నియోజకవర్గం ఎక్కడుందో చూసుకున్నావా.. 20 పర్సంట్‌ చేశావ్‌.. రంపచోడవరం 20 పెర్సంట్‌.. రామచంద్రపురం 29 పెర్సంట్‌ అయ్యింది.. తొమ్మిదివేలు చేయాల్సింది 2635 చేశావు.. నిన్నకూడా 319 ఓట్లే చేశావ్‌.. ఏంటి? సీరియస్‌లీ.. ఫస్ట్‌ టైం గెలిచావ్ పార్టీ ఎంత గౌరవమిచ్చింది.. వేరే పార్టీ నుంచి వచ్చినా ఎమ్మెల్యేగా ఇచ్చి మంత్రి ఇస్తే కనీసం నీకు ఆ పట్టుదల లేకపోతే ఎట్లయ్యా నువ్వు.. అందరూ సీరియస్‌గా ఉండండి..క్లియర్‌గా చెబుతున్నా.. మిమ్మల్ని ఇది చేస్తున్నానుకోవద్దు.. నా బాధ్యత నీను చేస్తున్నా.. మీ బాధ్యత మీరు చేయండి..మీరు చేయకుంటే నేను కూడా సీరియస్‌గా ఆలోచిస్తాను.. పార్టీకి ఉపయోగపడకపోతే రాజకీయాలెందుకయ్యా నీకు.. ఎందుకు పనిచేస్తారు మీరు ఎమ్మెల్యేలు ఫ్రూవ్‌ చేసుకోవాలి.. ఎవ్రిడే మీకు థ్రెట్టే.. ఏ ఎలక్షన్‌ వచ్చినా మీరు ఫ్రూవ్‌ చేసుకోపోతే నేను కూడా ఆల్ట్రానేట్‌ ఆలోచిస్తాను.. ఎక్స్‌పెక్టేషన్ ప్రకారం మీరు పనిచేయలేదని.. ఎన్నిసార్లు చెపుతున్నాను. 95 సీఎం అని చెబుతున్నాను.. అన్ని ఎలక్షన్లలోనూ గెలిచాను. ఏ ఎలక్షన్‌లోనూ ఓడిపోలేదు.. సీరియస్‌గా తీసుకోండి.. అంటూ చంద్రబాబు క్లాస్‌ తీసుకున్నారు.. 


ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు.. 
కూటమి నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను పేరాబత్తుల రాజశేఖర్‌ పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికలను కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి ఉంది. అందుకే ప్రతీ నియోజకవర్గంలోనూ గ్రాడ్యుయేట్‌ ఓటర్లు ఎంత మంది ఉన్నారు.. ఇంకా ఎంత మంది అర్హత ఉండి ఓటు హక్కు పొందలేదు అనే విషయంలో ప్రతీ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి సారించి ఓటు హక్కులేని పట్టబధ్రులను తక్షణమే ఓటు నమోదు చేయించాలని పార్టీ నుంచి ఆదేశాలు అందాయి. అయితే చాలా నియోజకవర్గాలు వెనుకబడి ఉండడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు చేపట్టారు. 


సభ్యత్వ నమోదుతోపాటు ఓటర్ల నమోదుపై కూడా ఎప్పటికప్పుడు టెలీకాన్ఫిరెన్స్‌లు నిర్వహించి ఎమ్మెల్యేలతోపాటు నియోజకవర్గంలోని కీలక నేతలతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, పార్టీ కీలక నేతలు, ద్వితీయ శ్రేణి నాయకులు ఇలా వందల మంది కాన్ఫిరెన్స్‌లో ఉండగానే చంద్రబాబు మంత్రి సుభాష్‌కు క్లాస్‌ తీసుకున్నారు. ఆ ఆడియో ఇప్పుడు చర్చనీయాంశం కాగా దెబ్బతో చాలా మంది అలెర్ట్‌ అయినట్లు తెలుస్తోంది.


Also Read: ఏపీ టెట్‌-2024 జులై ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే