వైసీపీలో కూడా అంతర్యుద్ధం మొదలైందని, కొంతమంది నిజాయితీ పరులు, సమాజం మేలుకోలేవారు ఆ పార్టీలో ఉండలేరని చెప్పారు చంద్రబాబు. అలాంటి వారంతా బయటకు రావాల్సిందేనని అభిప్రాయపడ్డారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు... వైసీపీకి ఓటమి భయం పట్టుకుందని కామెంట్స్ చేశారు.
ప్రజలే ఛాలెంజ్ చేసే సమయం వచ్చిందని చెప్పారు చంద్రబాబు. ముందస్తు ఎన్నికల కోసమే జగన్, ప్రధాని మోదీ దగ్గరకు వెళ్లారని, బాబాయ్ హత్య కేసు గురించి కూడా మాట్లాడారని విమర్శించారు. సోదరుడి కోసం ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టారన్నారు. రాజ్యసభ సీట్లు 3 అమ్ముకున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఓటుకి 10వేలు కూడా ఇవ్వాలని వైసీపీ నేతలు అనుకుంటున్నారని అన్నారు. అయితే ప్రజల్లో పోరాటం మొదలైందని, అది అ స్టాపబుల్ అని చెప్పారు.
లోకేష్ పాదయాత్రను అడ్డుకుంటామని మంత్రులంటే వారించాల్సిన సీఎం... కామ్ గా ఉన్నారంటే అతను సైకో కాక ఇంకెవరని ప్రశ్నించారు చంద్రబాబు. పిచ్చోడి చేతిలో రాయి ఉంటే, ఎవరిమీదైనా వేస్తారని, లేకపోతే తనపైనే వేసుకుంటాడని చెప్పారు. దేశంలో అందరు ముఖ్యమంత్రుల కంటే సంపన్నుడు జగన్ అని గుర్తు చేశారు. కోర్టు ధిక్కరణ కేసులు ఆయనపైనే ఉన్నాయని చెప్పారు. జడ్జిలను కూడా బ్లాక్ మెయిల్ చేసిన ఘనత వైసీపీ నేతలకు దక్కుతుందన్నారు. జడ్జిలంటే వారికి భయం లేదని, గౌరవం లేదని, బ్లాక్ మెయిల్ చేస్తున్నారని చెప్పారు. నెల్లూరులో మంత్రి కాకాణి కోర్టు కేసు ఫైలు దొంగలు తీసుకెళ్లారని, అది ఎంతో ఇన్నోవేటివ్ ఐడియా అని ఎద్దేవా చేశారు. కోర్టులో సాక్ష్యాలను కూడా దొంగతనం చేయగలమన్న ధీమా వారికి ఉందని చెప్పారు. కాకాణిపై విసుర్లు.. 11 వ తేదీ మంత్రి కాగానే 13వతేదీ రాత్రి కోర్టులో కేసు ఫైల్ మాయమైందని, ఆ తర్వాత ఆయన వీరుడు లాగా అందరిపై విరుచుకుపడుతున్నారని చెప్పారు. అలాంటివారందరికీ బట్టలిప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు చంద్రబాబు.
మంత్రులకు బాధ్యత లేదని, సైకో చెప్పాడని, అందరూ సైకోలుగా మారారని అన్నారు చంద్రబాబు. అసెంబ్లీలో స్పీకర్, ఎమ్మెల్యేలు, మంత్రుల పద్ధతి బాగోలేదన్నారు. అసెంబ్లీకి ప్రతిపక్ష పార్టీ నేతలు వెళ్లే పరిస్థితి లేదన్ను. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ ఫండ్స్ అన్నీ డైవర్ట్ చేశారని, ఎస్సీ సబ్ ప్లాన్ తీసేశారని విమర్శించారు.
పోలవరం పూర్తి చేసి నదులు అనుసంధానం చేస్తే కరవు ఉండేది కాదన్నారు, టీడీప హయాంలో పోలవరానికి సంబంధించి 72శాతం పనులు పూర్తయ్యాయని, అన్నీ పూర్తి చేసి 2020కి డ్యామ్ పూర్తి చేసేవాళ్లం అని, కానీ వైసీపీ అధికారంలోకి వచ్చి సర్వ నాశనం చేసేసిందన్నారు చంద్రబాబు. 2024కి కూడా పోలవరం పూర్తి కాదని పార్లమెంట్ లో కేంద్ర మంత్రులు చెబుతున్నారన్నారు. కర్నూలుకి న్యాయరాజధాని తరలిస్తామన్న జగన్, ఇప్పుడు జ్యుడీషియల్ అకాడమీని కర్నూలులో ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారని ప్రశ్నించారు.
రాష్ట్రంలో ప్రజల పరిస్థితి చూడలేక బాదుడే బాదుడు మొదలు పెట్టామని, ఏప్రిల్ లోల బాదుడే బాదుడికి జనం బాగా వచ్చారని, ఆ తర్వాత మహానాడుకి కూడా ఇబ్బంది పెట్టారని చెప్పారు. సీఎం పర్యటనకు వస్తున్నారంటే, స్కూళ్లు మూసేస్తున్నారని, ఆర్టీసీ బస్సులు టేకోవర్ చేస్తున్నారని, పెన్షన్ కట్, రేషన్ కట్ అంటూ బెదిరింపులకు దిగుతున్నారని మండిపడ్డారు చంద్రబాబు. కొంతమంది ఇప్పుడే బయటపడటంలేదని, కానీ అందరూ తిరగబడే రోజు దగ్గర్లోనే ఉందన్నారు.
అవినీతి పరుడు దోచుకుంటాడు, అసమర్థుడు ఏమీ చేయకుండా ఉంటాడు. కానీ జగన్ ఇలాంటి వ్యక్తి అన్ని వ్యవస్థలనూ నాశనం చేస్తాడని చెప్పారు చంద్రబాబు. అన్నిటికీ ప్రజలు భయపడే రోజులొస్తున్నాయని.. 2022లో అన్నీ పీక్స్ కి వెళ్లాయి, 2023 ఒక హోప్ తో మొదలవ్వాలని చెప్పారు.