ABP  WhatsApp

Pawan Kalyan : జనసేన కౌలు రైతు భరోసా నిధికి పవన్ తల్లి అంజనా దేవీ విరాళం

ABP Desam Updated at: 25 Jun 2022 10:00 PM (IST)
Edited By: Satyaprasad Bandaru

Pawan Kalyan : జనసేన పార్టీ చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్ర నిధికి పవన్ తల్లి అంజనా దేవి రూ.లక్షన్నర విరాళం అందించారు.

పవన్ కు చెక్ అందజేస్తున్న అంజనా దేవీ

NEXT PREV

Pawan Kalyan : జనసేన చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్ర ప్రత్యేక నిధికి ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తల్లి అంజాదేవి విరాళం అందజేశారు. తన వంతు సాయంగా రూ. లక్షన్నర సాయం అందించారు. జనసేన పార్టీకి మరో రూ.లక్ష విరాళం అందజేశారు. పవన్‌ కల్యాణ్ తండ్రి వెంకట్రావు జయంతి సందర్భంగా ఈ విరాళం చెక్కును హైదరాబాద్‌లో పవన్‌కు అందజేశారు అంజాదేవి. తన తండ్రి పింఛను డబ్బులను ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న కౌలు రైతు కుటుంబాలను ఆదుకోవడానికి ఇచ్చినందుకు తల్లికి పవన్‌ కృతజ్ఞతలు తెలిపారు. 


 ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ కౌలు రైతుల భరోసా యాత్ర ప్రత్యేక నిధి, జనసేన పార్టీకి విరాళం అందించిన తన తల్లికి కృతజ్ఞతలు తెలిపారు. సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్నే కొనసాగించాలని ఎందుకు కోరుకుంటానంటే అది మా ఫ్యామిలీకి భావోద్వేగంతో కూడుకున్న విషయం అన్నారు. అందుకే సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తానన్నారు. ఉద్యోగులకు అండగా ఉంటామని పవన్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ కోశాధికారి ఎ.వి.రత్నం కూడా పాల్గొన్నారు. 






సీపీఎస్ రద్దు అందుకే 



ఈ రోజు మా నాన్న గారి జయంతి సందర్భంగా జనసేన కౌలు రైతుల నిధికి రూ.1.50 లక్షలు, జనసేన పార్టీకి రూ. లక్ష చెక్ రాసిచ్చారు. మా నాన్న పింఛన్ డబ్బులు దాచుకుని ఈ రోజు కౌలు రైతుల కుటుంబాలకు ఇవ్వడం ఎంతో అభినందనీయం. మా నాన్న గారు పోలీసు డిపార్ట్ మెంట్, ఆ తర్వాత అబ్కారీ శాఖలో పనిచేశారు. 2007లో మా నాన్న కాలం చేసిన తర్వాత 2008 నుంచి మా అమ్మ గారి పింఛను వస్తుంది. ఆ డబ్బులు దాచి సేవ కార్యక్రమాలు వినియోగిస్తుంటారు. మా అమ్మకు అందకు కృతజ్ఞతలు చెబుతున్నారు. సీపీఎస్ ను రద్దు చేయాలని అందుకే నేను కోరుతున్నాను. పింఛన్ పాత విధానం మాకు భావోద్వేగంతో కూడుకుంది. పాత పింఛను విధానాన్ని మళ్లీ తీసుకువచ్చేలా కృషి చేస్తాను. అందుకు ఉద్యోగులకు అండగా నిలబడతాను. - - పవన్ కల్యాణ్, జనసేన అధ్యక్షుడు 

Published at: 25 Jun 2022 10:00 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.