Punjabi children: తెలుగు రాష్ట్రాల్లో తెలుగు నేర్పడానికి స్కూళ్లు తటపటాయిస్తున్నాయి. సెకండ్ లాంగ్వేజ్ గా హిందీ, తెలుగుల్లో ఒకటి ఎంచుకోండని ఆఫర్లు ఇస్తున్నాయి. ఇంకా టీచర్ుల తెలుగు తక్కువ మంది తీసుకుంటారు.. హిందీ తీసుకోండని మోటివేట్ చేసే పరిస్థితి దాపురించింది. కానీ తెలుగు ఇతర రాష్ట్రాల్లో పిల్లలకు నేర్పిస్తున్నారు.
పంజాబీ పిల్లలు తెలుగు నేర్చుకుంటున్నారు. భారతీయ భాషా సమ్మర్ క్యాంప్ కింద పంజాబ్ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు తెలుగు భాష యొక్క ప్రాథమికాలను నేర్చుకుంటున్నారు. ఈ ప్రోగ్రాం కిదం భారతదేశంలో బహుభాషా విద్యను ప్రోత్సహించడం, విద్యార్థులు తమ మాతృభాషతో పాటు మరో భారతీయ భాషలో ప్రాథమిక సంభాషణ నైపుణ్యాలను పొందేలా చేయడానికి డిజైన్ చేశారు.
ఇప్పటికే ఈ తరగతులు ప్రారంభమ్యాయి. జూన్ 5, 2025 వరకు 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు పంజాబ్‌లోని అన్ని ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులు తెలుగు ప్రాథమికాంశాలను నేరపుతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో పంజాబీ నేర్పిస్తున్నారు. పాఠశాలలు సెలవు రోజుల్లో ఉదయం 8 నుంచి 11 గంటల వరకు లేదా పని రోజుల్లో సగం రోజు విరామం తర్వాత సెషన్లు నిర్వహిస్తారు. దీని వల్ల విద్యార్థులు తెలుగు భాషలో ప్రాథమిక సంభాషణ నైపుణ్యాలను నేర్చుకుంటారు,
ఇంగ్లీష్, హిందీ, పంజాబీ భాషా ఉపాధ్యాయులు ఈ క్యాంప్‌ను నడిపిస్తున్నారు. కొంతమంది ఉపాధ్యాయులు తెలుగు అక్షరాలు మరియు సంఖ్యలను పంజాబీలో వ్రాసి విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా నేర్పిస్తున్నారు. ఈ కార్యక్రమం ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ పథకంలో భాగంగా రూపొందించారు. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల మధ్య సాంస్కృతిక , భాషా ఐక్యతను ప్రోత్సహించడానికి ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చారు.
ఈ ఇనీషియేటివ్ పట్ల పలువురుతెలుగు ప్రజలు సోషల్ మీడియాలో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
జాతీయ విద్యా విధానంలో భాగంగా తమపై హిందీ రుద్దుతున్నారని తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో నిరసనలు జరుగుతూ ఉంటాయి. తమ భాషలను ఇతర రాష్ట్రాల్లో నేర్పిస్తారా అని అక్కడి నేతలు ప్రశ్నిస్తూ ఉంటారు. వారి భాషల్ని కూడా నేర్పిస్తూంటారు. తెలుగు కూడా అందులో ఒకటి.