TR Jayanti :  తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు,  మాజీ ముఖ్యమంత్రి, నవరస నట సార్వాభౌముడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనను  ప్రధాని మోదీ సహా ప్రముఖులు గుర్తు చేసుకున్నారు.  ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎన్టీఆర్ గురించి తెలుగులో ట్వీట్ చేశారు.  తెలుగు సినీ రంగంలో విశిష్ట నటుడైన ఆయన ఎంతో దార్శనికత గల నాయకుడు. సినీ, రాజకీయ రంగాలకు ఆయన చేసిన సేవలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. తెరపై ఆయన ధరించిన పాత్రలను , ఆయన నాయకత్వ పటిమను ఇప్పటికీ తలచుకుంటారు ఆయన అభిమానులు . ఆయన కలలు కన్న సమాజం కోసం మేము నిరంతరం పని చేస్తామని ప్రకటించారు. 



 మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించారు. ప్రజా జీవితంలో చేసిన సేవలకు భారతరత్న పురస్కారం సముచిత గౌరవం అని  భావిస్తున్నాను. తెలుగు వారి ఈ చిరకాల కోరికని కేంద్ర ప్రభుత్వం తప్పక మన్నిస్తుందని ఆశిస్తున్నానని ట్వీట్ చేశారు. 


 





 


తెలంగాణ సీఎం రేవంత్  రెడ్డి కూడా స్పందించారు. ఆయన కాంగ్రెస్ తరపున సీఎంగా ఉన్నప్పటికీ నివాళి అర్పించారు. ఎన్టీఆర్ తెలగు జాతి చిహ్నమని.. 101 జయంతి సందర్భంగా ఘన నివాళి అని ప్రకటించారు.  





 విజయశాంతి కూడా సోషల్ మీడియాలో ఎన్టీఆర్‌కు నివాళి అర్పించారు. భారత రత్న ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.                                    


 



ఎన్టీఆర్ జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు స్మరించుకుని ఆయనకు  భారతరత్న ఇవ్వాలన్న అభిప్రాయాన్ని చెప్పారు.