Home Minister Pawan: అత్యాచార నిందితుల్ని పోలీసుల వేగంగా అరెస్టు చేయకపోవడంపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పిఠాపురం పర్యటనలో ఉన్న ఆయన పోలీసుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. క్రిమినల్స్‌కు కులం, మతం ఉంబోవన్నారు. అత్యాచార నిందితుల్ని  అరెస్టు చేయడానికి కులం ఎందుకు అడ్డం వస్తోందని ఆయన ప్రశ్నించారు. అత్యాచార ఘటనలకు హోంమంత్రి బాధ్యత తీసుకోవాలన్నారు. అదే తాను హోంమంత్రిగా బాధ్యతలు తీసుకుంటే పరిస్థితి వేరుగా ఉండేదన్నారు. జిల్లా అధికారులు, ఎస్పీలకు పవన్ కల్యాణ్ స్పష్టమైన సూచనలు చేశారు. తాము ఎవరినీ వెనకేసుకు రావడం లేదని మీరు కూడా వెనుకేసుకురావొద్దని స్పష్టం చేశారు. మాది ప్రతీకార ప్రభుత్వం కాదని .. అలాగని చేతకాని ప్రభుత్వం కాదన్నారు.


ప్రస్తుతం జరుగుతున్న ఘోరాలన్నీ గత ప్రభుత్వ వారసత్వాలే ! 


శాంతిభద్రతలు చాలా కీలకమైనవని పవన్ కల్యాణ్ అన్నారు. సమాజంలో చిచ్చు పెట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి భావ ప్రకటనా స్వేచ్చ అంటున్నారని విమర్శలు గుప్పించారు. పదే పదే మాతో చెప్పించుకోవద్దని పోలీసులకు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పుడు జరుగుతున్న తప్పిదాలన్ని గత ప్రభుత్వ వాసరత్వాలేనన్నారు. పవన్ కల్యాణ్ ఇదే సమావేశంలో ఇసుకతో పాటు ఇతర విషయాల్లో జరుగుతున్న అంశాలు, వస్తున్న ఆరోపణలపైనా స్పందించారు. గత ప్రభుత్వంలో జరిగినట్లుగా ఇప్పుడు జరిగితే సహించే ప్రశ్నే లేదని ఆయన స్పష్టం చేశారు.         


వక్ఫ్ బిల్లుకు టీడీపీ వ్యతిరేకమని టీడీపీ నేత ప్రకటన - జాతీయ రాజకీయాల్లో కలకలం - అసలు నిజమేంటి ?


హోంమంత్రి మంత్రి పని తీరు పవన్‌కు నచ్చలేదా ? 


పవన్ కల్యాణ్ తాను హోంమంత్రిని అయితే అనే ప్రస్తావన రావడం కలకలం రేపుతోంది. అదే సమయంలో హోంమంత్రి అనిత కూడా బాధ్యత తీసుకోవాలని ఆయన చెప్పారు. అనిత హోంమంత్రిగా సమర్థంగా పని చేయడం లేదని ఆయన చెప్పకనే చెప్పారని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏపీలో పలు చోట్ల అత్యాచార ఘటనలు జరుగుతున్నాయి. వీటిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారా లేదా అన్న అంశంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. పిఠాపరంలోనూ ఓ టీడీపీ నేత మహిళపై  అత్యాచారం చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఆయనను అరెస్టు చేశారు.           


పార్టీకి ఉపయోగపడకుంటే రాజకీయాలు ఎందుకయ్యా? మంత్రి సుభాష్‌కు చంద్రబాబు క్లాస్‌- ఆడియో వైరల్ 


తానే హోంమంత్రిని అయితే అనే మాట ఎందుకు అన్నారు ?            


పవన్ కల్యాణ్ ఒక్క పిఠాపురం గురించి మాత్రమే కాకుండా.. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఘటనలపై స్పందించారని అంటున్నారు. అయితే అత్యాచార నిందితుల్లో అరెస్టులు ఆలస్యం అవుతున్న విషయాన్ని పవన్ ప్రస్తావించారని.. అంటున్నారు. ఏదో కేసు విషయంలో పవన్ కల్యాణ్‌కు కులం కారణంగా నిందితుల్ని అరెస్టు చేయలేదన్న సమాచారం అంది ఉంటుందని .. అదుకే ఆయన ఇలా  స్పందించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పవన్ స్పందనతో పోలీసులు అధికారులు ఎంత వేగంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.