AP Weather Updates: ఏపీ, తెలంగాణలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు తగ్గుముఖం పట్టాయి. నేడు ఏపీలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈశాన్య దిశ నుంచి తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో నేడు, రేపు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని అంచనా వేశారు. నైరుతి బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది.
వర్షాలు తగ్గుముఖం పడుతుండటంతో కోస్తాంధ్ర, యానాంలో చలి తీవ్రత కాస్త తగ్గనుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, యానాం (పుదుచ్చేరి)లలో వర్షాలు కురిసే అవకాశం లేదని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తాంధ్రలో నేడు వర్షాలు కురవనున్నాయి. రేపు సైతం ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని అమరావతి కేంద్రం అంచనా వేసింది. గుంటూరు, కృష్ణా, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నేడు సైతం తేలికపాటి జల్లులు కురవనున్నాయి. అకాల వర్షాల నేపథ్యంలో రైతులు తమ ధాన్యం, పంట ఉత్పత్తులను నీటి పాలు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ కేంద్రం అధికారులు సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లడానికి ఎలాంటి సమస్య ఉండదని తెలిపారు.
రాయలసీమలో వర్షాలు..
రాయలసీమలో కొన్ని చోట్ల నేడు తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. రేపటి నుంచి రాయలసీమలో వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు. మరో రెండు రోజుల్లో రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.
తెలంగాణ వెదర్ అప్‌డేట్..
తెలంగాణలో గత వారం రోజులుగా పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. నేడు రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర వెల్లడించింది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. మంగళవారం సైతం ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఎలాంటి అలర్ట్ జారీ చేయలేదు.
Also Read: NVS Recruitment 2022: నవోదయ విద్యాలయ సమితిలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే..?
Also Read: Gold-Silver Price: అతి స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. రూ.300 పెరిగిన వెండి, నేటి తాజా ధరలు ఇవీ..