Proddutur MLA daughter's wedding : ప్రొద్దటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద రెడ్డి పెద్ద కుమార్తె పల్లవి వివాహాన్ని నిరాడంబరంగా ఓ ఆలయంలో నిర్వహించారు. బొల్లవరంలోని వేంకటేశ్వర ఆలయంలో ఈ పెళ్లి జరిగింది. తర్వాత ప్రొద్దుటూరులోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేయించారు. ఎమ్మెల్యే పెద్ద కమార్తె పల్లవి చదువుకునే రోజుల్లో పవన్ కుమార్ అనే సహాధ్యాయిని ప్రేమించారు. ఈ విషయం ఇంట్లో వారికి చెప్పి వారి అనుమతితోనే పెళ్లి చేసుకోవాలనకున్నారు. కుటుంబంలో తీవ్రంగా చర్చించిన తర్వాత పిల్లల అభిప్రాయాలకు గౌరవం ఇవ్వాలని ఎమ్మెల్యే ప్రసాదరెడ్డి నిర్ణయించుకున్నారు. డబ్బు, కులమతాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా.. పిల్లల అభీష్టానికి అనుగుణంగా పెళ్లి చేయించినట్లుగా ఎమ్మెల్యే తెలిపారు.
చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటామని ప్రకటన - ఎంపీ మాధవ్ హౌస్ అరెస్ట్ !
తాను నిరాడంబరంగా తన మొదటి కుమార్తె పల్లవి ప్రేమ, కులాంతర వివాహానికి ఒప్పుకుని ఆశీర్వదించాను అన్నారు. తన కుమార్తె ఇష్ట ప్రకారం దగ్గరుండి వివాహం చేశానని.. పేదవాడైన పవన్‌ను కలిసి చదువుకున్న రోజుల్లో పల్లవి ఇష్టపడటంతో పెళ్లి చేసినట్లు చెప్పారు. డబ్బుకు, హోదాకు, కులానికి విలువ ఇవ్వకుండా వారి ఇష్ట ప్రకారమే పెళ్లి చేసినట్లు చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయంపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
1, 2, 3, 4, 5, కౌంట్ పెరుగుతుందా? ఇక్కడితో ముగుస్తుందా? తిరుమల భక్తుల్లో తొలగని భయం!
రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్‌సీపీ సీనియర్ నేతగా ఉన్నారు. ఆయన రెండో సారి ఆ పార్టీ తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కడప జిల్లాలో వైఎస్ఆర్ కంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల్లో ఒకరు అయిన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి .. పెద్ద కుమార్తె వివాహాన్ని.. కులాంతర వివాదం..అదీ కూడా నిరాడంబరంగా చేయడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమయింది. ఆయన తీరును అందరూ ప్రశంసిస్తున్నారు. కులాల పేరుతో అర్థం లేని పట్టింపులకు పోవడం.. ఆస్తులు, అంతస్తుల పేరుతో ప్రేమించుకున్న పిల్లల్ని విడదీయడం వల్ల వారి జీవితాల్లో ఇబ్బందులు సృష్టంచడమే అవుతుందని అందుకే ఎమ్మెల్యే తన కుమార్తె ను నిండు మనుసుతో కులాంతర వివాహానికి అంగీకరించారని అంటున్నారు.