Police arrest ITDP activist Kiran: వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి గురించి అనుమచి వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త కిరణ్ ను మంగళగిరి పోలీసులు అరెస్టు చేశారు. కిరణ్ కుమార్ ను సెల్ టవర్ లొకేషన్ ఆధారంతో విజయవాడ, ఇబ్రహీం పట్నం ప్రాంతంలో అరెస్ట్ చేశారు.
అంతకు ముందు చేబ్రోలు కిరణ్ చేసిన అసభ్య వ్యాఖ్యలపై TDP కఠినంగా స్పందించింది. TDP నుంచి ఆయనను సస్పెండ్ చేసి, పోలీసులకు ఫిర్యాదు చేయాలని నేతలకు ఆదేశించింది. దీనిపై గుంటూరు పోలీసులు చేబ్రోలు కిరణ్ పై కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేశారు.
అయితే అంతకు ముందే కిరణ్ తాను తప్పుగా మాట్లాడానని క్షమించాలని కోరుతూ ఓ వీడియో రిలీజ్ చేశారు.
చేబ్రోలు కిరణ్ టీడీపీ తరపున సోషల్మీడియాలో మాట్లాడుతూ ఉంటారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు కౌంటర్ ఇస్తూంటారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి పోలీసులను ఉద్దేశించి బట్టలు ఊడదీస్తాం అని చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా ఆయన జగన్ కుటుంబసభ్యుల ప్రస్తావన తీసుకు రావడంతో వివాదాస్పదమయింది.
కిరణ్ తమ పార్టీ కార్యకర్త అయిన గీత దాటతంతో టీడీపీ హైకమాండ్ వెంటనే స్పందించి చర్యలు తీసుకుంది. ఆయనకు ఓ చిన్న కార్యకర్త అయినా సరే ఇలాంటి చర్యలు తీసుకున్నారని వైసీపీలో అనేక మంది నేతలు.. చంద్రబాబు కుటుంబాన్ని అత్యంత ఘోరంగా మాట్లాడారాని.. టీడీపీ కార్యకర్తలు వీడియోలు పెడుతున్నరాు. వారందర్నీ ఎప్పుడు అరెస్టు చేస్తారని టీడీపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.
సోషల్ మీడియా కార్యకర్తలు గీత దాటి పోవడంతోనే సమస్యలు వస్తున్నాయి. నోరు అదుపులో పెట్టుకోకపోవడం వ్యూస్ కోసం.. ఇతర విషయాల్లో నేతల మెప్పు కోసం వారు ఇలాంటి మాటలు మాట్లాడుతూండటంతో.. రాజకీయాల్లో ఓ చెడు సంప్రదాయం ప్రారంభమవుతుంది. అయితే సొంత పార్టీ వారైనా సహించేది లేదన్న సంకేతాలను టీడీపీ ప్రభుత్వం పంపడంతో.. ఇలా మాట్లాడే అందరికీ గట్టి హెచ్చరిక పంపినట్లయింది.