వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు రాష్ట్రంలో తాను జరిపించిన సర్వేను వెల్లడించారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 50 ఎమ్మెల్యే సీట్లు కూడా రావని తేలిలిందనిప్రకటించారు. నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గంలోనూ తాను సర్వే చేయించానని..ఇరువరం పోటీ చేస్తే జగన్ కన్నా తనకు 19 శాతం ఓట్లు ఎక్కువగా వస్తాయన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో గ్రంథి శ్రీనివాస్, తానేటి వనిత, శ్రీనివాసులు నాయుడు తప్ప ఎవరి పరిస్థితి సరిగా లేదన్నారు. చిత్తూరు జిల్లాలో ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో చెవిరెడ్డి, చంద్రబాబు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకానాధ్ రెడ్డి తప్ప ఎవరూ గెలవని ఆయన ప్రకటించారు.


తాను ఈ సర్వేను బయట పెట్టాలనుకోలేదని కానీ పెట్టేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేశారని వ్యాఖ్యానించారు. రఘురామ పార్లమెంటుకు వెళ్లడం లేదని సర్వే చేశారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. పార్లమెంట్ రికార్డు... అటెండెన్స్..ఎన్ని ప్రశ్నలు అడిగానో వాళ్లు తెలుసుకోవాలనిసూచించారు. అన్ని జిల్లాలకు సంబంధించి పూర్తి సర్వేసమాచారం తనదగ్గర ఉందన్నారు.  ప్రస్తుత పరిస్థితి ఇలా ఉందని... పరిస్థితి మారితే ప్రస్తుతం ఉన్న 150 కంటే ఎక్కువే రావొచ్చు లేకపోతే.. 50 కన్నా తక్కువే రావొచ్చని జోస్యం చెప్పారు.


వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో  విషయంలో విజయసాయిరెడ్డి చేసిన ప్రకటనలపై సీబీఐ విచారణ చేయాల్సి ఉందని రఘురామ అన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి విజయసాయిరెడ్డికి గుండెపోటు అని ఎవరు చెప్పారో సీబీఐ తెలుసుకోవాలన్నారు. హత్యను గుండెపోటుగా నమ్మించేందుకు ప్రయత్నించడమే కాకుండా రక్తపు మరకలను తుడిచేసిన వారిని ప్రశ్నించకుండా పేపర్లో ప్రకటనలు ఇస్తే ఏం ప్రయోజనమని.. ప్రజలు అనుకుంటున్నారని రఘురామ వ్యాఖ్యానించారు.  


ఏపీలో మద్యం శాంపిల్స్ తీసుకుని పరిశీలిస్తామని తనకు కేంద్ర మంత్రి నుంచిలేఖ వచ్చిందని ఎప్పుడు శాంపిల్స్ తీసుకుంటారో తెలియదన్నారు. ఇండియాలో ఎక్కడా అమ్మని మద్యం బ్రాండ్లు ఏపీలో ఉన్నాయని అవి ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నాయన్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వారం రోజులుగా మీడియా ముందుకు రాకపోవడంపై సెటైర్లు వేశారు. ఆయన వారం రోజులుగా కనిపించడం లేదని ఎక్కడికి వెళ్లారో ఏమైందో తెలియడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.


వైసీపీ నేతల ఆడియో టేపుల వివాదంపై మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పందించాన్ని ఆహ్వానించారు. తమ పార్టీ పరువు కాపాడాలని ఆమె కోరారు. తక్షణం విచారణ చేయించి.. ఆటేపులు ఎవరివో బయట పెట్టాలన్నారు. మిమిక్రి చేసిన వాళ్లని గుర్తించి శిక్షించాలన్నారు.  రోజువారీ ప్రెస్‌మీట్లలో రోజూ విమర్శలు చేసే రఘురామ ఈసారి సర్వే ఫలితాలను ప్రకటించడంతో అందరితోనూ ఆసక్తి వ్యక్తమయింది.