TS EAMCET 2022 : తెలంగాణ ఎంసెట్ హాల్ టికెట్లు విడుదల అయ్యాయి. రాష్ట్రంలో జులై 14 నుంచి ఎంసెట్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. eamcet.tsche.ac.in వెబ్ సైట్ లో హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఎంసెట్‌ కన్వీనర్‌ తెలిపారు. జులై 14, 15 తేదీల్లో అగ్రికల్చర్‌, మెడిసన్‌, 18, 19, 20 తేదీల్లో ఇంజినీరింగ్‌ ఎంసెట్‌ పరీక్షలు నిర్వహించనున్నారు.


హాల్ టికెట్లు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి



  1. ఎంసెట్ వెబ్‌సైట్ eamcet.tsche.ac.in ఓపెన్ చేయండి

  2. వెబ్‌సైట్ హోం పేజీలో 'Hall Ticket Download' ఆప్షన్‌పై క్లిక్ చేయండి

  3. అక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ నమోదు చేసి సబ్మిట్ చేయండి

  4. స్క్రీన్‌పై హాల్ టికెట్ డిస్‌ప్లే అవుతుంది

  5. హాల్ టికెట్‌పై  అభ్యర్థి వివరాలన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి 

  6. హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసి ప్రింట్ అవుట్ తీసుకోండి 


పరీక్షలు ఎప్పుడంటే? 


ఇంట‌ర్మీడియేట్ ఉత్తీర్ణత(Intermediate) సాధించిన విద్యార్థులు ఇంజినీరింగ్‌, అగ్రిక‌ల్చర్‌, మెడిక‌ల్ కోర్సులో చేరేందుకు ఎంసెట్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఎంసెట్(EAMCET) ప‌రీక్షను జేఎన్‌టీయూ హైద‌రాబాద్‌ నిర్వహిస్తుంది. టెక్నాలజీ, ఇంజినీరింగ్(Engineering Courses) కోర్సుల్లో ప్రవేశాలు పొంద‌డానికి అభ్యర్థులు ఇంటర్ లో మ్యాథ‌మెటిక్స్‌, కెమిస్ట్రీ, బ‌యోటెక్నాల‌జీ, బ‌యోల‌జీ స‌బ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించాలి. ఆప్షన‌ల్, ఒకేష‌న‌ల్ కోర్సుల పాస్ అయి లేదా డిప్లొమా చివ‌రి ఏడాది చ‌దువుతున్న వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఏప్రిల్ 6 నుంచి మే 28వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో విద్యార్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీకరించారు. ఎంసెట్ అగ్రిక‌ల్చర్(Agriculture), మెడిసన్ పరీక్షను జులై 14, 15వ తేదీల్లో, ఇంజినీరింగ్ పరీక్షను జులై 18, 19, 20వ తేదీల్లో నిర్వహించనున్నారు. 


ఇంటర్ మార్కుల వెయిటేజ్


ఎంసెట్‌ పరీక్ష పూర్తైన నెల రోజుల్లోపు ఎంసెట్‌ ర్యాంకులు ప్రకటించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో తెలంగాణ ఎంసెట్‌కు ఇంటర్‌ మార్కుల(Inter Marks) వెయిటేజ్‌ కలిపేవారు. కానీ ఈసారి ఇంటర్ మార్కుల వెయిటేజీ ఎంసెట్ కు ఉండదని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల్లో కనీస మార్కులతో విద్యార్థులను ప్రమోట్‌ చేశారు. దీంతో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో ఎంసెట్‌ అర్హత మార్కులు 40 శాతం ఉండాలన్న నిబంధనను ఎత్తివేస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. 


Also Read : Telangana Inter Results 2022: గత ఏడాది కరోనా పాస్ - కానీ ఈసారి విద్యార్థులు తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఇలా చెక్ చేసుకోవాలి