నచ్చకపోతే ఉద్యోగం నుంచి పీకిపాడేయండి అంటు వాలంటీరల్‌పై విమర్సలు చేశారు మంత్రి దాడిశెట్టి రాజ. కాకినాడలో నిర్వహించిన ప్లీనరీలో మాట్లాడిన రోడ్లు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా ఈ కామెంట్స్ చేశారు. 


కాకినాడ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు అధ్యక్షతన నడకుదురులో ఏర్పాటు చేసిన ప్లీనరీకి ముఖ్య అతిథులుగా మంత్రులు దాడిశెట్టి రాజా, సిద్దిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ వైఎస్సార్సీపి పార్టీ అధికారంలోకి వచ్చిందంటే అది కేవలం కార్యకర్తల వల్లే అని అన్నారు. వాలంటరీ వ్యవస్థ  వాళ్ళ కాదని.. వాలంటీర్లు ఎవరైనా కార్యకర్తలపై అజమాయిషి చేయాలని చూస్తే పీకి పాడైండని మంత్రి రాజా సూచించారు. మరో మంత్రి చెల్లుబోయిన వేణు మాట్లాడుతూ రాష్ట్రంలో 35 లక్షల ఇళ్ళు స్థలాలు ఇచ్చిన ఘనత కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మాత్రమే దక్కుతుందని అన్నారు. కార్యక్రమంలో ఎంపీ వంగా గీతా విశ్వనాథ్, రాజ్య సభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, పిఠాపురం శాసనసభ్యులు పెండం దొరబాబు పాల్గొన్నారు.


ఈ మధ్యకాలంలో వాలంటీర్ వ్యవస్థపై అధికార పార్టీకి చెందిన నాయకులు వివాదాస్పద వ్యాక్యలు చేస్తున్నారు. మొన్నటి మొన్న ఏపీ హోమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ... వాలంటీర్లు అంతా తమ పార్టీ కార్యకర్తలేనని అన్నారు. ఓ పక్క సీఎం జగన్ వాలంటీర్ల నియామకంలో పారదర్శకంగా ఉన్నామని చెబుతుంటే మరో పక్క హోంమంత్రి తానేటి వనిత అందుకు విరుద్ధమైన కామెంట్స్ చేశారు. మంత్రి అంబటి కూడా గుంటూరులోని ఓ ప్లీనరీలో ఇలాంటి కామెంట్స్ చేశారు. 


తమకు న్యాయం చేయడం లేదని కార్యకర్తలు, నేతలు ఆరోపిస్తున్న టైంలో వాళ్లను శాంతిపజేయడానికి మంత్రులు, వైసీపీ లీడర్లు వాలంటీర్లను ముందుకు తీసుకొస్తున్నారు. వాళ్లంతా పార్టీ కేడరేనంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వ్యవస్థను తీసుకొచ్చిన మొదట్లో.. ప్రతిపక్షాలు కూడా ఇలాంటి కామెంట్స్ చేస్తే కొట్టి పారి ఆగ్రహం వ్యక్తం చేసిన అధికార పార్టీ నేతలు ఇప్పుడు వాళ్లంతా తమ పార్టీ కార్యకర్తలే అని చెప్పుకోవడంపై విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి. 


ప్రజలకు పారదర్శకంగా ప్రభుత్వ పథకాలు అందజేసేందుకు ఈ వ్యవస్థను తీసుకొచ్చామని.. ప్రజలకు అన్నింటినీ చేరువ చేసేందుకు ఎలాంటి తారతమ్యాలు లేకుండా ఈ వ్యవస్థను నియమించామని సీఎం జగన్ చెబుతున్నారు. కానీ వైసీపీ లీడర్లు, మంత్రులు చేస్తున్న కామెంట్స్ మాత్రం దానికి వ్యతిరేకంగా ఉన్నాయి. ఇప్పటికే దీనిపై ప్రజలకు, రాజకీయా పార్టీలకు చాలా అనుమానాలు ఉన్నాయి. ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో వైసీపీ తరఫున పని చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో ఇప్పుడు మంత్రులు చేస్తున్న కామెంట్స్ వాటిని సమర్థింంచినట్టు కనిపిస్తోంది.