Gudivada News :  అమరావతి రైతుల మహా పాదయాత్ర గుడివాడకు చేరనున్న సమయంలో  పోలీసులు పూర్తి స్థాయిలో పట్టణాన్ని దిగ్బంధించారు.  పాదయాత్ర రూట్లలో  గుడివాడలో పోలీసులు ఆకస్మిక ఆంక్షలు విధించారు. గుడివాడలో 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లు  పోలీసుల ప్రకటించారు. పాదయాత్రకు సంబంధం లేని వ్యక్తులు గుడివాడ వైపు రావద్దని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు నిబంధలను ఉల్లంఘించి, సంఘీభావం పేరుతో పాదయాత్రలో పాల్గొంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.   అమరావతి రైతుల మహాపాదయాత్ర పై  కృష్ణాజిల్లా పోలీస్ యంత్రాంగం పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించింది. 


నాలుగు వందల మందికిపై పోలీసులతో  గుడివాడలో మార్చ్ !


నాలుగు వందల మందికి పైగా పోలీసులు, అధికారులు గుడివాడలో బందోబస్తు నిర్వహిస్తున్నారు.  ముందస్తు చర్యగా వజ్రా వాహనాలు,స్వాట్ టీంలను రంగంలో  అధికారులు రంగంలోకి దించారు.  పట్టణపుర వీధుల్లో కవాతు నిర్వహించారు.  నిబంధనలను అతిక్రమించి అల్లర్లకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించిన డీఎస్పీ సత్యానందం హెచ్చరించారు.  ఇప్పటికే రెడ్డి పాలెంలో మేము ఎవరి జోలికి రాం .. మా జోలికి వస్తే ఎగరేసి నరుకుతాం అంటూ వైఎస్ఆర్‌సీపీ రెడ్డి యూత్ పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పోలీసులు వీటిని తొలగించినప్పటికీ పెట్టిన వారిపై చర్యలు తీసుకోలేదు. అదే సమయంలో గుడివాడ ఎమ్మెల్యే , మాజీ మంత్రి కొడాలి నాని అమరావతి వ్యతిరేకంగా చాలా వ్యాఖ్యలు చేశారు. 


అమరావతికి వ్యతిరేకంగా ఘాటుగా విమర్శలు చేసిన కొడాలి నాని 


ఇటీవల అసెంబ్లీలోనూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. పాదయాత్ర చేస్తున్న వారు రైతులు కాదు రియల్ ఎస్టేట్ బ్రోకర్లని హెచ్చరించారు.  ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందుకే ముందు జాగ్రత్తగా గుడివాడలో భారీ ఎత్తున పోలీసుల్ని మోహరించి భద్రతా ఏర్పాట్లను చేపట్టినట్లుగా పోలీసులు చెబుతున్నారు. అయితే రైతులు మాత్రం తమ యాత్రకు వస్తున్న స్పందన చూసి.. పోలీసులు ప్రజల్ని నియంత్రించడానికే ఇలా చేస్తున్నారని అంటున్నారు. మద్దతు తెలిపేందుకు వచ్చే వారి పై ఆంక్షలు విధించి.. జనం ఎవరూ రాలేదని చెప్పడానికి అధికార పార్టీ నాయకులతో కలిసి ఇలా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. 


పాదయాత్రకు ప్రజలు మద్దతు తెలియచేయకుండా కుట్ర పన్నుతున్నారంటున్న రైతులు


అమరావతి రైతుల పాదయాత్ర గుడివాడ నియోజకవర్గం మీదుగా సాగనుంది. ఇతర నియోజకవర్గాల్లో ఎక్కడా టెన్షన్ ఏర్పడలేదు కానీ.. వైఎస్ఆర్‌సీపీ విధానం ప్రకారం అమరావతిపై ఘాటు వ్యాఖ్యలను  చేసిన కొడాలి నాని నియోజకవర్గం వచ్చే సరికి సీన్ మారిపోయింది. అక్కడ ఉద్రిక్త  పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పోలీసులు ముందు జాగ్రత్తల కోసమేనని చెబుతున్నారు కానీ..  అమరావతి రైతులు మాత్రం రాజకీయ కుట్ర అని ఆరోపిస్తున్నారు.  అయితే గుడివాడ నియోజకవర్గంలో పాదయాత్ర పూర్తయ్యే వరకూ ఆంక్షలు అమలు చేయాలని .. పోలీస్ యాక్ట్ 30ని అమలు చేయాలని నిర్ణయించారు.  దీంతో  గుడివాడ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 


మార్చెయ్యటానికీ, తీసెయ్యటానికి ఎన్టీఆర్ అన్నది పేరు కాదు: బాలకృష్ణ ఘాటు వ్యాఖ్యలు