వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాకు సొంత పార్టీలో పరిస్థితులు ఏ మాత్రం అనుకూలంగా లేవు. ఎంపీపీ ఎన్నికల్లో తన వర్గీయులను చైర్మన్లుగా ఎంపిక చేసుకునేందుకు పార్టీ తరపున అధికారికంగా అనుమతి తెచ్చుకున్నప్పటికీ నియోజకవర్గంలోని మండల స్థాయి నేతలు మాత్రం ఆమె మాట వినడం లేదు. ముఖ్యంగా నిండ్ర మండలంలో ఎంపీపీ ఎన్నిక విషయంలో  ఆమె మాటను ఎంపీటీసీలు లెక్క చేయడం లేదు. ఫలితంగా అక్కడ ఎన్నిక కూడా జరగలేదు.


కరోనా మరణాలకు పరిహారం ! లెక్కల్లో వేయని వారి కుటుంబాలు అన్యాయమైపోయినట్లేనా..!?


నిండ్ర మండలంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడైన చక్రపాణి రెడ్డి పార్టీ వ్యవహారాలను చక్కబెడుతూ ఉంటారు. నిండ్ర ఎంపిపి స్థానానికి ఎమ్మెల్యే  ఆర్కే రోజా దీపా అనే అభ్యర్థిని ఎంపిక చేశారు.  అయితే ప్రస్తుతం శ్రీశైలం బోర్డు చైర్మన్ గా ఉన్న చక్రపాణి రెడ్డి మాత్రం తన  తమ్ముడు భాస్కర్ రెడ్డిని ఎంపీపీగా చేయాలని ఐదుగురు ఎంపీటీసీలతో క్యాంపు నిర్వహించారు. దీంతో 24వ తేదీన జరగాల్సిన ఎంపీపీ ఎన్నిక శనివారానికి వాయిదా పడింది.  ఎంపీపీ ఎన్నికల కోసం మండల పరిషత్ కార్యాలయానికి వచ్చిన రోజా భాస్కర్ రెడ్డితో వాగ్వాదానికి దిగారు.  జాయింట్ కలెక్టర్ సమక్షంలో విమర్శలు చేసుకున్నారు. పార్టీ హైకమాండ్ దీపను ఎంపీగా ఎన్నిక చేసుకోమన్నారని రోజా చెప్పినా భాస్కర్ రెడ్డి వర్గం వినలేదు. దాంతో వారి ఓటింగ్‌ను రోజా అడ్డుకున్నారు.


శ్రీవారి సర్వదర్శనం 35 రోజుల టికెట్లు.. 30 నిమిషాల్లోనే ఖాళీ


వైయస్‌ఆర్‌ పార్టీని వ్యతిరేకించే వారు మాకొద్దు....వైసీపి వెన్నుపోటు దారులు మాకొద్దు...జగన్‌ గారి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలతో హోరెత్తించారు. పోలీసులు కూడా రోజాకే సహకరిస్తున్నారంటూ చక్రపాణి వర్గం రోడ్డుపై బైఠాయించింది.  శుక్రవారం విజయాపురం ఎంపిపిగా రాజుల వర్గానికి చెందిన లక్ష్మీపతిరాజును పార్టీ నిర్ణయించింది. కానీ రోజా మాత్రం అభ్యర్థిని ్మార్చింది. ఓ దళిత ఎంపీటీసీని ఎంపీపీగా ఎంపిక చేసి.. తన వర్గం వారితో ఓట్లేయించి గెలిపించారు. దాంతో వర్గ పోరు మరింత ముదిరింది.


టీడీపీ - జనసేన కలిస్తే అంత లాభమా ! వచ్చే ఎన్నికల్లో పొత్తులకు స్థానిక ఫలితాలు దారి చూపాయా ?


రోజాకు నగరిలో సొంత పార్టీలో అసమ్మతి ఇదే మొదటి సారి కాదు. ఇటీవల్ల కాలంలో పార్టి కార్యక్రమాల్లో సైతం రోజా ఒంటరిగా పాల్గొంటున్నారు.  పంచాయతీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో‌ రోజా ఒంటరిగా ప్రచారం సాగించి సొంత పార్టి నేతలను గెలిపించుకునేందుకు ప్రయత్నాలు చేశారు. మంచి ఫలితాలు సాధించారు. అయితే అసమ్మతి మాత్రం రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గీయులు నగరిలో అన్ని మండలాల్లో ఉండటంతో  రోజా మాటలు వారు వినడం లేదు. దాంతో ఆమె ప్రతీ సారి అసహనానికి గురవుతున్నారు. 


 


Also Read : నిండు గర్భిణి ప్రాణాలు కాపాడిన దిశ యాప్..


 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి