Pawan Kalyan About missing women and girls In AP: 


వైసీపీ పాలనలో భారీగా బాలికలు, మహిళల అదృశ్యం అయ్యారని పార్లమెంటు సాక్షిగా నిజాలు వెల్లడయ్యాయని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి అన్నారు. 2019-21 వరకు మూడేళ్లలో ఏపీలో మొత్తం 7,928 మంది బాలికలు, 22,278 మంది మహిళల అదృశ్యం అయ్యారని ట్వీట్ చేశారు. కేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా బుధవారం రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో మహిళలు, బాలికల మిస్సింగ్ పై కింది వివరాలు వెల్లడించారు. 


2019 నుంచి 2021 వరకు 3 సంవత్సరాలలో ఏపీ ఒక్క రాష్ట్రం నుంచి మొత్తం 30,196 మంది మహిళలు అందులో 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 7918 మంది బాలికలు, 18 ఏళ్లు పైబడిన 22,278 మంది మహిళలు అదృశ్యమయ్యారు అని పవన్ కళ్యాణ్ మరోసారి తన వాదను ట్విట్టర్ ద్వారా వినిపించారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో తప్పిపోయిన బాలికలు, మహిళల సంఖ్య పెరగడం ఆందోళనకు గురి చేస్తుందన్నారు. కానీ మన అమ్మాయిలు ఎందుకు తప్పిపోయారు, దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారు అని జనసేనాని మరోసారి ప్రశ్నించారు. 






పార్లమెంట్ సాక్షిగా తాను చెప్పినట్లే రాష్ట్రంలో మహిళల మిస్సింగ్ జరిగిందని తేలిపోయింది. పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో చేసిన ఆరోపణలు నిజమని, ఆయన ఏపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేసినవి కావని ఏపీ ప్రజలు భావిస్తున్నారు. అయితే ఈరోజు పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి ఇచ్చిన వివరాలపై ఏపీ మహిళా కమిషన్ ప్రెస్ మీట్ వచ్చి దీనిపై రేపు మాట్లాడుతుందా అని ప్రశ్నించారు. ఏపీ మహిళా కమిషన్, హోంశాఖ, డీజీపీని వివరణ కోరుతుందా? ఇకనైనా ఏపీ మహిళా కమిషన్ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుందా? అంటూ జనసేనాని ట్విట్టర్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు.






ఆంధ్రప్రదేశ్‌ లో 2019లో 2186 మంది బాలికలు మిస్సయ్యారు. అంటే 18ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉన్న వారిని బాలికల కేటగరిలో చేరుస్తారు. 6252 మంది మహిళలు మిస్సయ్యారు. అలాగే 2020లో 2374 మంది బాలికలు, 7057  మంది మహిళలు ఆచూకీ లేకుండా పోయారు. 2021లో ఈ సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. 3358 మంది బాలికలు .. 8969  మంది మహిళలు కనిపించకండా పోయారు. మొత్తంగా వీరి సంఖ్య 30196  మంది.  వీరిలో కొంత మంది ఆచూకీ తర్వతా తెలిసిందని కేంద్ర హోంశాఖ చెబుతోంది. 


పవన్ చేసిన కామెంట్లపై మహిళా వాలంటీర్లు ఫిర్యాదు చేయగా జనసేనానిపై కేసు నమోదు అయింది. మహిళా కమిషన్ సైతం పవన్ చేసిన వ్యాఖ్యలపై ఆయనకు నోటీసులిచ్చింది. అయినా పవన్ వెనక్కి తగ్గకుండా మహిళల మిస్సింగ్ నిజమేనని బల్లగుద్ది మరీ వాదించారు. నేడు పార్లమెంట్లో ఇదే వివరాలు వెల్లడి కావడంతో పవన్ చెప్పిందే నిజమని తేలిపోయింది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial