Pawan Kalyan:  జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు.  ఎన్డిఏ కూటమి సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన ఆయన... ఆ సమావేశం తర్వాత  బీజేపీ కీలక నేతలతో చర్చలు జరిపారు. ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ మురళీధరన్‌తో పాటు మరికొంత మంది కీలక నేత్లల్ని కలిసి చర్చలు జరిపారు.  సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోనూ సమావేశమయ్యారు. ఏపీ రాజకీయాలపై కీలక అంశాలను వీరు చర్చించినట్లుగా తెలుస్తోంది. గురువారం  కూడా పవన్ కల్యాణ్ ఢిల్లీలోనే ఉండే అవకాశాలు ఉన్నాయని జనసేన వర్గాలు చెబుతున్నాయి.  కొంత మంది కీలక నేతలతో చర్చలు జరిపనున్నట్లుగా చెబుతున్నారు. 





 


మురళీధరన్‌తో కీలక చర్చలు


ఉదయం ఆంధ్రప్రదేశ్ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జ్ మురళీధరన్‌తో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆయనతో పాటు నాదేండ్ల మనోహర్ కూడా ఉన్నారు. మురళీధరన్‌తో కలిసి అల్పాహార సమావేశం నిర్వహించారు. 15 నిమిషాల పాటు వీరిద్దరి మధ్య రాజకీయాలపై చర్చ జరిగింది.  ఏపీలో మూడు పార్టీలు కలిసి పోటీ చేయాలని పవన్ అంటున్నారు. అయితే టీడీపీ, బీజేపీ మధ్య అభ్యంతరాలు ఉన్నాయని.. ఆ పార్టీలే పరిష్కరించుకోవాల్సి ఉందని పవన్ అన్నారు. ఈ క్రమంలో .. టీడీపీ తో పొత్తు విషయంపై మురళీధరన్ తో పవన్ కల్యాణ్ చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది.      
              






ఇతర బీజేపీ నేతలతో రహస్య చర్చలు 


ఢిల్లీలో ఏపీ బీజేపీ వ్యవహారాలను తెర వెనుక చక్కదిద్దే ఇతర నేతల్ని కొంత మందిని పవన్ కల్యాణ్ తెలిసినట్లుగా తెలుస్తోంది. ఏపీలో పరిస్థితులపై వారికి నివేదిక ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితి .. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత.. పార్టీలన్నీ కలిసి పని చేస్తే వచ్చే  ప్రయోజనాల గురించి వివరించినట్లుగా తెలుస్తోంది. మరో వైపు రాష్ట్రంలో బీజేపీతో కలిసి వెళ్లే అంశంపైనా చర్చించినట్లుగా చెబుతున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడుగా ఉన్న సోము వీర్రాజును మార్చి.. పురందేశ్వరిని నియమించారు. ఈ కారణంగా బీజేపీ తీరులోనూ మార్పు వచ్చిందని వైసీపీపై విరుచుకుపడుతున్నారని ఇప్పుడు జనసేన, బీజేపీ కలిసి పని చేయవచ్చని సూచించారని అంటున్నారు.                  


పవన్ కల్యాణ్‌తో సమావేశం అయిన రఘురామ


ఢిల్లీలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా పవన్ కల్యాణ్‌తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య రాష్ట్రంలో పరిస్థితులపై చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. వైసీపీని పూర్తిగా విబేధించిన తర్వాత రఘురామ..కూడా అన్ని పార్టీలు కలిసి పోటీ చేయాలని చెబుతున్నారు. ఈ క్రమంలో వారి భేటీ హాట్ టాపిక్ అవుతోంది. వచ్చే ఎన్నిక్లలో ఏ పార్టీలో చేరి పోటీ చేయాలన్న అంశంపై రఘురామకృష్ణరాజు ఇంకా  నిర్ణయం తీసుకోలేదు. పొత్తులను బట్టి ఆయన జనసేనలోనూ చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు.