Pawan Kalyan donated ten crores of hard earned money for the party :  జనసేన పార్టీని తన కష్టార్జితంతో నడుపుతున్నారు పవన్ కల్యాణ్.  పార్టీ నిర్వహణ అవసరాలకు రూ.10 కోట్ల స్వార్జితాన్ని విరాళంగా అందించారు. జనసేన పార్టీ ఉన్నతి కోసం మొదటి నుంచి తన స్వార్జితాన్ని పార్టీ కోసం వెచ్చిస్తూ వస్తున్న జనసేన అధ్యక్షులు ఎన్నికల సందర్భంగా పార్టీ నిర్వహణ కోసం  మరోసారి భారీ విరాళాన్ని అందించారు. జనసేన పార్టీ నిర్వహణ అవసరాల నిమిత్తం రూ.10 కోట్ల స్వార్జితాన్ని విరాళంగా అందించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  నాగబాబు   సమక్షంలో పార్టీ కోశాధికారి  ఎ.వి‌.రత్నంకు విరాళం చెక్కులను అందజేశారు. 


తన పారితోషికం నుంచి ఎప్పటికప్పుడు పార్టీకే కాకుండా సామాజిక సేవలకు, అధ్యాత్మిక కార్యక్రమాలకు, ఆపదలో ఉన్నవారిని ఆదుకొనేందుకు విరాళం ఇస్తుంటారు. కౌలు రైతు భరోసా యాత్ర నిర్వహించి ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు తలా ఓ లక్ష రూపాయలు ఇచ్చారు. ఇలా రూ. 30 కోట్లకుపైగా ఇచ్చారు., ఇక పార్టీ నిర్వహణ అంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అయినా సొంత డబ్బులే పెట్టుకుంటూ వస్తున్నారు.  స్వతంత్ర సంగ్రామాన్ని ముందుకు నడపించడానికి మోతీలాల్ నెహ్రూ వంటి గొప్ప నాయకులు తమ స్వార్జితాన్ని ఉద్యమానికి విరాళంగా ఇచ్చేవారని వారినే తాను స్ఫూర్తిగా తీసుకున్నట్లుగా పవన్ కల్యాణ్ ప్రకటించారు. 


ఆ రోజుల్లో  స్వతంత్ర సంగ్రామాన్ని ముందుకు నడపించడానికి   తమ సొంత డబ్బును అప్పటి మహనీయులు  వెచ్చించిన తీరు గొప్పదని..   ఓ సదాశయం కోసం, రాష్ట్ర భవిష్యత్తును సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా జనసేన సాగిస్తున్న రాజకీయ ప్రయాణానికి నా వంతుగా ఇప్పుడు ఎన్నికల ప్రచార ఖర్చుల నిమిత్తం రూ.10 కోట్లను అందజేస్తున్నానని పవన్ తెలిపారు.  ఇది పార్టీకి ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నానన్నారు.  జనసేన పార్టీ ప్రయాణానికి సగటు కూలి తన చిన్నపాటి సంపాదనలో రూ.వంద పక్కన పెట్టి పార్టీ ఎదుగుదలకు ఎంతగానో తోడ్పాడుతున్నారు. ఓ బెల్దారీ మేస్త్రి రూ.లక్ష విరాళం అందించారు. అలాగే పింఛను నుంచి వచ్చే సొమ్ములో కొంత భాగం పార్టీకి తమ వంతుగా పంపుతున్న సగటు మనుషులెందరో ఉన్నారని.  వారంతా ఎన్నో ఆశలతో, ఆశయాలతో నిర్మించిన పార్టీ కోసం తమ వంతు సాయం అందిస్తున్నారని గుర్తు చేసుకున్నారు.                               


 అలాంటి వారి స్ఫూర్తితో నేను  సినిమాల ద్వారా వచ్చిన నా కష్టార్జితాన్ని, ప్రభుత్వానికి పన్నులు కట్టిన తర్వాత నా దగ్గర ఉన్న డబ్బును పార్టీ కోసం అందించడం చాలా సంతోషంగా ఉందని పవన్ తెలిపారు. జనసేన పార్టీకి  కార్పొరేట్ విరాళాల కన్నా.. పార్టీ కార్యకర్తలు సమకూర్చే నిధులే ఎక్కువగా వస్తాయి. జనసైనికులు తమ సంపాదనలో ఎంతో కొంత పార్టీకి ఇస్తున్నందున పవన్ కూడా తన సంపాదనలో అధిక భాగం పార్టీ కోసం ఖర్చు పెడుతున్నారు.