Raghurama will be elected as the Deputy Speaker of AP Assembly: ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా  రఘురామ కృష్ణరాజు నామినేషన్ వేశారు.  నారా లోకేష్ తో పాటు నాదెండ్ల మనోహర్, సభా వ్యవహరాల మంత్రి పయ్యావుల కేశవ్, సత్యకుమార్, పల్లా శ్రీనివాస్ నామినేషన్‌ను ప్రతిపాదిదంచారు. గురువారం రఘురామ ఏకగ్రీవంగా డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికయినట్లుగా ప్రకటించనున్నారు. వైసీపీ అసెంబ్లీకి రావడం లేదు. వారికి ఎన్నికల్లో పోటీ చేసే అంత బలం కూడా లేదు కాబట్టి  ఎన్నిక లాంఛన ప్రాయమే. 


చివరికి డిప్యూటీ స్పీకర్ పదవితో సరి పెట్టుకున్న రఘురామ         


రఘురామకృష్ణరాజు మంత్రి పదవి ఆశించారు. తర్వాత స్పీకర్ పదవి ఆశించారు. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ పదవితో సరి పెట్టుకుంటున్నారు. మొదట ఆయన ఎంపీ సీటు కోసం ప్రయత్నించారు. తన సిట్టింగ్ సీటు నర్సాపురం నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నించారు.  పొత్తుల్లో భాగంగా ఏ పార్టీకి సీటు వెళ్తే ఆ పార్టీలో చేరి పోటీ చేయాలనుకున్నారు. అయితే బీజేపీలో ఆయనకు సీటు రాలేదు. దాంతో ఆ పార్టీలో చేరలేదు. తర్వాత టీడీపీలో చేరారు.  ఓ దశలో ఆయనకు టిక్కెట్ వస్తుందా లేదా అన్న సందేహం ఏర్పడింది. చివరికి అతి కష్టం మీద ఉండి ఎమ్మెల్యే సీటు ఇచ్చారు. గెలిచిన తర్వాత మంత్రి పదవి అనుకున్నారు. రాలేదు. తర్వాత స్పీకర్ పదవి అనుకున్నారు..అదీ రాలేదు. చివరికి డిప్యూటీ స్పీకర్ పదవితో సరి పెట్టుకుంటున్నారు.           


Also Read: జగన్‌కు బైబై చెప్పేసిన దొమ్మేరు జమిందార్ అల్లుడు- గోదావరి జిల్లాల్లో వైసీపీకి బిగ్‌ షాక్


జనసేన కోటా అయినా రఘురామ కోసం త్యాగం             


మామూలుగా ఈ పదవి జనసేనకు ఇవ్వాల్సి ఉంది. స్పీకర్ పదవి టీడీపీ తీసుకున్నందున డిప్యూటీ స్పీకర్ పదవి జనసేనకే ఇస్తారని అనుకున్నారు. అయితే  సామాజిక సమీకరణాలు, రఘురామకు ఏదో ఓ ప్రోటోకాల్ పదవి కేటాయించాల్సి ఉండటంతో  రఘురామకు ఇవ్వాలని నిర్ణయించారు.దానికి పవన్ కూడా అంగీకారం తెలిపినట్లుగా తెలుస్తోంది. డిప్యూటీ స్పీకర్ పదవి పెద్దదేం కాదు కానీ.. ఆయనకూ ప్రోటోకాల్ ఉంటుంది. రఘురామకృష్ణరాజును డిప్యూటీ  స్పీకర్‌గా నియమించడం వైసీపీ అధినేత జగన్ కు మరింత ఇబ్బందికరమేనని  రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.


Also Read: ఏపీ డీఎస్సీపై కీలక ప్రకటన -అందుకే నోటిఫికేషన్ ఆలస్యమన్న మంత్రి లోకేష్


జగన్ ఇక అసెంబ్లీకి రాకపోవచ్చు !            


ప్రస్తుతానికి వైసీపీ అసెంబ్లీ బాయ్ కాట్ చేసింది. ఎప్పుడైనా ఆయన  అసెంబ్లీకి రావాలనుకుంటే అయితే అయ్యన్న పాత్రుడు లేకపోతే రఘురామ చైర్‌లో ఉంటారు. వీరిద్దరిపై  గతంలో పలు కేసులు నమోదయ్యాయి. రఘురామను కొట్టించారని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఆయన కేసు కూడా పెట్టారు.  అందుకే వీరు చైర్‌లో ఉంటే..  జగన్ సభకు  హాజరయ్యేందుకు సుముఖత చూపే అవకాశం లేదు. పరిస్థితి చూస్తూంటే ఆయన ఐదేళ్లూ సభకు రాకపోవచ్చని అంటున్నారు.