కందుకూరు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు రెండు లక్షల రూపాయల పరిహారం అందజేశారు. గాయపడిన వాళ్లకు చెరో యాభై వేలు ప్రకటించారు. 






ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు బహిరంగ సభలో జరిగిన దుర్ఘటన వల్ల తాను తీవ్రంగా కలత చెందానని ఉదయం పీఎంవో ట్వీట్ చేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను అంటూ పేర్కొన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాట్టు వెల్లడించారు. 


పిఎంఎన్‌ఆర్‌ఎఫ్‌ నుంచి మృతుల కుటుంబసభ్యులకు రూ.2 లక్షలు,క్షతగాత్రులకు రూ. 50,000 చొప్పున ఎక్స్ గ్రేషియా మంజూరు చేస్తామని ట్విటర్ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది. 


అసలేం జరిగిందంటే


నెల్లూరు జిల్లా కందుకూరులో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నిర్వహించిన సభలో కొందరు కార్యకర్తలు, అభిమానులు మురుగునీటి కాల్వలో పడిపోవడంతో అపశృతి చోటుచేసుకుంది. ఐదుగురు కార్యకర్తలు చనిపోగా, మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ మరో ముగ్గురు చనిపోగా, మృతుల సంఖ్య 8కు చేరింది. వారిని కాల్వ నుంచి బటయకు తీసి, గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.


గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని చంద్రబాబు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఇలాంటి ఘటన జరగడం బాధాకరం అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన చంద్రబాబు, వారి ఫ్యామిలీస్‌కి టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. తమకు చెందిన ట్రస్టుల నుంచి వారి పిల్లల చదువులు లాంటి అవసరమైనన అన్ని సదుపాయాలు కల్పిస్తాం అన్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు చంద్రబాబు. సభకు హాజరైన వారు ఇంటికి తిరిగి వెళ్లేటప్పుడు జాగ్రత్తగా వెళ్లాలన్నారు. చనిపోయిన వారి కోసం సభ వద్ద మౌనం పాటించారు. చంద్రబాబు కొన్ని నిమిషాల ముందు నుంచే హెచ్చరిస్తున్నా కార్యకర్తలు పట్టించుకోలేదు. ఈ క్రమంలో తీవ్ర విషాదం చోటుచేసుసుకుంది.


అసలేం జరిగిందంటే..
ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు పర్యటించారు. ఇటీవల చంద్రబాబు నిర్వహిస్తున్న కార్యక్రమాలకు అనూహ్య స్పందన వస్తోంది. ఈ క్రమంలో బుధవారం నాడు కందుకూరులో నిర్వహించిన సభ (Chandrababu Kandukuru Meeting)కు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ క్రమంలో పార్టీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగినట్లు తెలుస్తోంది. గుండంకట్ట ఔట్‌లెట్‌లో కొందరు టీడీపీ కార్యకర్తలు జారిపడిపోయారు. మురుగునీటి కాల్వలో పడిపోయిన వారిలో ఐదుగురు చనిపోయారని చంద్రబాబు ప్రకటించారు. మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఇలా జరగడంతో సభ మధ్యలోనే ఆపేసి ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శిస్తున్నానని చెప్పారు. కందుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి గాయపడ్డ కార్యకర్తలతో పాటు చనిపోయిన కార్యకర్తల కుటుంబ సభ్యలను పరామర్శించారు.