దేశంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతంగా చిరపుంజికి ఓ ప్రత్యేకత ఉంది. దీనికి తోడు ప్రస్తుతం కోనసీమ ప్రాంతంలో వర్షపాతం ఏమాత్రం తగ్గకుండా కురుస్తోంది. ఇదే పరిస్థితి ఉభయం గోదావరి జిల్లాల వ్యాప్తంగా కూడా కనిపిస్తోంది. కానీ, అధికారిక లెక్కలు ప్రకారం మాత్రం కోనసీమ టాప్‌గా నిలిచింది.


గడచిన మూడు నెలల నుంచి వర్షాలు దంచికొడుతున్నాయి. మే నెల ఆఖర్లో ప్రారంభమైన వర్షాలు నేటికీ అంతే స్థాయిలో కొనసాగుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలు జల మయం అవ్వగా చెరువులు, డ్రైన్లు నిండుకుండల్లా మారాయి. అయితే కోనసీమలో ఎక్కువ ప్రాంతం ఇసుకతో కూడిన నేల కావడంతో చాలా వరకు వర్షం నీరు భూమిలో ఇంకిపోయే పరిస్థితి కనిపిస్తోంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో అయితే ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంది. ఏ రోజూ గ్యాప్ లేకుండా భారీ వర్షాలు కురుస్తుండడంతో ఇక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. శుభకార్యాలు, ఇతర కార్యక్రమాలకు కురుస్తున్న వర్షాలు తీవ్ర ఆటంకాలను సృష్టిస్తున్నాయి. కోనసీమలోని పలు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు గుంతలమయంగా ఉండడంతో కురిసిన భారీ వర్షాలకు ఎక్కడ గుంత ఉందో తెలియక ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారు.


ప్రతి రోజూ దంచికొడుతూ..
ఈ ఏడాది మే ఆఖరి వారం నుంచి ప్రారంభమైన వర్షాలు జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు దంచికొడుతూనే ఉన్నాయి. మరో పక్క వాయుగుండం ప్రభావం గడచిన నెలల్లో మూడు సార్లు రావడంతో భారీ వర్షాలకు మరో కారణంగా నిలిచింది. తూర్పు వర్షాలు మరో పక్క మొత్తం మీద భారీ వర్షాలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో తెల్లవారుజామున మొదలై మధ్యాహ్నం వరకు ఏకబిగిన వర్షం కురుస్తోంది. మరికొన్ని సందర్భాల్లో జల్లులుగా రోజంతా కురుస్తూ ఉండడంతో పనులు జరగడం లేదని ప్రజలు వాపోతున్నారు. గడచిన నాలుగు రోజుల్లో ఏపీడీఎస్ వెల్లడించిన సమాచారం మేరకు కోనసీమ ప్రాంతంలో శనివారం సాధారణం కంటే ఎక్కువగానే వర్షపాతం నమోదైంది.


Also Read: వేరే దేశాల్లో అయితే చంద్రబాబుకు ఉరి శిక్ష వేసే వాళ్లు: అంబటి రాంబాబు


వర్షాలు.. వరదలు..
ఉభయగోదావరి జిల్లాల్లో మూడు నెలల వ్యవధిలో మూడు సార్లు వరదలు విరుచుకుపడ్డాయి. దీంతో శబరి, గౌతమి, వశిష్ట, వైనతేయ, వృద్ధగౌతమి నదీపాయలను ఆనుకుని ఉన్నటువంటి పరివాహక లంక గ్రామాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి తలెత్తింది. మరో పక్క మూడు నెలలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అంతే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి తలెత్తింది. అయితే వర్షాలు అతి భారీగా కురవకపోవడం కొంత ఉపశమనమే కాగా కోనసీమ ప్రాంతంలో ఉన్నటువంటి సముద్రం ముంపు నీటిని అంతే వేగంగా స్వీకరించడం, నేల స్వభావం కూడా పీల్చుకునే విధంగా ఉండడం చాలావరకు ఇక్కడి ప్రజలకు ఇబ్బందులును తప్పించింది.


Also Read: Delhi Liquor Scam: లిక్కర్ స్కామ్‌తో మాకు సంబంధం లేదు: ఆరోపణలపై ఎంపీ మాగుంట ఏమన్నారంటే