Nara Lokesh :  రెండు రోజుల విచారణలో ఇన్నర్ రింగ్ రోడ్ కేసుతో సంబంధం లేని ప్రశ్నలే అడిగారని.. సీఐడీ పోలీసులు తన రెండు రోజుల సమయం వృధా చేశారని నారా లోకేష్ ఆరోపించారు. రెండో రోజు సీఐడీ ఆఫీసులో విచారణకు హాజరైన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. సంబంధం లేని ప్రశ్నలు పదే పదే అడిగారన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్‌తో తనకేం సంబంధమని నారా లోకే,్ ప్రశ్నించారు. ఒక్క రోజు మాత్రమే విచారించమని హైకోర్టు చెప్పిందని ఆయనా తనను రెండో రోజు రావాలని నోటీసులు ఇచ్చారన్నారు. సీఐడీ అడిగిందని  తాను రెండో రోజు కూడా హాజరయ్యానన్నారు. ఈ కేసులో మరోసారి రావాలని ఏమైనా లేఖ ఇస్తారా అని అడిగానని..కానీ తన ప్రశ్న కు సీఐడీ అధికారులు సమాధానం చెప్పలేదన్నారు.   

  


రెండో రోజు 47 ప్రశ్నలు అడిగారు. అవి కూడా నిన్న అడిగిన ప్రశ్నలే మళ్లీ మళ్లీ అడిగారvf..  వాషింగ్‌ మెషీన్‌లో వేసి తిప్పినట్టుగా మంగళవారం అడిగిన ప్రశ్నలే తిప్పి.. తిప్పి అడిగారని కొత్త వేమీ అజగలేదున్నారు.  భువనేశ్వరి ఐటీ రిటర్న్స్‌ డాక్యుమెంట్‌ నా ముందు పెట్టి  ప్రశ్నించారు.  భువనేశ్వరి ఐటీ రిటర్న్స్‌ మీ వద్దకు ఎలా వచ్చిందని దర్యాప్తు అధికారిని అడిగితే సమాధానం చెప్పలేదన్నారు.  దీనిపై న్యాయ పరంగా పోరాటం చేయాలనుకుంటున్నానని స్పష్టం చేశారు.  ఇన్నర్‌ రింగ్‌రోడ్డుకు సంబంధించి కేవలం నాలుగైదు ప్రశ్నలు మాత్రమే అడిగారు. నా శాఖకు సంబంధం లేని ప్రశ్నలు పదే పదే అడిగారన్నారు. 


హెరిటేజ్‌ కొనుగోలు చేసిన 9 ఎకరాలు గూగుల్‌ ఎర్త్‌లో చూపించారని.. అయితే  ఐఆర్‌ఆర్‌ వల్ల హెరిటేజ్‌ భూములు కోల్పోయినట్టు చూపించారన్నారు. హెరిటేజ్ భూమి ఐఆర్ఆర్‌లో పోతున్నట్లుగా తనకు ఇప్పుడే తెలిసిందన్నారు.   ఐఆర్ఆఆర్ అలైన్ మెంట్‌లో తనకు , కుటుంబ సభ్యులకు ఎలాంటి పాత్ర లేదు. పదేళ్ల నుంచి మా కుటుంబ సభ్యల ఆస్తులు ప్రకటిస్తున్నామన్నారు.  రెండు రోజుల పాటు తన  సమయం వృథా చేశారని ్న్నారు.  స్కిల్‌ కేసులో సంతకాలు పెట్టిన ఇద్దరు అధికారులను ఎందుకు విచారించట్లేదని లోకేష్ ప్రశ్నించారు.   ప్రేమ్‌చంద్రారెడ్డి, అజేయ కల్లంను ఎందుకు విచారించట్లేదు. పాలసీ ఫ్రేమ్‌ చేసిన చంద్రబాబును మాత్రం రిమాండ్‌కు పంపారన్నారు.                                 


లింగమనేని రమేశ్‌ ఇంట్లో అద్దెకు ఉంటూ రూ.27లక్షలు రెంటల్‌ అడ్వాన్స్‌ కట్టారని చెప్పారు. రెంటల్‌ అడ్వాన్స్‌కు సంబంధించి ఐటీ రిటర్న్స్‌లో లేదని చెప్పారు. ఐటీ రిటర్న్‌లకు సంబంధించి ఆడిటర్‌ను అడగాలని చెప్పా. ఇంట్లో ఉండి అద్దె చెల్లిస్తే క్విడ్‌ ప్రోకో ఎలా అవుతుందని  అని లోకేశ్‌ ప్రశ్నించారు. లోకేష్‌కు సీఐడీ అధికారులు మళ్లీ నోటీసులు జారీ చేయకపోవడంతో.. మళ్లీ విచారణకు హాజరయ్యే అంశంపై స్పష్టత లేదు. ఇప్పటికే ఈ కేసులో సెక్షన్లు మార్చామని... 41ఏ నోటీసులు ఇచ్చి విచారణ చేస్తామని కోర్టుకు చెప్పారు.