Ongole News: ప్రకాశం జిల్లా ఒంగోలులో (Ongole Fire Accident) పెద్ద అగ్నిప్రమాదం జరిగింది. వేమూరి కావేరి (Vemuri Kaveri) సంస్థకు చెందిన ప్రైవేటు బస్సులు మంటల్లో దగ్ధం అయ్యాయి. స్థానిక ఉడ్ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న కావేరీ ట్రావెల్స్ బస్ పార్కింగ్ స్టాండ్‌లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఏకంగా 10 బస్సులు అగ్నికి ఆహుతయ్యాయి. మరో రెండు బస్సులకు మంటలు వ్యాపించాయి. పార్కింగ్ స్టాండ్‌లో దాదాపు 20కి పైగా బస్సులు ఉన్నాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపుచేస్తున్నారు. మిగిలిన బస్సులను తరలించేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తోంది. అయితే, అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Also Read: Telangana News: దేశంలోనే తెలంగాణకు టాప్ ప్లేస్, ఏడేళ్లలోనే ఏ రాష్ట్రంలో లేనంతగా
ఈ సమాచారాన్ని అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. మంటల్లో దగ్ధమైన బస్సులు అన్నీ కావేరి ట్రావెల్స్ కు సంబంధించినవని తెలిసింది. మంటల కారణంగా ఏర్పడిన దట్టమైన పొగ వల్ల చుట్టుపక్కల నివసించే వారు భయాందోళనలకు లోనయ్యారు.
Also Read: Guntur: బీటెక్ స్టూడెంట్స్ గలీజు పని! ఊళ్లో అమ్మాయిల ఫోటోలు తీసి భారీగా సొమ్ము, ఆందోళనలో గ్రామస్థులు
బస్సులన్నింటినీ పక్క పక్కనే నిలిపి ఉంచారు. వాహనాల్లో డీజీల్ పూర్తి స్థాయిలో ఉండడం కూడా మంటలు త్వరగా వ్యాప్తి చెందడానికి కారణమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆరు ఫైరింజన్ల సహాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. రెండు గంటల పాటు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే పార్కింగ్ స్థలంలో గడ్డి, పిచ్చి మొక్కలను తొలగించని కారణంగా మంటలు త్వరగా వ్యాప్తి చెందడానికి ఓ కారణంగా అగ్నిమాపక సిబ్బంది చెబుతున్నారు.
Also Read: Hyderabad Gun Fire: రియల్ ఎస్టేట్ వ్యాపారులపై తుపాకీ కాల్పులు, హైదరాబాద్ శివారులో కలకలం