ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ (అర్బన్) సింగ్ నగర్ కు చెందిన వల్లుపు శ్రీరాములు (23 సంవత్సరాలు) సెంటిరింగ్ వర్క్ పనిచేస్తుండగా ప్రమాదవశాత్తూ కింద పడిపోయాడు. తలకు బలమయిన గాయం తగలటంతో స్థానికులు, కుటుంబసభ్యులు అంబులెన్స్ ద్వారా మణిపాల్ హాస్పిటల్ విజయవాడకు తరలించారు. శ్రీరాములు ఆరోగ్య పరిస్థితిని చూసిన వైద్యులు తనకి క్రేనియోటమీ శస్త్ర చికిత్సను నిర్వహించారు. అయినప్పటికీ తన ఆరోగ్య పరిస్థితిలో ఎటువంటి మార్పు కనిపించలేదు. వైద్య పరీక్షలు అనంతరం శ్రీరాములును బ్రెయిన్ డెత్ గా పరిగణించారు.


తన భార్య వసంత, తండ్రి ఏడుకొండలు తల్లి సుశీలలు అంగీకారం మేరకు ఆంధ్రప్రదేశ్, జీవనదాన్ చైర్మన్ డా. కె. రాంబాబు, హాస్పిటల్ డైరెక్టర్ డా. సుధాకర్ కంటిపూడి గార్ల ఆధ్వర్యంలో అవయవదానం జరిగింది. దీనిలో కాలేయం, ఒక కిడ్నీని మణిపాల్ హాస్పిటల్ విజయవాడలోని అవసరమయిన వారికి ట్రాన్స్ ప్లాంటేషన్ నిర్వహించారు. మరొక కిడ్నీని ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం గుంటూరులోని వేదంత హాస్పిటల్ కు తరలించారు. ఈ మంచి కార్యానికి ముందుకు వచ్చినందుకు దాత కుటుంబానికి మణిపాల్ హాస్పిటల్స్ కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు మణిపాల్ హాస్పిటల్స్ ఓ ప్రకటన విడుదల చేసింది.