AP High Court Recruitment 2025 : ఏపీ హైకోర్టు పరిధిలో జిల్లా న్యాయవ్యవస్థలోని పలు విభాగాల్లో ఉన్న ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈసారి ఏకంగా 1621 పోస్టుల నియామకం కోసం ఆంధ్రపద్రేశ్‌ హైకోర్టు అధికారికంగా నోటిఫికేషన్‌ 2025ను విడుదల చేసింది. న్యాయ సేవల రంగంలో ఉద్యోగిగా పని చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను అధికారిక వెబ్‌సైట్ aphc.gov.inలో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ అర్హతను బట్టి నిర్దేశించిన గడువు అంటే జూన్ 2025, 2వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.

Continues below advertisement


జిల్లా న్యాయవ్యవస్థలోని ఈవిభాగాల్లో పోస్టుల భర్తీ..
ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు నోటిఫికేషన్‌ 2025కు సంబంధించిన 1621 పోస్టుల ఈ నియామక డ్రైవ్‌లో స్టెనోగ్రాఫర్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, టైపిస్ట్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్‌, ఎగ్జామినర్‌, కాపీయిస్ట్‌, డ్రైవర్‌, ప్రాసెస్‌ సర్వర్‌, ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ aphc.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష, నైపుణ్య పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా ఉంటుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌ షెడ్యూల్‌, ఏపీ హైకోర్టు సిలబస్‌ పరీక్ష సరళిని గమనించుకోవాలి. 


ముఖ్యమైన తేదీలు..
ఏపీ హైకోర్టు రిక్రూట్‌మెంట్‌ 2025 నోటిఫికేషన్‌కు సంబంధించిన ఏపీ హైకోర్టు ముఖ్యమైన తేదీలు ఇవే . 


నోటిఫికేషన్‌ జారీ తేదీ : 6 మే 2025


ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభతేదీ : 13 మే 2025


ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లకు ఆఖరి తేదీ :2 జూన్‌ (రాత్రి 11.59 గంటల వరకు)


పోస్టుల వివరాలు ఇవే..


ఆఫీస్‌ సబార్డినేట్‌  :651


జూనియర్‌ అసిస్టెంట్‌  :230


ఫీల్డ్‌ అసిస్టెంట్‌ :56


ఎగ్జామినర్‌: 32


స్టెనోగ్రాఫర్‌ : 80


డ్రైవర్‌ లైట్‌ వెహికల్‌ :28


టైపిస్ట్‌ :162


రికార్డ్‌ అసిస్టెంట్‌ :24


ప్రాసెస్‌ సర్వర్‌ :164


కాపీరైట్‌ :194


అభ్యర్థుల అర్హత, ఎంపిక విధానం ఇదే..


జూనియర్‌ అసిస్టెంట్‌  
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ. ఇక ఎంపిక విధానంలో రాతపరీక్ష ఆపై సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ఉంటుంది.  


స్టెనో గ్రాఫర్‌   
ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీ, ఇంగ్లీష్‌లో షార్ట్‌ హ్యాండ్‌, టైప్‌ రైటింగ్‌ నైపుణ్యాలు(హయ్యర్‌ గ్రేడ్‌). స్టెనోగ్రాఫర్‌ ఎంపిక విధానం మొదట రాతపరీక్ష, ఇంగ్లీష్‌ షార్ట్‌హ్యాండ్‌, టైపింగ్‌ స్కిల్‌ టెస్ట్‌ ఆపై సర్టిఫికెట్స వెరిఫికేషన్ ఉంటుంది.  


టైపిస్ట్‌ 
ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీ, ఇంగ్లీష్‌ టైప్‌ రైటింగ్‌ (హయ్యర్‌ గ్రేడ్‌) ఎంపిక విధానంలో రాత పరీక్ష, ఇంగ్లీష్‌ టైప్‌ రైటింగ్‌ స్కిల్‌ టెస్ట్‌ ఉంటుంది.


ఫీల్డ్‌ అసిస్టెంట్‌ 
ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీ. ఎంపిక విధానం రాత పరీక్ష ఉంటుంది.


ఎగ్జామినర్‌: 
ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన అర్హత. రాతపరీక్ష ఉంటుంది. పత్ర ధ్రవీకరణ జరుగుతుంది.


కాపీరైట్‌ 
ఇంటర్మీడియట్‌, ఇంగ్లీష్‌ టైప్‌ రైటింగ్‌ (హయ్యర్‌ గ్రేడ్‌).  రాత పరీక్ష, ఇంగ్లీష్‌ టైప్‌ రైటింగ్‌ స్కిల్‌ టెస్ట్‌ ఉంటుంది. 


రికార్డ్‌ అసిస్టెంట్‌ 
ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన అర్హత. రాతపరీక్ష ఉంటుంది.  


డ్రైవర్‌ 
7వ తరగతి పాస్‌, లైట్‌ మోటార్‌ వెహికల్‌ (ఎల్‌ఎంవీ) కోసం చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్‌ లైసెన్స్‌. రాతపరీక్ష, డ్రైవింగ్‌లో నైపుణ్యపరీక్ష, వైద్యపరీక్ష ఉంటుంది. 


ప్రాసెస్‌ సర్వర్‌ 
ఎస్‌.ఎస్‌.సీ(10వ తరగతి) లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత. రాతపరీక్ష ఉంటుంది. 


ఆఫీస్‌ సబార్డినేట్‌


7వ తరగతి ఉత్తీర్ణత. అంతకంటే ఎక్కువ అర్హత ఉన్నవారు అనర్హులు. వీళ్లకి కూడా రాతపరీక్ష ఉంటుంది.